హిందూత్వం .కులానికి సంభందించి కాదు మతానికి సంభందించి
నది. హక్కులు కాదు ఆచారాలు గురించి. అసలు హిందూత్వం నచ్చలేదు అంటే అసలు వాదనే లేదు .ఎవరి నమ్మకం వారిది
కాబట్టి
నెలసరి సాకుగా ఆలయ ప్రవేశం నిషిద్ధమనడం..
రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తెలిపింది. నాకు తెలిసీ హిందు ధర్మాన్ని నమ్మిన ఏ స్త్రీ కూడా ఆ సమయయంలో
స్వంత ఇంట్లో కూడా దేవుడి కి పూజ సంగతి తర్వాత, పటం కూడా తాకదు
శబరిమలలో అయ్యప్ప
సన్నిధానంలోకి ఆడవారిని రానివ్వనిదీ స్త్రీలంటే ద్వేషంతో కాదు. అయ్యప్ప నైష్ఠిక
బ్రహ్మచారి. దేవుడికే కాదు.. అక్కడికి వెళ్ళే భక్తులకూ బ్రహ్మచర్యం తప్పనిసరి. 41 రోజుల అయ్యప్ప
దీక్షకు మాలవేసుకున్న తరవాత కుబేరుడైనా, చక్రవర్తి అయినా కటిక నేలమీద ఆడ
వాసన తగలకుండా ఒంటరిగా పడుకోవలసిందే. కఠోర బ్రహ్మచర్య దీక్షకు ముక్తాయింపుగా వేలూ
లక్షల భక్తులు కిక్కిరిసి దర్శనం చేసుకునే ఇరుకైన దివ్య సన్నిధిలోకి వయస్సులోని
స్త్రీలను అనుమతిస్తే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు. అవాంఛనీయ ధోరణులు ప్రకోపించవచ్చు.
మామూలు మనుషులకు దేవుడినుంచి ధ్యాసమళ్లి, భక్తిపోయి రక్తి కలిగి, మగరాయుళ్లకు
గుబులు పుట్టవచ్చు. అది ఆయా మహిళల క్షేమానికి మంచిది కాదు.
క్షేత్రం పవిత్రత చెడుతుంది.
స్థల మహత్మ్యం సన్నగిల్లుతుంది. దివ్యశక్తిని కోల్పోయాక ఆ క్షేత్రానికి వెళ్ళే
ప్రయోజనం ఉండదు. నాస్తికుల, హేతువాదుల సరదా షికారుకు విహార
కేంద్రంగా మాత్రమే అది పనికొస్తుంది. భక్తిగల పురుషులూ, స్త్రీలూ ఇక
అక్కడికి పొమ్మన్నా పోరు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే
శబరిమల దేవస్థానం దైవసన్నిధిలో మహిళల ప్రవేశాన్ని మొదటినుంచీ నిషేధించింది. ఈ
నిషేధం కూడా బహిష్టు ప్రాయమైన 10 నుంచి 50 ఏళ్ళలోపు
స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. 10 లోపు, 50 పైన వయస్సుగల
స్త్రీలను రానివ్వటానికి అభ్యంతరం లేదు. కనుక అయ్యప్ప స్వామిని పక్కా స్త్రీ
ద్వేషి అనడానికి వీల్లేదు. ఈ ఆంకక్షూడా ఆ ఒక్క గుడిలోనే. దేశమంతటా, ఊరూరా ఉన్న ఏ
అయ్యప్ప గుడిలోకైనా 10-50 వయోవర్గం సహా అన్ని వయస్సుల
మహిళలూ నిక్షేపంలా వెళ్లవచ్చు.
దేశమంతటా లక్షోపలక్షల
దేవాలయాల్లో అన్నిటా స్త్రీ పురుషులకు సమాన ప్రవేశం ఉన్నా సరే... ఒక్కచోటే వేరే కట్టుబాటు
ఉన్నది కనుక మహిళా హక్కులు మంట కలిశాయంటూ గగ్గోలు పెట్టాలా? ఆ ఒక్కచోట
కట్టుబాటును పనిగట్టుకుని చట్టుబండలు చేస్తే తప్ప హేతువాదులు, హక్కులమ్మల కళ్ళు
చల్లబడవా? అంత ప్రేమ ఆలోచన కలిగిన మేధావులు మిగిలిన మతాలలోని లోపాలని ఎందుకు అడగరు
ఇది మితవాద, వామపక్ష, స్త్రీవాదానికి సంబంధించిన అంశం కాదు, ఇది మేధావి తనం కాదు
పరోక్షంగా హిందూ సమాజ సంస్కృతి పై దాడి
No comments:
Post a Comment