రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా!
రాగబంధం విలువు నీకు తెలియదా!!
గతం గుర్తులు గగనానికే వదిలేసి
తన గమ్యాన్ని వెతుక్కుంటూ
వెలుతురులు విరజిమ్ముతూ
వేగంగా వడివడిగా వెళ్ళనేవెళ్ళింది
జననం.... ... మరణం-ఈ మధ్యలో నీ జీవనం ....
ఎర్రగా పరుచుకున్న-పుడమి నుదుట సింధూరం
వేకువ వెలుతురు-వెండి మబ్బుల నాట్యం
కదులుతున్న ఆకాశం-కమ్మని కూని రాగం
పడమటి చరిత్ర గాయాలు-ఆక్రోశగానాలు
కదిలే కాలం తలపై అగ్గికుంపటి లా-పక్కనే వున్నాయి..
అయినా చెదరని చిరు నవ్వు
ఎక్కడిది ధైర్యం-ఎక్కడిది త్యాగం
రగులుతూ, కరుగుతూ
పరుగులు తీస్తూ
పడమటి సంధ్య వైపు
నీ జననం… నీ మరణం…
తనొక మరణం లేని శక్తి
తానెప్పుడూ ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది
ఇక్కడ చనిపోయింది ఎవరు - బ్రతికి ఉన్నది ఎవరు?
No comments:
Post a Comment