రామచంద్రుడు
రాజు కాకపోయింటే బాగుండేది
వాస్తవానికి
వనవాసానికి వెళ్ళే సమయానికి రామ చంద్రుడు రాజు అయ్యుంటే బాగుండేది.
సీతమ్మవారిని అడవులకి పంపించే సమయానికి రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది
సీతమ్మవారిని అడవులకి పంపించే సమయానికి రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది
ప్రజామోద్యంగా
ప్రజారంజకంగా పరిపాలించడం రాజు విధి!. రామ చంద్రుండు అదే తు.చ. తప్పకుండా "ధర్మంగా"
చేశాడు...
వనావాసనికేగే
నాటికి రాముడు ఇంకా చక్రవర్తి కాలేదు... అయ్యుంటే, ఒక రాజుగా, ప్రజాఆమొద్యం
మేరకి కానలకి వెళ్లి వుండేవాడు కాదు.ఎందుకంటే అయోధ్య అయోధ్య మొత్తం
రామున్ని వెళ్లవద్దని వారించింది ... వేడుకొన్నది... అడ్డుకునంది. కాని రాముడు అప్పుడు ఓ పుత్రుడు , తండ్రి మాటని నెరవేర్చడమే
అప్పుటికి తన విధి.
కాని..,,,
మన దురదృష్టానికి సీతమ్మ వారిని అడవులకి పంపించే సమయానికి మాత్రం రామచంద్రుడు ఓ చక్రవర్తి!
మన దురదృష్టానికి సీతమ్మ వారిని అడవులకి పంపించే సమయానికి మాత్రం రామచంద్రుడు ఓ చక్రవర్తి!
నిజానికి
సీతమ్మ వారి మీద చాకలి కూతలని అప్పటి ప్రజలెవ్వరూ ఖండించనూ లేదు, సీతమ్మ వారిని
అలా అడవులకి పంపించినపూడు "పంపించవద్దు" అని ప్రజలలో ఎవ్వరూ వారించలేదు... అలా జరిగి ఉన్నింటే రాముడు అమ్మవారీని పంపించి వేసే
వాడు కాదు... సీతారాముల దాంపత్యం కలకాలం హాయిగా గడిచి ఉండేది...
ప్రజామోధ్యం
మేరకి అమ్మవారిని వదులుకున్న రాముడు రాజుగా చేసిన అతి గొప్ప వ్యక్తిగత త్యాగమది....
ఇక్కడ ఇంకో అతి
ముఖ్య మైన విషయం చెప్పుకోవాలి ...
చాకలి నింద
విషయం రామునికి కాకుండా సీతమ్మకే ముందు తెలిసి ఉండింటే , ఒక మహారాణి గా, సామ్రాజ్ఞి గా ,
అయోధ్య పట్టమహిషి గా, ముఖ్యంగా
"రాముడి మనోజ్ఞ" గా తనకితానుగా అడవులకి వెల్లిపోయి ఉండేది... అది
అప్పటి వారి ధర్మం!... వారి గొప్ప జీవన విధానం! .. అది అలాగే జరిగింది.
ఎందుకంటే అది సజీవ-చరిత్ర...." ఎందుకు అలానే జరిగింది అని ప్రశ్నించడం
మూర్ఖులు చేసే పని"
మన దురదృష్టం
ఏమిటంటే రామాయణం చదువుకునే నాధుడే కరువయ్యాడు... కేవలం విన్న వాటితో వాదాలకి
దూషణలకి దిగుతున్నారు సిగ్గునొదిలి!
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment