Tuesday, September 18, 2018

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం...



అలాంటి నాన్న‍ తన కూతురు ను గుండెల్లో పెట్టుకుంటాడు
భుజాలపై‌ ఎక్కించుకుంటాడు
తన హృదయం పైన‌ నడిపించుకుంటూ‌ తన‌ పాదాలకు చెప్పులౌతాడు
తన బంగారు ‌భవిష్యత్తు గురించి ఎవరూ కనని కలలు కంటాడు
కంటికి రెప్పలా కాపాడుకుంటాడు
అలాంటి తండ్రి
ఒకటి అడిగితే రెండు కొనిస్తాడు
రెండు అడిగితే నాలుగు కొనిస్తాడు

యుక్త వయసుకు రాగానే
తన ఉన్నత చదివుల కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతాడు
తన బాధ కష్టం కనబడకుండా గుండె లోనే దాచుకుంటాడు..
ఒక మంచి జీవిత భాగస్వామికొరకు వెతుకుతునే ఉంటాడు
కూతురు సుఖం సంతోషం కొరకు దేనికైనా సిద్దపడుతాడు...
తను కోరుకున్నది జరిగితే ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడుతాడు

కాని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న‌ యువత స్వేచ్చ స్వతంత్ర్యం పేరు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు...
తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియదని కించపరుస్తున్నారు..
పెళ్ళి వయస్సు కు రాగానే ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కట్టబెడుతున్నారని అంటున్నారు...

నిజంగా ఏ తల్లిదండ్రులు అంత నీచంగా ఆలోచించరు ..పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావిస్తారు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను తల్లిదండ్రులు పరిశీలిస్తారు..
అప్పుడైనా నచ్చితేనే ఆ అమ్మాయికి కూడా ‌నచ్చితే ఒప్పుకుంటారు...
ఏ తండ్రి కూడా ‌తన కూతురు ఏమైనా‌ ఫర్వాలేదని అనుకోడు
తన కూతురు ఏలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటాడు..

కాని నేటి అమ్మాయి లు అలా ఆలోచించడం లేదు
పెళ్ళి వయస్సు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విలన్లు గా చూస్తున్నారు

ప్రేమ అనే మత్తులో పడి మోసమేదో.. మోదమేదో తెలియని వయస్సులో
మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం మాది నిజమైన ప్రేమ అనే మైకంలో తల్లిదండ్రులను ఎదురిస్తున్నారు... తల్లిదండ్రులను బలి చేస్తున్నారు..

నిజంగా మీకు అర్థం చేసుకోనే శక్తి‌ ఉంటే నీకు జన్మనిచ్చిన‌ నాటి‌ నుండి నీ కోసం తన‌ తపన అర్థమయ్యేది .. నీ గురించి కన్న కలలు అర్థం అయ్యేది.. నీ కోసం పడ్డ కష్టం అర్థం అయ్యేది..
నీ చిన్ని కాళ్ళ సరిపడే సైజు కోసం పది షాపులు తిరిగింది....
నీ పుట్టిన రోజుకి‌ నీ సరిపడే డ్రస్ కోసం ఇరవై షాపులు తిరిగింది...
నా కూతురు అందరికంటే ముందుండాలనే ఉబలాటం..
నీవు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ‌ వచ్చేవరకు‌ ఆరాటం... మీకోసం తపించే హృదయం.. అర్థం అయ్యేది

నీ బంగారు భవిష్యత్తు కొరకు ఇరవై ఏళ్ళు గా తపించే నీ తండ్రి నే‌ అర్థం చేసుకోలేని నీవు
గతమేంటో భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక వ్యక్తి గురించి ‌ఎలా అర్థం చేసుకుంటావు...??

నాలుగు రోజులు ‌ఉండే నీ‌ పాదరక్షల కొరకే పది షాపులు తిరిగిన నాన్న
నిండు నూరేళ్ళు జీవించే నీకు తగిన జీవిత భాగస్వామిని‌ ఇవ్వడని ఎలా అనుకొంటారు..

తన పిల్లలని ఒక డాక్టర్... ఇంజినీరింగ్..IAS, IPS చేస్తాడో లేదో కాని...
తను మాత్రం అనుకుంటే అలాంటి ఒక భాగస్వామిని తేగలడు...

కూతురు ఉన్న ఏ తండ్రి యైనా ఎక్కువ గా‌ ఆలోచించేది తన కూతురు గురించే
తనకు సాధ్యమైనంత వరకు అంగ రంగ వైభవంగా కూతురు వివాహం చేయాలని
ఎన్నో కలలు కంటాడు...
ఆ కలలను సాకారం చేసుకోని గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు..

అలాంటి తండ్రి యొక్క కలలను భగ్నం చేయకండి
ప్రేమను గెలవండి
కానీ ....నాన్న ను గెలిపించండి

ప్రేమంటే
ఇద్దరు మనుషులు కలవడము కాదు
రెండు ‌మనస్సులు‌ కలవడమే కాదు
రెండు కుటుంబాలు కూడా ‌కలవాలి..

అదే నిజమైన ప్రేమ
ఇది ప్రతి అమ్మాయి‌ అర్థం చేసుకోవాలి
ఇది ఒక తండ్రి భయం
ఇది ఒక తల్లి వేదన
దయచేసి అర్థం చేసుకోండి

No comments:

Post a Comment

Address for Communication

Address card