‘మతం’ అంటే ‘సమ్మతం’
అయినదనేగా..........అర్ధం
హిందూ మతంలోని వివక్ష
గురించీ, కుల మెట్ల
గురించి మాట్లాడినప్పుడల్లా.. ఇదేదో మెకాలే చదువుల ఫలితమని..విదేశీ శక్తుల
ప్రోద్భలమని..ఓ వైపు మాట్లాడేవాళ్ళను శత్రువుల్లా చిత్రించడమే గాకుండా..అసలు
కులాలే హిందూ మతంలో లేవని, యివి ఆంగ్లేయులు
భారత సమాజాన్ని చీల్చడానికి వేసిన ఎత్తులనీ కూడా అంటారు. ఈ మధ్యే ఒకాయన హిందూమతంపై
విషం చిమ్మడం కొన్నేళ్ళనుండే మొదలయింది అన్నాడు. నిజం కాదు. హిందూమతం ,మతం మాత్రమే
కాకుండా ఒక ధర్మంగా స్థిరపడుతున్నప్పటినుండే దానిమీద నిరసనలూ, పోరాటాలూ కూడా ప్రారంబమయ్యాయి.
చార్వాకుడు లేదా లోకాయుత
ధర్మం బహుశా వేదాలను, వేద ధర్మాన్ని
వ్యతిరేకించిన తొలి నిరసన కావచ్చు.
రెండువేల సంవత్సరాల కంటే
పూర్వమే బౌద్దాన్ని నెలకొల్పిన బుద్దుడిదీ హైందవం మీద నిరసనా, తిరుగుబాటే!
బుద్దిడి తర్వాత మరో
వెయ్యేండ్లకు బసవ తత్వం నెలకొల్పిన బసవన్నదీ హైందవం మీది తిరుగుబాటే!
పధ్నాలుగు, పదిహేనో శతాబ్దాల్లో భక్తి వుద్యమాన్ని నడిపిన
కబీరూ, తుకారాం, మీరా.. లాంటి కవులు హిందూమతంలోని అనాచారాల మీద
గొంతెత్తినవారే!
పదిహేడో శతాబ్దపు మన వేమన
చేసినదీ తిరుగుబాటే, నిరసనే!
యిక స్వాతంత్య్ర పోరాటం
మొదలయ్యాక సామాజిక మార్పు కోసం, హిందూ కుల
వివక్షల మీద పోరాటం చేసిన పూలే దంపతుల నుండీ..అంబేద్కర్ వరకూ ..
పోరాటం జరుగుతూనే వుంది.
జరుగుతూనే వుంటుంది.
ఏ పోరాటం అయినా ఆగిపోవడం అనేది, అన్యాయం ఆగిపోవడంతోనే సాధ్యం.
ఒకరు చెబితేనో, ప్రోత్సహిస్తేనో
జరిగే పోరాటం గుప్పున మండి ఆరిపోవచ్చేమో గానీ శతాబ్దాల తరబడి జరగదు. శతాబ్దాల
తరబడీ పోరాటం జరుగుతోందంటే పోరాటం విఫలమయినట్లూ కాదు, అన్యాయం జరగనట్లూ కాదు.
అయినా ఇప్పటికీ హిందూమతం
తన ఉనికిని కోల్పేలేదు .కారణం అది ‘దేవుడు’ అనే పరిధిలో మాత్రమే లేదు ధర్మాధర్మాలు
రూపేణా జీవన శైలి అయింది. మన జీవన శైలిని అంత త్వరగా ఎదో కారణాలు చెప్పి ఇతరులు
మార్చలేరు. దీనికి గట్టి ఉదాహరణ అంబేడ్కరే
దేశంలో అంబేద్కర్ ని,అయన భావాల్ని అభిమానించి పూజించే వారు చాలామంది వున్నారు
,కానీ అంబేద్కర్ అనుసరించిన భౌద్ధమతాన్ని ఎంత మంది అనుసరిస్తున్నారు.అసలు మన తెలుగు
వారిలో భౌద్ధ మతం అనుసరించేవారు ఉన్నారనుకోను.
అందువల్ల ఎక్కడో ఎవరో ఎదో చేసారని మతం ద్రోహం
లేదా దాడి అనుకోవటం అర్ధరహితం.ఆలోచనా రాహిత్యమ్
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment