Thursday, August 16, 2018

తడబడు అడుగుల ‘తప్పిన’ తాళం



నీ చేతులు మురికి అని, *లిక్విడ్ సోప్* అన్నారు.
అనారోగ్యం మురికి మాటేమో గానీ *ప్రపంచమంతా ప్లాస్టిక్ డబ్బాలే!!*
అరిటాకు, మట్టి పాత్రలు *అనాగరికం* అన్నారు. స్టీల్ ప్లాస్టిక్ పాత్రలు పేపరు పళ్లేలు వాడమన్నారు.
ప్లాస్టిక్ పేపరు హానికరమైనవని తెలిసేసరికి, *అరిటాకులు మట్టి పాత్రలు మాయం.*
చెట్లనుండి నేరుగా కోసుకు తినడం అనారోగ్య కారకం అన్నాడు.
పాకేజి ఫుడ్, ప్రోసెస్ఢు ఫుడ్ తినమన్నాడు.
అవి హానికరమైన కెమికల్స్ తో నిండి ఉంటాయని తెలిశాక, *కోసుకుతినడం మరచిపోయాము.*
పిల్లలు గట్లమీద, మైదానంలో ఆడుకుంటే అనారోగ్యమని, *ఆటబొమ్మలు, విడియో గేమ్స్* ఆడుకోమన్నాడు.
బొమ్మలు విడియోలు ఒళ్ళు మెదళ్ళు పాడు చేశాయని తెలిసే సరికి, *గట్లు మైదానాలు, స్నేహితులు మాయం.*
చేనేతలు, నూలు బట్టలు గరుకని, అసహ్యమని, *నైలాన్లు, పాలియెస్టర్లు* బ్రాండు వేసి తెచ్చాడు.
నైలాన్లు పాలియెస్టర్లు హానికరమని చూస్తే, *చేనేతకార్లు మాయం.*
ఇంటి వైద్యం, ప్రాచీన వైద్యం *అనాగరికం, పనికిరావు* అన్నాడు
రసాయన వైద్యం ఆధునికమన్నాడు.
ఆధునిక వైద్యం హానికరమైనది తెలిసేటప్పటికి, *ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాము.*
రోగి బాధలు, వ్యాధి లక్షణాలు వ్యాధినిర్ధారణకి సరిపోవని, *మషీన్లు టెస్టులు* తీసుకొచ్చాడు.
మషీన్లు టెస్టులు జేబుల్ని కత్తిరించినా వ్యాధి నిర్ధారణ కాదని తెలిసేసరికి,
*
మంచి డాక్టర్‌లు* మాయం.
మన కంటికి కనిపించని *క్రిములను చూపి భయపెట్టి,* శక్తివంతమైన రసాయన క్లీనింగ్ ఏజెంట్స్ వాడమన్నాడు.
కానీ ఆ రసాయనాలు హానికరమని చూసేసరికి, *శ్వాసకోశాలు దెబ్బతిన్నాయి.*
మనకేది మంచిదో తెలిసే టప్పటికి  *మనిషే మాయం*
Top of Form
Bottom of Form
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card