Wednesday, August 01, 2018

మనకు ఓటు హక్కు వుంటుంది కానీ లైంగిక హక్కులు వుండవు


మనకు ఓటు హక్కు వుంటుంది కానీ లైంగిక హక్కులు వుండవు
             మా ఊళ్లో  పురుషుడినైన ఒకతని వయసు 18 ఏళ్లు...అతనొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ.. అది బాల్య వివాహం కింద లెక్కగట్టి.. పోలీసు స్టేషనులో రెండు చెంపలు వాయించి ఇంటికి పంపారు. పెళ్లయితే అయింది కానీ.. ఒక అచ్చటా ముచ్చటా లేకుండా.. 21వ ఏడాది వచ్చేదాకా ఎదురుచూపులతోనే సరిపోయింది..
           ఈలోగా మా ఊళ్లో జమిలి ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యే ఎన్నిక, ఎంపీ ఎన్నికలు.పద్దెనిమిదేళ్ల పోరగాడినైన అతనికి ఓటు హక్కు కూడా వచ్చింది. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ప్రత్యక్ష పద్ధతిలో.. తద్వారా ఒక రాష్ట్రపతిని, రాజ్యసభ సభ్యులను పరోక్షంగా గెలిపించుకునే అవకాశం అతనికి పద్దెనిమిదేళ్ల పోరగాడిగా వున్నప్పుడే వచ్చింది.
         కానీ.. అతనికి భార్యతో సంసారం చేసే అవకాశం మాత్రం దక్కలేదు. ఎందుకంటే అతను మైనర్. 21 ఏళ్లు రాకుండా పెళ్లే చేసుకోకూడదు. ఏదో దొంగచాటు పెళ్లి చేసుకున్నా, కానీ 21 ఏళ్లు రాకుండా కాపురం చేయకూడదు. అది మన చట్టాలకు విరుద్ధం.
          మన దేశాన్నేలే ఎమ్మెల్యేలు, ఎంపీలను, మనకోసం చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలను మనం 18 ఏళ్లకే ఎన్నుకోవచ్చు. కానీ మనం గుట్టుగా సంసారం చేసుకోవడానికి 21ఏళ్లు రావాలి. మనకు ఓటు హక్కు వుంటుంది కానీ లైంగిక హక్కులు వుండవు.
సామాజిక అభ్యుదయ సంస్థలకు ధిమాక్ ఖరాబ్ అయిందా? అతనికి.. 18 ఏళ్లకు వయోజన ఓటరుగా ,అతనికి ఎమ్మెల్యేని, అతనికి ఎంపీని.. అతనికి దేశ నాయకుడిని ఓటు వేసి ఎన్నుకుంటున్నాడు.కానీ.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25ఏళ్ల వయసు మినిమం వుండాలి. ఎంపీగా పోటీ చేసే వాడికి మినిమం 30 ఏళ్లు వుండాలి.
ఈ వైరుధ్యాలేమీ మనకు కనిపించవా?దిమాఖ్ ఖరాబ్ స్వచ్ఛంద సంస్థలకు కొంత ఇంగితం వుండాలి.
ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అవడానికి వుండాల్సిన కనీస వయసుతో పోల్చినప్పుడు.. ఓటేయడానికి వుండే వాడి కనీస వయసు ఎంత వుండాలి? ఇవన్నీ మనకు ఓకే.. యాక్సెప్టెడ్..
         స్త్రీజనోద్ధరణ పేరిట.. మరిన్ని క్రూర చట్టాలను మా మీద రుద్దమాకండి. మేము బాగానే వున్నాం. మమ్మల్ని బాగా వుండనివ్వండి.
     విన్ స్టన్ చర్చిల్ ఊరికే అనలేదు.. వీళ్లకు సొతంత్రం ఇస్తే వీళ్లను వీళ్లు పాలించుకోలేరు అని ఊర్నే అనలేదు.
     మహాత్మాగాంధీ ఊరికే అనలేదు.. విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు వుండాలని ఊర్నే అనలేదు.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card