Wednesday, May 31, 2017

ఇదీ వేయాల్సిన ప్రశ్న



ఇదీ వేయాల్సిన ప్రశ్న
నీవు హిందువు కావచ్చు,ముస్లిం కావచ్చు,క్రైస్తవుడవు కావచ్చు, మనిషివి ఎప్పుడౌతావు?
నీవు బ్రాహ్మణుడవు, క్షత్రియుడవు, వైశ్య, కమ్మ, రెడ్డి, కాపు, వెలను, షెడ్యూల్ కులం కావచ్చు. మనిషిగా ఎప్పుడు మారతావు?
ఏం జరగాలి?
పేర్లలో కులాన్ని సూచించడం మానాలి. ఇకముందు అలాంటి పేర్లు పెట్టవద్దని తల్లిదండ్రులకు చెప్పాలి.
దరఖాస్తుల్లో కులం మతం ప్రస్తావన తొలగించాలి
కుల సభలకు, సమావేశాలకు ప్రజా ప్రతినిధులు వెళ్ళరాదు. వాటిని నిరసించాలి. ప్రభుత్వం ఏ స్థాయిలోనూ వాటికి గుర్తింపు యివ్వరాదు. వాటి కట్టడాలకు అనుమతి నిరాకరించాలి.
కులబోధన చేసే అంశాలు పాఠాలలో రాకుండా చూడాలి. కులచరిత్ర చెప్పి కుల విషబీజాల్ని పిల్లలకు విడమరచాలి.
కులాంతర వివాహాలు చేసుకున్నవారికి కులం పాటించరాదు. వారి సంతానానికీ అంతే. అలా వివాహాలు చెసుకున్నవారు ప్రస్తుతం తమ సంతానానికి తండ్రి కులాన్ని పాటిస్తున్నారు. రిజర్వేషన్ల లాభాలు పొందే నిమిత్తం కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.
కులాంతర వివాహాలకు అత్యధికంగా,అపరితంగా ప్రభుత్వ ప్రోత్సాహం లభించాలి. ఆర్ధికంగా,సామాజికంగా అనేక విధాల యీ సహాయం వుంటే త్వరగా కులాంతర వివాహాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
కుల, మతపరమైన ఆస్తులకు పన్నుల మినహాయింపు ఎలాంటి స్థితిలోనూ యివ్వరాదు. ఇవి వ్యాపార పద్ధతులుగా స్వీకరించి, పన్నులు వేసి వసూలు చెయ్యాలి. ఈ నియమం ఆశ్రమాలకు,దేవాలయాలకు, చర్చీలకు,వక్ఫ్ బోర్డులకు, బాబాలకు, మాతాశ్రమాలకు విధిగా అన్వయించాలి.
కులం పేరెత్తడం సిగ్గుచేటుగా చూచే అలవాటు రావాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681



Tuesday, May 30, 2017

రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది


రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది



వాస్తవానికి వనవాసానికి వెళ్ళే సమయానికి రామ చంద్రుడు రాజు అయ్యుంటే బాగుండేది.
సీతమ్మవారిని అడవులకి పంపించే సమయానికి రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది

ప్రజామోద్యంగా ప్రజారంజకంగా పరిపాలించడం రాజు విధి!. రామ చంద్రుండు అదే తు.చ. తప్పకుండా "ధర్మంగా" చేశాడు...

వనావాసనికేగే నాటికి రాముడు ఇంకా చక్రవర్తి కాలేదు... అయ్యుంటే, ఒక రాజుగా, ప్రజాఆమొద్యం మేరకి కానలకి వెళ్లి వుండేవాడు కాదు.ఎందుకంటే అయోధ్య అయోధ్య మొత్తం రామున్ని వెళ్లవద్దని వారించింది ... వేడుకొన్నది... అడ్డుకునంది. కాని రాముడు అప్పుడు ఓ పుత్రుడు , తండ్రి మాటని నెరవేర్చడమే అప్పుటికి తన విధి.

కాని..,,,
మన దురదృష్టానికి సీతమ్మ వారిని అడవులకి పంపించే సమయానికి మాత్రం రామచంద్రుడు ఓ చక్రవర్తి!

నిజానికి సీతమ్మ వారి మీద చాకలి కూతలని అప్పటి ప్రజలెవ్వరూ ఖండించనూ లేదు, సీతమ్మ వారిని అలా అడవులకి పంపించినపూడు "పంపించవద్దు" అని ప్రజలలో ఎవ్వరూ వారించలేదు... అలా జరిగి ఉన్నింటే రాముడు అమ్మవారీని పంపించి వేసే వాడు కాదు... సీతారాముల దాంపత్యం కలకాలం హాయిగా గడిచి ఉండేది...

ప్రజామోధ్యం మేరకి అమ్మవారిని వదులుకున్న రాముడు రాజుగా చేసిన అతి గొప్ప వ్యక్తిగత త్యాగమది....

ఇక్కడ ఇంకో అతి ముఖ్య మైన విషయం చెప్పుకోవాలి ...

చాకలి నింద విషయం రామునికి కాకుండా సీతమ్మకే ముందు తెలిసి ఉండింటే , ఒక మహారాణి గా, సామ్రాజ్ఞి గా , అయోధ్య పట్టమహిషి గా, ముఖ్యంగా "రాముడి మనోజ్ఞ" గా తనకితానుగా అడవులకి వెల్లిపోయి ఉండేది... అది అప్పటి వారి ధర్మం!... వారి గొప్ప జీవన విధానం! .. అది అలాగే జరిగింది. ఎందుకంటే అది సజీవ-చరిత్ర...." ఎందుకు అలానే జరిగింది అని ప్రశ్నించడం మూర్ఖులు చేసే పని"

మన దురదృష్టం ఏమిటంటే రామాయణం చదువుకునే నాధుడే కరువయ్యాడు... కేవలం విన్న వాటితో వాదాలకి దూషణలకి దిగుతున్నారు సిగ్గునొదిలి!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Monday, May 29, 2017

నవ్వటం నిజంగా నవ్వులాట కాదు



నవ్వటం నిజంగా నవ్వులాట కాదు ! నవ్వులపాలవుకుండా మరొకర్ని నవ్వులపాలు చేయకుండా నవ్వించడం ప్రధానం! నవ్వు సహజమైన పెయిన్ కిల్లర్! అందుకే        ఈనాటి స్పీడ్ యుగంలో నవ్వే దివ్యౌషధం!! హరికధా పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు శివునిపై ప్రార్ధనను హాస్యంగా ఆంగ్ల భాషాపదాలను ఉపయోగించి ఇలా చెప్పారు.
       "హెడ్డున మూను, స్కిన్నుపై అంతను డస్టును ఫైరు నేత్రమున్,
         సైడున గ్రేట్ బుల్లు, బహు చక్కని గేంజస్ హెయిర్ లోపలన్,
          బాడీకి హాఫెయౌచు నల పార్వతి మౌంటెన్ డాటరుండ
          ష్టుడ్డు డివోటీ దండము, ప్రేయరు చేయుచున్"
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, May 26, 2017

స్వేచ్ఛను ఇచ్చిన ‘ప్రేమ’





భౌతికంగా స్త్రీ, పురుషులు సమానులు కారు. ఈ అసమానతను కాల గమనంలో సమాజం వ్యవస్థీకృతం చేసింది. అయితే వ్యవసాయం చేయడం మొదలైన తర్వాతే పురుషాధిక్య భావన పెరిగిందనే ఆధారాలు ఉన్నాయి. స్త్రీ కన్నా పురుషుడు సహజంగానే మెరుగైనవాడని, ఆమె పాత్ర పిల్లలకు జన్మనివ్వడం, పురుషుడికి సేవ చేయడం వరకేనని ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ భావించాడు. పూర్వం చర్చి కూడా ఈ అసమానతను వ్యవస్థీకృతం చేసింది. భారత్‌లో మనువు ఇదే చేశాడు.
మహిళను కామ వస్తువుగానో, భోగ వస్తువుగానో చూడటం మాని, శృంగారభరితమైన ప్రేమతో ఆరాధించే భావన 12వ శతాబ్దంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఫలితంగా సామాజిక కట్టుబాట్లు తెగిపోయి, ఆమెకు కొంత స్వేచ్ఛ, సమానత్వం లభించాయి. ఈ ప్రేమ వైయక్తికమైనది. ఈ ప్రేమ ఉన్న వారు తాము ప్రేమించే వారిని సమోన్నతులుగా చూస్తారు. అప్పటివరకు మహిళను వస్తువులా పరిగణించిన పురుషుడు ఈ భావన మూలంగా మనిషిగా చూడటం మొదలైంది. ఈ భావన పాశ్చాత్య దేశాల్లో పుట్టిందనుకుంటే పొరబడినట్లే. దాదాపు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా మూడు చోట్ల ఇది వికసించినట్లు తెలుస్తోంది. మూడు అసాధారణ రచనల్లో ఇది వ్యక్తమైంది. అవేంటంటే- ఐరోపాలో జోసెఫ్‌ బిడీయర్‌ వెలువరించిన ట్రిస్టన్‌ అండ్‌ ఐసోల్డే’, ఇస్లామిక్‌ పర్షియాలో నిజామీ గంజావీ రాసిన లైలా మజ్ను’, రాధాకృష్ణుల పవిత్ర ప్రణయంపై భారత్‌లో జయదేవుడు రాసిన గీతగోవిందం’. ఈ ఉన్నతమైన ప్రేమ భావనకు ముందు చాలా వరకు కేవలం లైంగికవాంఛతో కూడిన ప్రేమే ఉండేది. అందులో స్త్రీ కేవలం ఒక వస్తువు. స్త్రీని శృంగారభరితమైన ప్రేమతో ఆరాధించే భావన భారత్‌, పర్షియాలలో కంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా పరిణతి చెందుతూ వచ్చింది. 18వ శతాబ్దం నాటికి వివేచన భావనగా రూపాంతరం చెందింది. ఆ సమయంలోనే ఆధునిక వివాహ వ్యవస్థ ఏర్పడింది. అప్పటివరకు స్త్రీ, పురుషుల మధ్య బంధం కుటుంబాన్ని వృద్ధి చేసుకునే ఆర్థిక ఏర్పాటుగా ఉండేది. దాని స్థానంలో ప్రేమ ప్రాతిపదికగా నవీన వివాహ వ్యవస్థ వచ్చింది. 19 శతాబ్దంలో ఓటుహక్కు కోసం పోరాటాలతో, 20వ శతాబ్దంలో మహిళా ఉద్యమాలతో పురుషాధిక్యాన్ని మగువ సవాలు చేసింది. ఇది పాశ్చాత్య సమాజంలో పెను మార్పులను తెచ్చింది. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా విడాకులు పొందే వెసులుబాటు, గర్భవిచ్ఛిత్తి హక్కు, ఆస్తి హక్కు, సముచిత వేతనాలు లాంటివి సాధ్యమయ్యాయి. ఇవన్నీ నేడు విశ్వవ్యాప్తమవుతున్నాయి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card