ప్రేమ గురించి...... మనిషిని చంపడం అమానుషమే. సందేహం లేదు. అసలు యెవరూ ఈ వ్యవస్థ గురించి గానీ, తప్పుదోవ పడుతున్న యువత గురించి గానీ చర్చిస్తున్న వాళ్ళే లేరు. 9వ తరగతి నుండే ప్రేమట.
అసలు ఆ వయసేంటి? వీరికి ప్రేమేంటి? దానికి ఇన్ని కుల సంఘాలు, నటులు, రాజకీయ నాయకులు, రచయితలు సపోర్టు ఏంటి? జీవితం పట్ల యేమీ అవగాహన లేని ఆ పసి ప్రాయంలో ఈ ఆలోచనలు రావటానికి మూలాలెక్కడున్నాయ్? అది ఆ వయసుకు ప్రేమే కాదు, ఎక్కడ లోపాలున్నాయ్? లక్ష్యాన్ని చేరకుండా, చదువుకొనే వయసులో జీవితమంటే యేమిటో తెలియని పసి వయసులో ప్రేమ అనే పేరుతో పండంటి జీవితాలను తెగిన గాలి పటాల్లా అగమ్య పథంలోకి,నెట్టివేసి కన్నవారి ఆత్మగౌరవాన్ని మట్టిలో కలిపి, మేము ఇద్దరం- మా ప్రపంచం, మా జీవితం, మా సుఖం, మా సంతోషం, మాదే,...మాదే.... అనే స్వార్థంలో పడి, , దానికి ప్రేమ అనే పేరు పెట్టి, బ్రతికే వారు కొందరైతే? అలా రుచి చూసి మోసపోయే వారు కొందరు, మోసపోయిన తల్లిదండ్రుల ఆశలను, కోరికలను, వారి ప్రేమకు నోచులేని వారు కొందరైతే, వారికి కడుపు కోతను మిగిలించేవారు కొందరు, ఈ విషయం తెలిసి పరువు పోతుందని, ఉరి వేసుకుని, బావిలో దూకి, గుండెపోటుతో మరణించిన వారు చాలామంది వున్నారు, ఇలా నానా రకాలుగా అమ్మా నాన్నలను పొట్టన పెట్టుకున్న యువతీ యవకులను ఏంచేయాలి, ఎలాంటి శిక్షలు వేయాలి?
పిల్లలకు తల్లిదండ్రులు విలల్నా? తల్లిదండ్రులకు పిల్లలు విలల్నా? ప్రేమ పేరుతో అమ్మానాన్నలకు దూరం అయిన పిల్లలు, అదే ప్రేమ పేరుతో పిల్లలను దూరం చేసుకున్న అమ్మనాన్నలకు, ఈ సమాజం సపోర్టు ఎటుగా ఉంటుంది? విడదీసి సమాదానం దొరకని ప్రశ్న......
ఐదు నెలో పుట్టబోయే తన బిడ్డ మీదే ఆ అమ్మాయికంత ప్రేమ వుంటే, మరి తనను కనీ పెంచీ పెద్ద జేసిన తన తలిదండ్రులకు తమ బిడ్డ మీద యెంత ప్రేమ వుండాలి? వాళ్ళు కన్న కలలన్నీ కళ్ళముందే బుగ్గై పోతుంటే ఆ గుండెలు మండవా? అలా అని ఒక మనిషిని అమానుషంగా చంపటం సమర్థించం. అది రాక్షసత్వానికి పరాకాష్ట. తన బిడ్డ భవిష్యత్తును యెంతో ఉజ్జ్వలంగా కలలు గన్న ఒక తండ్రి హృదయం తన కళ్ళముందే స్వప్న సౌధంలా కూలిపోతుంటే కన్నతండ్రి రాక్షసుడై దానికి కారణమైన వాణ్ణి బలి తీసుకోవటానికీ, తనకు ఉరిశిక్ష పడ్డా భరించటానికి సిధ్ధ పడ్డాడు, అంటే? అతని దగ్గర ఉన్న డబ్బు కంటే కూతురి మీద పెంచుకున్న ప్రేమ గొప్పది కాదా?
సొసైటీలో అంత ఎత్తకు ఎదిగిన మనిషికి ఈ చర్యకి చట్టం ఏ శిక్ష వేస్తుందో? తెలియదా? అయినా వాటికి బెదరకుండా తనకు శిక్ష పడ్డా పరవాలేదు అనుకొన్నాడు అంటే, ఈ పరిస్థితికి దోహదం చేసిన ఆ అమ్మాయి భాద్యురాలు కారా?
ఈ అమ్మాయి నా బిడ్డ పుట్టే లోపు మా నాన్నను ఉరిశిక్ష వేయాలి అంటుంది. ఈమె ప్రేమ ఎంత గొప్పది.
అసలు మనిషిగా మీనాన్న చని పోయి చాలాకాలం అయ్యింది అది నీకు అర్ధమైతే ఈ కధ వేరేగా వుండేది
త్యాగ మంటే మీనాన్నది- నీది కాదు .నీ స్వార్ధం మొండితనం తో అనవసరంగా అబ్బాయిని ఇందులోకి లాగి హత్యకు కారణం అయ్యావు నీవు జీవిత కాలం ఏడ్చినా ఆ అబ్బాయి తల్లి కన్నీటిని ఆపలేవు
కడుపులో రూపమే చూడలేదు అది మగో, ఆడో తెలియదు అప్పుడే అంత ప్రేమైతే, మరి ఇన్ని సంవత్సరాలుగా నీతో ఆడి, ఆడుకుని, నీకు ఏది అవసరమో దానిగిురించి ఎంత ప్రేమించి ఎంత కష్ట పడ్డాడో,తెలుసా? నీకు నీబిడ్డ పెరిగి పెద్దగ అవుతుంటే? తెలుస్తుంది
అసలు ' ప్రేమ అంటే ఏమిటో అది పెట్టే బాధ ఏమిటో ' అది నీ గుండెని తట్టి తట్టి లేపుతుంది.కాసిని కన్నీళ్ళు దాచుకో అప్పటికి పనికొస్తాయి
No comments:
Post a Comment