నేను బాధపడే ఒక సన్నివేశం. ‘రాజీవ్ కనకాల’ తన హాస్పటల్ కు వచ్చిన 16 ఏళ్ల అమ్మాయి కి టెస్ట్ లు చేసి, ఆ అమ్మాయికి 16 ఏళ్లు కాదు పదేళ్లు మాత్రమే అని నిర్ధారించి, పదేళ్ల పిళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చి 16. ఏళ్ల పిల్లల గా మార్చి వ్యభిచారం చేయిస్తున్నారని తెల్సుకోవడం.
ఇదే ఇప్పుడు
వాస్తవమై న్యూస్ చానళ్లొ. న్యూస్ పెపర్లొ కనిపిస్తుంటే మనసెంత కకావికలమైపొతుందొ. ఇంతటి పైశాచిక దుశ్చర్యకు పాల్పడిన
కిరాతకుల్ని పట్టుకున్నా ,పట్టేసుకున్నాం, విచారిస్తున్నాం.... విచ్చారిస్తున్నాం..... అని మీడియాకి , సమాజానికి
వారెవరో తెలియనీయకుండా ఉంచారు.. ఎందుకు. నాయకులు, పొలీసుల ప్రాణాలకు హాని కల్గించే అవకాశముందని మావొయిస్టుల్ని,టెర్రరిస్ట్ లని,గంధపుచెక్క దొంగల్ని కనబడితే కాదు..కాదు కనిపెట్టి మరీ ..రాజ్యాంగం .ప్రభుత్వం , కోర్టుల ప్రశక్తే లేకుండా ఉన్నపళాన్ని కాల్చికాల్చి చంపుతారే... అలా పదేళ్ళు కూడా నిండని ఆడపిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చి వికృత వ్యాపారాన్ని చేస్తున్న వీరిని ఎందుకు కాల్చి చంపకూడదు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment