జనాభాలో ట్రెండ్ సెట్టర్లు తక్కువుంటారు. ట్రెండ్ ఫాలోయర్లు ఎక్కువుంటారు. ఇది డ్రెస్సులకు, స్టైల్స్ కే కాదు, సంపాదనకూ వర్తిస్తుంది. డబ్బు దాచడం అనే విషయం ఇండియన్లకు బాగా తెలుసు కానీ, అది ఎక్కడ దాచాలన్నది చాలామందికి తెలియదు. ద్రవ్యోల్భణం అదుపులో ఉండే రోజుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు వర్కవుట్ అయ్యాయి. ఎందుకంటే బ్యాంకు వడ్డీరేట్లు ద్రవ్యోల్భణం కంటే తక్కువున్నాయి. బ్యాంకు వడ్డీరేటు ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉంటే మన డబ్బు పెరుగుతుంది. ద్రవ్యోల్భణం కంటే తక్కువగా ఉంటే మన డబ్బు బ్యాంకులో పెట్టడం వల్ల విలువు కోల్పోతోంది. సెప్టంబరు నాటకి గణాంకాలు ప్రకారం ద్రవ్యోల్భణం రేటు 5.1 ఉండొచ్చు. ప్రస్తుతం బ్యాంకు వడ్డీరేటు ఫిక్సెడ్ డిపాజిట్లు అయితే 6.25 నుండి 7.75 శాతం వరకు ఉంది. ఈ లెక్కన మీ డబ్బు బ్యాంకులో దాస్తే అది ప్రతి సంవత్సరం 1.15 శాతం మాత్రమే విలువ పెరుగుతుంది అంటే ఒక లక్ష రూపాయలు బ్యాంకు లో దాస్తే సంవత్సరానికి కేవలం 1150 రూపాయలు మాత్రమే సంపాదించగలము. అందుకే డబ్బు దాచడం కంటే అది ఎక్కడ దాచాం అన్నది చాలా ఇంపార్టెంట్.
ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే అదెప్పటికీ మంచిదే. కానీ, ఇప్పుడు కొనేవాళ్లు 2005 ఏడాదికి ముందు కొనేవాళ్లంత అదృష్టవంతులు కాదు. గతంలోలాగా మీరు కొనే స్థలంలో రెండు మూడేళ్లలో డబుల్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఇందులో కూడా ఆచితూచి అడుగేయాలి. వెయ్యి రూపాయల గజం భూమి ఐదువేలకు పెరగడం చాలా సులువు గానీ, ఐదు వేలు పెట్టి కొనే గజం భూమి కనీసం రెట్టింపవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. మనకూ ఓ స్థలమో, ఆస్తో ఉండాలని ఎక్కడ పడితే అక్కడ స్థలం, ఫ్లాటు కొనకూడదు. ఉదాహరణకు గుంటూరు లామ్ వైపు ఫ్లాట్లు కొన్నవారు ఇప్పటికీ అదే రేట్లు ఉండటంతో తీవ్రంగా నష్టోతుంటే మంగళగిరి వైపు ఫ్లాటు కొన్నవారు డబుల్, త్రిబుల్ అయ్యి సంపన్నులయ్యారు. కాబట్టి, ఆస్తి అనేది భవిష్యత్తు కోసం కొనేది కాబట్టి మీ ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాకుండా భవిష్యత్తులో గిరాకీని దృష్టిలో ఉంచుకుని కొనండి. ఇపుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ మారుమూల మండల కేంద్రంలో వెళ్లి అడిగినా సెంటు 30 లక్షలు నుంచి రెండు లక్షలు వరకు పలుకుతోంది. ఇది రియల్ ఎస్టేట్ మాయ. అదే, రెండు హైవేలు ఉన్న నగరం ఉడిపి (కర్ణాటక)లో సముద్ర తీరానికి దగ్గరలో కేవలం యాభై వేలు సెంటు దొరకుతుంది. మనవాళ్లకు అంత స్థలాల పిచ్చి. కాబట్టి భవిష్యత్తును అంచనా వేసి మన డబ్బు వీలైనంత త్వరగా రెట్టింపయ్యే విధంగా ఆలోచించాలి.
*లోను లేకుండా మొత్తం డబ్బు పెట్టి కొన్న ఇల్లు/స్థలం ఐదేళ్లలో రెట్టింపు కాలేదంటే మీ ఆస్తుల విలువ తగ్గినట్లు. లోను తీసుకుని కొంటే 8 సంవత్సరాల్లోపు, నగదుతో కొంటే నాలుగేళ్లలోపు మీ ఆస్తుల విలువ రెట్టింపయితే గిట్టుబాటు*
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment