Saturday, September 22, 2018

లీలావది అనే బీజ గణితంలో మనోరంజన భాష్య కారులు ఇచ్చిన మంచి రొమాంటిక్ సమస్య ఇప్పుడు ఇస్తున్నాము. దీన్ని పై విధానంలో కనుగొనేందుకు ప్రయత్నించండి.
గణిత సమస్య:
కామిన్యా హారవల్యాః సురతకలహతో మౌక్తికానాం తృటిత్వా
భూమౌ యాతాస్త్రిభాగః శయనతలగతః పంచమాంశో2స్య ద్రష్టః
భాత్తః షష్ఠః సుకేశ్యా గణక దశమకః సంగృహీతః ప్రియేణ
హృష్టం షట్కం చసూత్రే కథయ కతిపథైమౌక్తికైరేష హారః

భావం:
మంచి వయసులో ఉన్న జంట శృంగారంలో ఉండగా ఆమె మెడలోలని ముత్యాల దండ తెగిపోయి భూమి మీద మూడో వంతు ముత్యాలు పడ్డాయి. పక్కమీద ఐదో భాగం పడ్డాయి. ఆరో వంతు ఆమె జుట్టులో చిక్కుకున్నాయి. పడిపోతున్న ముత్యాలలో పదో వంతు జతగాడు పట్టుకొన్నాడు. దండలో ఆరు ముత్యాలు ఇంకా మిగిలాయి. ఇప్పుడు చెప్పండి ఆమె మెడలోని ముత్యాల దండలో ఎన్ని ముత్యాలు ఉన్నాయి?
ఇక్కడ కూడా ఆరు ముత్యాలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ముత్యాలు ఎన్నో కనుక్కో మన్నాడు కనుక ఇష్టకర్మ సూత్రం ప్రకారం కనుక్కోవచ్చు. కనుక దాన్ని ఉపయోగించి కనుక్కుందాం.
1) ముందుగా ఎంతో కొంత అనుకోవాలి కనుక నేను 60 ముత్యాలున్నాయి అనుకుంటున్నాను.
2) వీటిలో మూడో వంతు భూమి మీద పడ్డాయి అంటే నేను అనుకొన్న 60 ముత్యాలలో మూడో వంతు అంటే 20 ముత్యాలు భూమి మీద పడ్డాయి.
3) పక్కమీద ఐదో వంతు పడ్డాయి. 60 లో 5 వంతు అంటే 12 పక్కమీద పడ్డాయి.
4) ఆరోవంతు జుట్టులో చిక్కుకున్నాయి అంటే 60లో 6 వంతు 10 జుట్టులో చిక్కుకొన్నాయి.
5)జతగాడు పదోవంతు పట్టుకొన్నాడు. అంటే 60లో 10 వంతు 6 ముత్యాలు పట్టుకొన్నాడు.
ఇప్పుడు మొత్తం ఎన్ని ముత్యాలు కనుగొన్నాము 20+12+10+6 = 48
సారాంశంగా మిగిలినవి = మనం అనుకొన్న 60 -48 =12
6) ఇప్పుడు ఇష్టకర్మసూత్రం ప్రయోగిద్దాం. సూత్రం ప్రకారం దత్త సంఖ్య ను ఇష్ట సంఖ్యతో హెచ్చవేసి దీన్ని వచ్చిన సారాంశంతో భాగాహరించితే కనుక్కోవలసిన సంఖ్యవస్తుంది.
దత్త సంఖ్య =6 ముత్యాలు. మనం అనుకొన్నది 60 ముత్యాలు. సారాంశం =12
సూత్రం ప్రకారం దత్తసంఖ్య x ఇష్ట సంఖ్య / సారాంశం = 6x60/12 = 30 ముత్యాలు.
ఆమె మొత్తం దండలో 30 ముత్యాలున్నాయి. కావాలంటే పైన ఇచ్చిన భిన్నాలతో సరిచూసుకోండి. మీకు ఆమె చేతిలో మిగిలిన 6 ముత్యాలు సమాధానంగా వస్తుంది.
ఇది వేదగణితం.
ఇప్పుడు చెప్పండి. గణితంలో పిహెచ్ డీ చేసిన వాళ్లెవరైనా తమ పాఠ్య గ్రంథాలు, సైద్ధాంతిక గ్రంథాల్లో ఈ మాదిరిగా ఉదాహృత ప్రాబ్లమ్స్ తో పాటు గుర్తుంచుకోగలిగారా?
ఇది కాదా సంస్కృత భారతి దివ్యమైన మహిమ?
మాకు తెలిసి దీన్ని బీజ గణిత శాస్త్రం అంటారు. ఇది భారత జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగంగా అభివృద్ధి చెందింది. మీ మేక మెదళ్లకు, సెక్యులర్ గ్రహణం పట్టిన పైశాచిక బుర్రలకు ఇది తెలియకపోతే తెలుసుకోండి.
అన్నిటికీ మించి ఇంత బాగా భిన్నాలు, భాగాహారాల గురించి చెప్పగలిగిన విద్యావ్యవస్థనేటి రాక్షసగురువులఆంగ్లవిద్యావిధానంలో ఉందా? ఇందులో ఆవగింజలో వెయ్యోవంతుకూడా లేని సమస్యలు సాథిస్తే ప్రభుత్వ తాబేదార్ల ఉద్యోగాలు ఇచ్చే దౌర్భాగ్య విద్యా వ్యవస్థ తయారైంది. నేటి విద్యావ్యవస్థ గొప్పదా? వేదగణితకాలం గొప్పదా తేల్చుకోండి. ఇది ఇప్పటికీ కావాలా వద్దో కూడా తెలుసుకోండి.

No comments:

Post a Comment

Address for Communication

Address card