Thursday, August 09, 2018

ఇప్పుడుఅందరికీ తెలిసిపోయింది



           తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి పవిత్ర వ్యవస్థల్ని అడ్డుగా పెట్టుకోవడం మోదీ ప్రభుత్వంచేస్తున్న రక్షణాత్మక వ్యూహం. బ్యాంకుల ముందు ప్రజలు పడుతున్న కష్టాలను ఎవరయినా ప్రస్తావిస్తే సరిహద్దుల్లో మన సైనికులు పడుతున్న కష్టాలకన్నా అవి గొప్పవా అని మోదీ భక్తులు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి ఎత్తుగడలు ఒకటి రెండుసార్లు బాగానే పనిచేస్తాయి. అతిగావాడితే ప్రజలు ఆ పవిత్రసంస్థల మీద కూడా విమర్శలు కురిపించే ప్రమాదం వుంటుంది.
        పబ్లిక్ డిబేట్ లోనికి న్యాయస్థానాలువచ్చాక జనానికి న్యాయమూర్తుల మీద మునుపటి గౌరవం పోయింది. సైనిక వ్యవస్థ పవిత్రత కూడా ఇప్పుడు ఇలాంటి ముప్పును ఎదుర్కొంటోంది.
          రెండుసంవత్సరాల  క్రితం వరకు రిజర్వుబ్యాంకును చాలామంది ఓ పవిత్ర సంస్థగానే భావించేవారు.పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ రిజర్వ్ బ్యాంకును అడ్డుపెట్టుకోవడం మొదలెట్టింది. ఇప్పుడు రిజర్వు బ్యాంకుపబ్లిక్ డిబేట్ లోనికి వచ్చేసింది. అంబానీ,ఆడానీ,మహేంద్రా వంటి భారీ కార్పొరేట్ సంస్థల మాజీ ఉద్యోగులు,మిలిందా బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ ఆర్ధిక విధాన నిర్ణయ సంస్థల ప్రతినిధులు రిజర్వు బ్యాంకు డైరెక్టర్లుగావుంటారని ఇప్పుడుఅందరికీ తెలిసిపోయింది.
*కేంద్ర ప్రభుత్వం అంటే కార్పొరేట్ల యొక్క,కార్పొరేట్ల ద్వార,కార్పొరేట్ల కొరకు* అనేమాట జనం లోనికి వెళ్ళిపోయింది.
            నల్లధనం కరెన్సీ రూపంలో వుంటుందని ప్రచారం చేయడంలోనే మోదీ అవగాహనలోని డొల్లతనం బయటపడిపోయింది.నల్ల కుబేరులంటే  రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ కంపెనీలు ,ప్రభుత్వకాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అని చిన్నపిల్లలు కూడా చెపుతారు. వాళ్లంతా నల్ల కుబేరులు కాకపోవచ్చు.....కానీ.... నల్లకుబేరులంతావాళ్ళే. గత రెండుసంవత్సరాల కాలంలో అరెస్టయిన నల్లకుబేరుల్ని వేళ్ళ మీద లెఖ్ఖపెట్టవచ్చు. మరి లక్షల మంది నల్ల కుబేరులు ఏమైపొయారో  మోదీ ప్రభుత్వమే చెప్పాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card