భారతావని జబ్బు
పడ్డది -పద్మజ షా
(పద్మజ షా గారు జర్నలిస్టు.
హైదరాబాద్ నివాసి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో
కాలమిస్టు. ఈ ఆర్టికల్ మొదట ఆంగ్లంలో ఇండియన్ ఎక్స్
ప్రెస్ పత్రికలో అచ్చయింది. కొంత భాగాన్నిమాత్రమే( వ్యాసం పెద్దగా ఉంటుందని భయంతో )తెలుగు
అనువాదం చేసి దాన్ని కూడా మూడు భాగాలుగా రాస్తున్నాను)
ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ ఇలా
అంటాడు: “మనం జబ్బు పడకుండా ఉండాలంటే చివరి ప్రయత్నంగా మనం ప్రేమించడం మొదలు
పెట్టాలి. ప్రేమించ లేకపోతే కనక… మనం
జబ్బు పడక తప్పదు.” మనిషిని
వివేకవంతునిగా ఉంచటంలో అత్యంత అవసరమైన మానవ స్వాభావిక
ప్రవృత్తి ప్రేమ. కులం, వర్గం,
మతం, జాతి
లేదా తెగ.. ఇత్యాదిగా గల
సకల కృత్రిమ విభజనలను ప్రేమ అధిగమిస్తుంది. అది ఒకరి ఆదేశాల్ని అనుసరించి ప్రదర్శితం అయ్యేది కాదు;
అది జరగాలని మీరు స్వయంగా ఆదేశిస్తే,
జరుగుతుంది; దాని
అవసరం లేదని మీరు భావిస్తే అది సంభవించదు.
కులం పేరుతో, రోమియో
వ్యతిరేక దళాల పేరుతో లేదా లవ్ జిహాద్ పేరుతో ప్రేమలో ఉన్న
యువతీ యువకులపై దాడులు జరగడం అంతకంతకూ పెరుగుతుండడం బట్టి,
కండలు పెంచినప్పటికీ
అస్వస్థంగా ఉన్న సమాజం మన
చుట్టూ వ్యాపించి ఉన్నదని స్పష్టం
అవుతోంది. ఈ రోగ పీడిత సమాజానికి ప్రేమ అంటే ఒక చెడ్డ పదం –అదొక చెడ్డ భావోద్వేగం. ప్రేమ అంటే,
ఒకరి మానవత్వం తన అసలు స్వభావంతో ఆవిష్కృతం కావటం అని అర్ధం చేసుకోగల సామర్ధ్యం
దానికి లేదు.
ప్రేమ
రహిత అస్వస్థ
సమాజం ఒక రోమియో వ్యక్త పరిచే ప్రేమ పొంగును నాశనం
చేసేస్తుంది. అతని
ప్రేమకు జూలియట్ తన ప్రేమ ద్వారా ప్రతిస్పందించడం వారి
ఆగ్రహానికి కారణం అవుతుంది. రోమియో అండ్ జూలియట్ కధను షేక్ స్పియర్ 1590లలో
రచించాడు.
“మన భారతీయులం ప్రేమ వల్ల చాలా అవమానానికి
గురవుతాం, కానీ హింస విషయానికి వచ్చేసరికి చెలరేగిపోతాం. టెలివిజన్,
సినిమాలు లాంటి ప్రజా సాంస్కృతిక
మాధ్యమాలు హింసను ఉత్సవం రీతిలో వినియోగించుకునేందుకు
నిరాటంకంగా అనుమతి ఉంటుంది.
కానీ ప్రేమ వ్యక్తీకరణను మాత్రం కోపంతో తిరస్కరిస్తాం;
అసంతృప్తితో రగిలిపోతాం.” 1960లలో
సినిమా సెన్సార్ షిప్ విషయంలో ఒక నివేదిక వెలువరిస్తూ
ఖోస్లా కమిటీ ఈ మాటలు చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు
పరిస్ధితిలో వచ్చిన మార్పు ఏమీ లేదు.(Watch
10TV story in full on Madhukar murder with police and politicians’ collusion)
(.......ఇంకా రెండు భాగాలుగా వుంది.....)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment