ఓ మహిళ చీరకొనడానికి బెనారస్ పట్టుచీరల దుకాణానికి
వెళ్ళింది!యజమాని మంచి స్నేహితుడుకూడా! దుకాణం నిబంధనల ప్రకారం ముందే డబ్బు
చెల్లించింది!ఓ కంచి పట్టుచీర ఎంపిక చేసుకొంది!అది ఔట్ డేట్ ఫేషన్
అనీ!ఎవరూ కొనడంలేదనీ దుకాణ్ దారు అన్నాడు!తాను
చెప్పిన నార్తిండియన్ బెనారస్ పట్టుచీర సుకోమన్నాడు!
సరేనంది!అతనుచెప్పిన చీరతో ఇంటికి వెళ్ళింది! ఆచీర
రంగు వెలుస్తోంది!అన్నీ కన్నాలే!మరలా దుకాణానికి
వెళ్ళి చీర మార్చి కంచి పట్టుచీరే ఇమ్మంది!అతను
వీలుకాదన్నాడు!సరే "బెనారస్ చీరే" చిరుగులు లేని రంగు
వెలవని దీ ఇమ్మంది!ఓసారి తీసుకొన్నాకమార్పిడీ
లేదూ!దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు!భర్త రంగ ప్రవేశంజేశాడు! దుకాణానికి వెళ్ళియజమానిని
చీర ఇమ్మన్నాడు!ఆమె నిలకడ లేనితనం వివరించాడు!
భర్తకు బోలెడుకోపం వచ్చింది!కొనేసమయంలో తానుంటే
అలాజరిగేది కాదుగదా అని బండబూతులు
తిట్టెడు!(అసలు ఆమెను వదిలించు కోవాలని ఉన్నాడు!) తప్పంతా
భార్యదే నని అందరూ వినేటట్లు
తిట్టేడు ,బాదేశాడు! నీతో కాపురం ఇక వీలు కాదన్నాడు!దుకాణదారుపై
కోపంరాలేదు!భార్యపై కోపం!
వదిలించుకొనే ఛాన్సు వదులుకోదలుచుకోలేదు! చిరిగిన
చీరతో ఇంటికి వెళ్ళారు!పిల్లలు కొత్తచీర ఏదన్నారు!
తప్పు మీఅమ్మదే!నేను ఈమెకు విడాకులిస్తున్నా!కోర్టులో
మీరు సాక్ష్యంజెప్పినాకు అండగా నిలవాలి
అన్నాడు!సరే నాన్నగారూ!మనం చీరకోసం చెల్లించిన యిభైవేలకు
గాను ఈ చిరుగులచీరే గతా?రేపు
కొత్తమమ్మీని
ఈ చిరుగుల చీరతో చూసే దెలా!మన కుటుంబానికి జరిగిన
నష్టం సంగ తేమిటి? అమ్మ మీద కోపంతో!
రేపు కొత్త మమ్మీకి ఈ చిరుగుల చీరే కట్టబెడతారా? అంటే! ఔను
తప్పంతా మీ మమ్మీదే! కొత్త మమ్మీ వచ్చాక చూడండి! బ్రహ్మాండంగా ఉంటుంది! అన్నాడు! సరే
నాన్నగారూ అప్పుడైనా అదే దుకాణం అదే దుకాణ్ దారూ
కదా? అప్పుడు మంచి చీర ఇస్తాడంటారా? అంటే! తప్పకుండా!
కొత్తభార్యతో వెళితే సమస్య పరిష్కారమే!
అన్నాడు!మీరు మాత్రం కోర్టులో విడాకులకు
మద్దత్తు కొత్తమమ్మీకి ఆహ్వానం చెప్పడానికి సిధ్ధంగా ఉండమన్నాడు!
ఇరుగు పొరుగువారితో భార్య నిలకడలెనితనం గురించీ!
విడాకులసంతీ! వారూ కోర్టులో జరిగినది చెప్పి "విడాకులకు" సహకరించమనీ అడిగాడు!
చీర కోసంచెల్లించిన డబ్బు చర్చలోకి రావడంలేదు! తన భార్య నిలకడలేని తనమే సమస్యకు
మూలమన్నాడు! కొత్త భార్య ! జనం మద్దత్తుతో "కొత్తభార్య" తో కాపురం పాత భార్యను
తరిమేయడం! ఓ సుందర దృశ్యం కళ్ళముందు కదిలాడింది! కొత్త పెళ్ళికి ముహూర్తం మదిలో
మెదలాడే!
("పల్లకీలోన ఊరేగే ముహూర్తం కదలాడే!") పెళ్ళిపనులు
దగ్గరపడుతున్నాయి! అదండీ సంగతి!పిల్లలేమో కొందరు
తండ్రిపక్షం!కొందలు అమ్మ పక్షం! ఏమౌతుందో ఏమో!
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment