Saturday, September 22, 2018

లీలావది అనే బీజ గణితంలో మనోరంజన భాష్య కారులు ఇచ్చిన మంచి రొమాంటిక్ సమస్య ఇప్పుడు ఇస్తున్నాము. దీన్ని పై విధానంలో కనుగొనేందుకు ప్రయత్నించండి.
గణిత సమస్య:
కామిన్యా హారవల్యాః సురతకలహతో మౌక్తికానాం తృటిత్వా
భూమౌ యాతాస్త్రిభాగః శయనతలగతః పంచమాంశో2స్య ద్రష్టః
భాత్తః షష్ఠః సుకేశ్యా గణక దశమకః సంగృహీతః ప్రియేణ
హృష్టం షట్కం చసూత్రే కథయ కతిపథైమౌక్తికైరేష హారః

భావం:
మంచి వయసులో ఉన్న జంట శృంగారంలో ఉండగా ఆమె మెడలోలని ముత్యాల దండ తెగిపోయి భూమి మీద మూడో వంతు ముత్యాలు పడ్డాయి. పక్కమీద ఐదో భాగం పడ్డాయి. ఆరో వంతు ఆమె జుట్టులో చిక్కుకున్నాయి. పడిపోతున్న ముత్యాలలో పదో వంతు జతగాడు పట్టుకొన్నాడు. దండలో ఆరు ముత్యాలు ఇంకా మిగిలాయి. ఇప్పుడు చెప్పండి ఆమె మెడలోని ముత్యాల దండలో ఎన్ని ముత్యాలు ఉన్నాయి?
ఇక్కడ కూడా ఆరు ముత్యాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ముత్యాలు ఎన్నో కనుక్కో మన్నాడు కనుక ఇష్టకర్మ సూత్రం ప్రకారం కనుక్కోవచ్చు. కనుక దాన్ని ఉపయోగించి కనుక్కుందాం.
1) ముందుగా ఎంతో కొంత అనుకోవాలి కనుక నేను 60 ముత్యాలున్నాయి అనుకుంటున్నాను.
2) వీటిలో మూడో వంతు భూమి మీద పడ్డాయి అంటే నేను అనుకొన్న 60 ముత్యాలలో మూడో వంతు అంటే 20 ముత్యాలు భూమి మీద పడ్డాయి.
3) పక్కమీద ఐదో వంతు పడ్డాయి. 60 లో 5 వంతు అంటే 12 పక్కమీద పడ్డాయి.
4) ఆరోవంతు జుట్టులో చిక్కుకున్నాయి అంటే 60లో 6 వంతు 10 జుట్టులో చిక్కుకొన్నాయి.
5)జతగాడు పదోవంతు పట్టుకొన్నాడు. అంటే 60లో 10 వంతు 6 ముత్యాలు పట్టుకొన్నాడు.
ఇప్పుడు మొత్తం ఎన్ని ముత్యాలు కనుగొన్నాము 20+12+10+6 = 48
సారాంశంగా మిగిలినవి = మనం అనుకొన్న 60 -48 =12
6) ఇప్పుడు ఇష్టకర్మసూత్రం ప్రయోగిద్దాం. సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.
దత్త సంఖ్య =6 ముత్యాలు. మనం అనుకొన్నది 60 ముత్యాలు. సారాంశం =12
సూత్రం ప్రకారం దత్తసంఖ్య x ఇష్ట సంఖ్య / సారాంశం = 6x60/12 = 30 ముత్యాలు.
ఆమె మొత్తం దండలో 30 ముత్యాలున్నాయి. కావాలంటే పైన ఇచ్చిన భిన్నాలతో సరిచూసుకోండి. మీకు ఆమె చేతిలో మిగిలిన 6 ముత్యాలు సమాధానంగా వస్తుంది.
ఇది వేదగణితం.
ఇప్పుడు చెప్పండి. గణితంలో పిహెచ్ డీ చేసిన వాళ్లెవరైనా తమ పాఠ్య గ్రంథాలు, సైద్ధాంతిక గ్రంథాల్లో ఈ మాదిరిగా ఉదాహృత ప్రాబ్లమ్స్ తో పాటు గుర్తుంచుకోగలిగారా?
ఇది కాదా సంస్కృత భారతి దివ్యమైన మహిమ?
మాకు తెలిసి దీన్ని బీజ గణిత శాస్త్రం అంటారు. ఇది భారత జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందింది. మీ మేక మెదళ్లకు, సెక్యులర్ గ్రహణం పట్టిన పైశాచిక బుర్రలకు ఇది తెలియకపోతే తెలుసుకోండి.
అన్నిటికీ మించి ఇంత బాగా భిన్నాలు, భాగాహారాల గురించి చెప్పగలిగిన విద్యావ్యవస్థనేటి రాక్షసగురువులఆంగ్లవిద్యావిధానంలో ఉందా? ఇందులో ఆవగింజలో వెయ్యోవంతుకూడా లేని సమస్యలు సాథిస్తే ప్రభుత్వ తాబేదార్ల ఉద్యోగాలు ఇచ్చే దౌర్భాగ్య విద్యా వ్యవస్థ తయారైంది. నేటి విద్యావ్యవస్థ గొప్పదా? వేదగణితకాలం గొప్పదా తేల్చుకోండి. ఇది ఇప్పటికీ కావాలా వద్దో కూడా తెలుసుకోండి.

Friday, September 21, 2018

ఇది...ఓ...కొడుకు...కథ..!



మనం అందరం
బాగా ఎదిగిపోయాం...!

మన ఫ్రెండ్ మనకి కాల్
చేసి, బయటకు రమ్మంటే
మనం అనే మాట....

"రేయ్..మామ..మా..
బాబు (నాన్న) ఉన్నాడ్రా
ఇంట్లో బయటకు వచ్చానో
మా బాబు సావగోట్టేస్తాడు...రా..!

హ..హ..హా .....
నాన్నని నాన్న అని
పిలవలేకపోతున్నాం..
ఒక్కొకరు ఒక్కో పేరు
పెడుతున్నారు తండ్రికి.

“నాన్న” అనే ఈ రెండు
అక్షారాల పదం విలువ
ఇప్పుడు మనకి తెలియదు.

నాన్న చనిపోయాక తనని
స్మశానానికి తీసుకెళ్ళే దార్లో...
ఒక చోట నాన్న బాడీని
నేలపై ఉంచి, కొడుకుని
తండ్రి చెవులో నాన్న..నాన్న..
నాన్న అని మూడు సార్లు
పిలవమంటారు.

కొడుకు రెండు సార్లు బాగానే
పిలుస్తాడు, మూడోసారి
మాట రాదూ.

గుండెలో బాధ, గొంతులో
తెలియని నొప్పి, కళ్ళల్లో నీళ్ళు.
ఎందుకంటే..........
ఆ కొడుకు, తండ్రితో నాన్న అని
పిలిచేది అదే ఆఖరిసారి.

ఇంకెప్పుడు వాడు నాన్నతో
నాన్న అని అనలేడు.......

ఆ పిలుపు తనకి Just Half
Second మాత్రమే పట్టిింది...
కానీ...

ఆ Half Second లో వాడికి
మొత్తం కళ్ళముందు కనిపించేది..
మాత్రం...

“మనం స్కూల్ లో
Fan కింద కూర్చుని చదువుకోడం
కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది.

మనకి కొద్దిగా జ్వరం వస్తే
అల్లాడిపోయే నాన్న,
తనకి ఎంత పెద్ద దెబ్బ
తగిలిన కూడా హాస్పిటల్
కి వెళ్ళకుండా మన
Future కోసం దాచిన
డబ్బులు కనిపిస్తాయి.

ఆదివారం ఒక్కరోజు
మాత్రమే వండుకునే
Chicken తో భోజనం
చేసేటప్పుడు నాన్న తన
ప్లేట్ లో ముక్కలు తీసి
మన ప్లేట్ లో వేసింది
కనిపిస్తుంది.

చివరగా ఎవరైనా
నువ్వు ఏం
సంపాధించావురా
అని నాన్న ని అడిగేతే
నా ఆస్తి నా కొడుకురా
అని నాన్న గర్వంగా
చెప్పింది కనిపిస్తుంది “

ఇవ్వన్ని కనిపించిప్పుడు
నాన్న ని గట్టిగా
హత్తుకుని “నాన్న నాన్న
నాన్న నాన్న నాన్న నాన్న ”అని పిలవాలని
అనిపిస్తుంది.

కాని...అప్పుడు నాన్న
ఈ భూమి నుండి చాలా
దూరంగా...అందనంత
దూరంగా వెళ్ళిపోయి
ఉంటాడు.

So...ఫ్రెండ్స్...నాన్న
ఉన్నప్పుడే తనని
"నాన్న” అని ప్రేమగా
పిలుద్దాం.

నాన్న పోయాక తన
ఫోటో దగ్గర కూర్చుని
బాధపడే బదులు....
నాన్న ఉన్నపుడే తనతో
రోజు కొంత టైం
గడుపుదాం.

ఆయన పోయాక FB లో
"my Dad is my Hero”
అనే post లు పెట్టే
బదులు.........నాన్న
ఉన్నప్పుడే నాన్న తో
"నాన్న, You are my
Hero” అని చెప్పుదాం.

అంత గొప్ప “నాన్న”అనే
పదాన్ని బాబు, గిబు
అంటూ కించపరచకండి

“తన జీవితాన్ని
ఖర్చుపెట్టి మన
జీవితాన్ని నిర్మించే
పిచ్చోడే నాన్న"

Thursday, September 20, 2018

ఇదే నిరుద్యోగ భారతం


ప్రభుత్వం ఉద్యోగాలు మనకేం ఊరికే ఇవ్వట్లేదు



ఒక సారి ఈలెక్క చూడండి
ఇది ఈరోజు దినపత్రిక లో వచ్చిన వార్త ఆధారంగా తయారు చేసిన లెక్క

కాళీ పోస్టులు 700........వచ్చిన దరఖాస్తులు 10,58,387
ఒక్కో ధరఖస్తుకి 5 రూ.500/- ఫీజు నిర్ణయించారు ఏలెక్కనదరకాస్తుల రూపేణా  వసూలయిన డబ్బు
1058387*500=                                        52,91,93,500(దాదాపు యాభైమూడు కోట్లు)
ఒక్కొక్క పోస్టుకి సగటు జీతం  నెలకు రూ.20000/-గా ప్రకటించారు
ఆవిధంగా ప్రభుత్వం నెలకి చెల్లించేది      700*20,000=1,40,00,000(ఒకకోటి నలభై లక్షలు)
ఒక ఉద్యోగి సుమారు సర్వీసు 30 ఏళ్ళు అనుకుంటే
1,40,00,000*30=                                     42,00,00,000(నలబై రెండూకోట్లు మాత్రమే)
    ప్రభుత్వానికి మిగిలేది                            =10,91,93,500(దాదాపు పదకొండు కోట్లు)
ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా  రవాణా బసభోజనాలు రూపేణా యింకా ఎక్కువ ఖర్చు టాక్సుlరూపేణా అదనం
  ఈరోజు వసూలయిన డబ్బు కి ముప్పై ఏళ్ల వడ్డే పెరిగే జీతానికి ఇంచుమించుగా సరిపోతుంది
   ప్రభుత్వం జీతాలు భరిస్తుందా   సగటు నిరుద్యోగిభరిస్తున్నాడా
 నిరుద్యోగులకి ప్రభుత్వం చేసే మేలుఇదేనా

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Wednesday, September 19, 2018

కాసిని కన్నీళ్ళు దాచుకో అప్పటికి పనికొస్తాయి


ప్రేమ గురించి...... మనిషిని చంపడం అమానుషమే. సందేహం లేదు. అసలు యెవరూ ఈ వ్యవస్థ గురించి గానీ, తప్పుదోవ పడుతున్న యువత గురించి గానీ చర్చిస్తున్న వాళ్ళే లేరు. 9వ తరగతి నుండే ప్రేమట.
అసలు ఆ వయసేంటి? వీరికి ప్రేమేంటి? దానికి ఇన్ని కుల సంఘాలు, నటులు, రాజకీయ నాయకులు, రచయితలు సపోర్టు ఏంటి? జీవితం పట్ల యేమీ అవగాహన లేని ఆ పసి ప్రాయంలో ఈ ఆలోచనలు రావటానికి మూలాలెక్కడున్నాయ్? అది ఆ వయసుకు ప్రేమే కాదు, ఎక్కడ లోపాలున్నాయ్? లక్ష్యాన్ని చేరకుండా, చదువుకొనే వయసులో జీవితమంటే యేమిటో తెలియని పసి వయసులో ప్రేమ అనే పేరుతో పండంటి జీవితాలను తెగిన గాలి పటాల్లా అగమ్య పథంలోకి,నెట్టివేసి కన్నవారి ఆత్మగౌరవాన్ని మట్టిలో కలిపి, మేము ఇద్దరం- మా ప్రపంచం, మా జీవితం, మా సుఖం, మా సంతోషం, మాదే,...మాదే.... అనే స్వార్థంలో పడి, , దానికి ప్రేమ అనే పేరు పెట్టి, బ్రతికే వారు కొందరైతే? అలా రుచి చూసి మోసపోయే వారు కొందరు, మోసపోయిన తల్లిదండ్రుల ఆశలను, కోరికలను, వారి ప్రేమకు నోచులేని వారు కొందరైతే, వారికి కడుపు కోతను మిగిలించేవారు కొందరు, ఈ విషయం తెలిసి పరువు పోతుందని, ఉరి వేసుకుని, బావిలో దూకి, గుండెపోటుతో మరణించిన వారు చాలామంది వున్నారు, ఇలా నానా రకాలుగా అమ్మా నాన్నలను పొట్టన పెట్టుకున్న యువతీ యవకులను ఏంచేయాలి, ఎలాంటి శిక్షలు వేయాలి?


పిల్లలకు తల్లిదండ్రులు విలల్నా? తల్లిదండ్రులకు పిల్లలు విలల్నా? ప్రేమ పేరుతో అమ్మానాన్నలకు దూరం అయిన పిల్లలు, అదే ప్రేమ పేరుతో పిల్లలను దూరం చేసుకున్న అమ్మనాన్నలకు, ఈ సమాజం సపోర్టు ఎటుగా ఉంటుంది? విడదీసి సమాదానం దొరకని ప్రశ్న......
ఐదు నెలో పుట్టబోయే తన బిడ్డ మీదే ఆ అమ్మాయికంత ప్రేమ వుంటే, మరి తనను కనీ పెంచీ పెద్ద జేసిన తన తలిదండ్రులకు తమ బిడ్డ మీద యెంత ప్రేమ వుండాలి? వాళ్ళు కన్న కలలన్నీ కళ్ళముందే బుగ్గై పోతుంటే ఆ గుండెలు మండవా? అలా అని ఒక మనిషిని అమానుషంగా చంపటం సమర్థించం. అది రాక్షసత్వానికి పరాకాష్ట. తన బిడ్డ భవిష్యత్తును యెంతో ఉజ్జ్వలంగా కలలు గన్న ఒక తండ్రి హృదయం తన కళ్ళముందే స్వప్న సౌధంలా కూలిపోతుంటే కన్నతండ్రి రాక్షసుడై దానికి కారణమైన వాణ్ణి బలి తీసుకోవటానికీ‌, తనకు ఉరిశిక్ష పడ్డా భరించటానికి సిధ్ధ పడ్డాడు, అంటే? అతని దగ్గర ఉన్న డబ్బు కంటే కూతురి మీద పెంచుకున్న ప్రేమ గొప్పది కాదా?
సొసైటీలో అంత ఎత్తకు ఎదిగిన మనిషికి ఈ చర్యకి చట్టం ఏ శిక్ష వేస్తుందో? తెలియదా? అయినా వాటికి బెదరకుండా తనకు శిక్ష పడ్డా పరవాలేదు అనుకొన్నాడు అంటే, ఈ పరిస్థితికి దోహదం చేసిన ఆ అమ్మాయి భాద్యురాలు కారా?
ఈ అమ్మాయి నా బిడ్డ పుట్టే లోపు మా నాన్నను ఉరిశిక్ష వేయాలి అంటుంది. ఈమె ప్రేమ ఎంత గొప్పది.
అసలు మనిషిగా మీనాన్న చని పోయి చాలాకాలం అయ్యింది అది నీకు అర్ధమైతే ఈ కధ వేరేగా వుండేది
త్యాగ మంటే మీనాన్నది- నీది కాదు .నీ స్వార్ధం మొండితనం తో అనవసరంగా అబ్బాయిని ఇందులోకి లాగి హత్యకు కారణం అయ్యావు నీవు జీవిత కాలం ఏడ్చినా ఆ అబ్బాయి తల్లి కన్నీటిని ఆపలేవు

కడుపులో రూపమే చూడలేదు అది మగో, ఆడో తెలియదు అప్పుడే అంత ప్రేమైతే, మరి ఇన్ని సంవత్సరాలుగా నీతో ఆడి, ఆడుకుని, నీకు ఏది అవసరమో దానిగిురించి ఎంత ప్రేమించి ఎంత కష్ట పడ్డాడో,తెలుసా? నీకు నీబిడ్డ పెరిగి పెద్దగ అవుతుంటే? తెలుస్తుంది
అసలు ' ప్రేమ అంటే ఏమిటో అది పెట్టే బాధ ఏమిటో ' అది నీ గుండెని తట్టి తట్టి లేపుతుంది.కాసిని కన్నీళ్ళు దాచుకో అప్పటికి పనికొస్తాయి

Tuesday, September 18, 2018

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం...



అలాంటి నాన్న‍ తన కూతురు ను గుండెల్లో పెట్టుకుంటాడు
భుజాలపై‌ ఎక్కించుకుంటాడు
తన హృదయం పైన‌ నడిపించుకుంటూ‌ తన‌ పాదాలకు చెప్పులౌతాడు
తన బంగారు ‌భవిష్యత్తు గురించి ఎవరూ కనని కలలు కంటాడు
కంటికి రెప్పలా కాపాడుకుంటాడు
అలాంటి తండ్రి
ఒకటి అడిగితే రెండు కొనిస్తాడు
రెండు అడిగితే నాలుగు కొనిస్తాడు

యుక్త వయసుకు రాగానే
తన ఉన్నత చదివుల కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతాడు
తన బాధ కష్టం కనబడకుండా గుండె లోనే దాచుకుంటాడు..
ఒక మంచి జీవిత భాగస్వామికొరకు వెతుకుతునే ఉంటాడు
కూతురు సుఖం సంతోషం కొరకు దేనికైనా సిద్దపడుతాడు...
తను కోరుకున్నది జరిగితే ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడుతాడు

కాని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న‌ యువత స్వేచ్చ స్వతంత్ర్యం పేరు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు...
తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియదని కించపరుస్తున్నారు..
పెళ్ళి వయస్సు కు రాగానే ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కట్టబెడుతున్నారని అంటున్నారు...

నిజంగా ఏ తల్లిదండ్రులు అంత నీచంగా ఆలోచించరు ..పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావిస్తారు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను తల్లిదండ్రులు పరిశీలిస్తారు..
అప్పుడైనా నచ్చితేనే ఆ అమ్మాయికి కూడా ‌నచ్చితే ఒప్పుకుంటారు...
ఏ తండ్రి కూడా ‌తన కూతురు ఏమైనా‌ ఫర్వాలేదని అనుకోడు
తన కూతురు ఏలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటాడు..

కాని నేటి అమ్మాయి లు అలా ఆలోచించడం లేదు
పెళ్ళి వయస్సు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విలన్లు గా చూస్తున్నారు

ప్రేమ అనే మత్తులో పడి మోసమేదో.. మోదమేదో తెలియని వయస్సులో
మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం మాది నిజమైన ప్రేమ అనే మైకంలో తల్లిదండ్రులను ఎదురిస్తున్నారు... తల్లిదండ్రులను బలి చేస్తున్నారు..

నిజంగా మీకు అర్థం చేసుకోనే శక్తి‌ ఉంటే నీకు జన్మనిచ్చిన‌ నాటి‌ నుండి నీ కోసం తన‌ తపన అర్థమయ్యేది .. నీ గురించి కన్న కలలు అర్థం అయ్యేది.. నీ కోసం పడ్డ కష్టం అర్థం అయ్యేది..
నీ చిన్ని కాళ్ళ సరిపడే సైజు కోసం పది షాపులు తిరిగింది....
నీ పుట్టిన రోజుకి‌ నీ సరిపడే డ్రస్ కోసం ఇరవై షాపులు తిరిగింది...
నా కూతురు అందరికంటే ముందుండాలనే ఉబలాటం..
నీవు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ‌ వచ్చేవరకు‌ ఆరాటం... మీకోసం తపించే హృదయం.. అర్థం అయ్యేది

నీ బంగారు భవిష్యత్తు కొరకు ఇరవై ఏళ్ళు గా తపించే నీ తండ్రి నే‌ అర్థం చేసుకోలేని నీవు
గతమేంటో భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక వ్యక్తి గురించి ‌ఎలా అర్థం చేసుకుంటావు...??

నాలుగు రోజులు ‌ఉండే నీ‌ పాదరక్షల కొరకే పది షాపులు తిరిగిన నాన్న
నిండు నూరేళ్ళు జీవించే నీకు తగిన జీవిత భాగస్వామిని‌ ఇవ్వడని ఎలా అనుకొంటారు..

తన పిల్లలని ఒక డాక్టర్... ఇంజినీరింగ్..IAS, IPS చేస్తాడో లేదో కాని...
తను మాత్రం అనుకుంటే అలాంటి ఒక భాగస్వామిని తేగలడు...

కూతురు ఉన్న ఏ తండ్రి యైనా ఎక్కువ గా‌ ఆలోచించేది తన కూతురు గురించే
తనకు సాధ్యమైనంత వరకు అంగ రంగ వైభవంగా కూతురు వివాహం చేయాలని
ఎన్నో కలలు కంటాడు...
ఆ కలలను సాకారం చేసుకోని గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు..

అలాంటి తండ్రి యొక్క కలలను భగ్నం చేయకండి
ప్రేమను గెలవండి
కానీ ....నాన్న ను గెలిపించండి

ప్రేమంటే
ఇద్దరు మనుషులు కలవడము కాదు
రెండు ‌మనస్సులు‌ కలవడమే కాదు
రెండు కుటుంబాలు కూడా ‌కలవాలి..

అదే నిజమైన ప్రేమ
ఇది ప్రతి అమ్మాయి‌ అర్థం చేసుకోవాలి
ఇది ఒక తండ్రి భయం
ఇది ఒక తల్లి వేదన
దయచేసి అర్థం చేసుకోండి

Friday, September 14, 2018

మనం కడుతున్న పన్నులు వీళ్ల విలాసాల కోసమా !


కోర్టు హాలు కిక్కిరిసింది.
జడ్జి ఏం తీర్పు చెబుతారా అని అందరిలో ఉత్కంఠ.
'' మీరు ప్రస్తావించిన అంశాలు ఈ కోర్టు పరిధిలో లేవు !
అయినా సరే. నాకున్న అధికారాన్ని పురస్కరించుకొని
తీర్పు ఇస్తున్నా.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి
ఆహారం, నివాసం, ఉపాధితోపాటు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం
అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అవి నెరవేర్చలేదని రుజువైనందున
ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చెయ్యాలని కేంద్రానికి సూచిస్తున్నా.
ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేసిన ప్రభుత్వాన్ని
రీకాల్‌ చేసే అధికారం ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా

ఒక్కసారిగా కోర్టు హాలు హర్షధ్వానాలతో మారుమోగింది.
రాజేశ్వరి కళ్లల్లో ఆనందభాష్పాలు తొంగి చూశాయి.
....................................................
సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. రోడ్డు పక్కన ఏడుస్తున్న ఓ పసిపాప
అశ్వని ఇండస్ట్రీస్‌ అధినేత రాజేశ్వరి కంటపడింది. జాలేసింది.
డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పింది. వెళ్లి పాపను పలకరించింది.
ఎనిమిదేళ్లుంటాయి. మురుగు కాలువ దాటుతుంటే కాలుజారి పడింది.
పాప కాలికి వైద్యం చేయించి వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది.
ఒకే గది ఉన్న రేకుల ఇల్లు. పాపకేమైందోనని
నర్సన్న దంపతులు పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు.
వాళ్ల వివరాలడిగింది రాజేశ్వరి.
నర్సన్న దంపతులు దగ్గర్లోని పొగాకు కంపెనీలో పనిచేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు
ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు.
యాజమాన్యం అక్కడ బోర్డు తిప్పేసి వేరే చోట పెట్టింది.
దీంతో పని పోయింది. రోజూ కూలికెళ్తున్నారు.
సిమెంటు ధరలు పెరిగాయని పనులు కూడా తగ్గిపోయాయి.
సగం పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు.
నర్సన్నకు పాపతోపాటు మగపిల్లాడున్నాడు.
ప్రైవేటు స్కూల్లో ఫీజులు చెల్లించలేక ఇద్దర్నీ బడి మాన్పించారు.
వాళ్ల దుస్థితికి రాజేశ్వరి చలించిపోయింది.
తడిదేరిన కళ్లు తుడుచుకుంటూ '' మీ నాయకులేం చేస్తున్నారు !
ప్రభుత్వం ఏం నిద్దరోతుందా !'' అని అడిగింది.
''అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు ! ఓట్లేయించుకున్న నాయకులు
కంపెనీ వాళ్లకు ఊడిగం చేస్తున్నారు !
ఏం చెప్పమంటారు తల్లీ !'' అంటూ నర్సన్న వాపోయాడు.
అక్కడ నుంచి నర్సన్న దంపతులను తమ కంపెనీకి తీసుకెళ్లింది.
వాళ్లకు తగిన పని పురమాయించాలని మేనేజరుకు చెప్పింది.
పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది.
కంపెనీ లాయర్‌ని పిలిపించింది. '' మీరేం చేస్తారో నాకు తెలీదు !
సగటు మనిషి బతకడానికి ఇంత కష్టమైతే ఎలా !

మనం కడుతున్న పన్నులు వీళ్ల విలాసాల కోసమా !
కోటాను కోట్లు స్విస్‌ బ్యాంకుల్లో దాచుకోవడానికా!
ఒక్కో నాయకుడు.. అధికారి పది తరాలకు సరిపడా పోగేస్తున్నాడు !
ఈ పద్ధతి మారాలి ! ప్రజల ఓట్లతో గద్దెనెక్కి
వాళ్లనే పీల్చిపిప్పి చేస్తున్న దుర్మార్గులకు గట్టిగా బుద్ధి చెప్పాలి

నర్సన్న దంపతులను బాధితులుగా పేర్కొంటూ
నా పేరుతో హైకోర్టులో పిటిషన్‌ వేయండి !''
అని రాజేశ్వరి అడ్వొకేట్‌కు పురమాయించింది.
ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని
హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అనేక వాయిదాలు...వాదోపవాదాలు.
ఎప్పటికప్పుడు ఆధారాలతో వివరాలు సేకరించి న్యాయస్థానం ముందుంచారు.
...................................
కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప ఛెళ్లుమనిపించింది.
కేంద్ర సర్కారు ఆలోచనలో పడింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు సిద్ధమవుతోంది.
అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్లాలని రాజేశ్వరి నిర్ణయంచుకుంది.
సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
సగటు పౌరుల్లో ఆలోచన మొదలైంది.
- సామాజిక స్పృహతో ఆలోచించే వారికి ఈ కథ అంకితం

Address for Communication

Address card