సప్త సముద్రాల
లోతు కలిగిన విజ్ఞానం ఉన్న నా మతం నుండి నేను ఎందుకు ఏమి నేర్చుకోలేక పోయాను? అవును తప్పు
నాలోనే ఉందా? నేను ఇప్పుడు
గుడికి వెళితే జరిగేది ఏమిటో నాకు ముందే తెలుసు. ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ అర్చన, కళ్యాణం, అభిషేకం టికెట్స అమ్ముతారు, ఏదో ఒకటి కొనాలి అంతే. అలా కాకుండా ఏదైనా ధర్మ
సందేహాలు నివృతి చేసుకోవడానికి గుడికి వెళ్ళే రోజులు పోయాయి. పూర్వం గుడిలో
యోగులు, యోగ భ్యాసం ,
మంత్రం, ధ్యానం నేర్పెవాళ్ళట!, ఒకరో ఇద్దరో
యోగులు నిత్యం ఉండే వాళ్ళట!, కాషాయ బట్టల్లో
తెల్లగా నెరిసిన గడ్డంతో ఉన్న నిజమైన ఋషులను గురించి కధల్లో చదవటం తప్ప గుళ్ళలో
చూసిన గుర్తు లేదు. అయినా.. గుడిని కూడా బిజినెస్ గా నడుపుతుంటే , ఇక్కడకు ఋషులు
ఎవరు వస్తారు? వస్తే ఋషుల ముసుగులో స్వామిజిలు రావాలి. వాళ్ళ ఖర్చులు కూడా టెంపుల్ వాళ్ళే
పెట్టుకోవాలి!. నాకు మాత్రం నేనొక అర్చన
టికెట్ కొనే యంత్రం గా మిగల దలుచుకోలేదు!,
నాకు నేర్చుకోవాలనుంది,
మన కష్టాలను తీర్చి,
సుఖాల తీరం చేర్చే
వేదాల్లో ఉన్న మంత్రాలను నా నోటితో పలకాలనుంది.
నేను దేవుడిని తెలుసు కోవాలంటే అది నా మనసు దేవుని మీద పెట్టి చేసే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. నేను నేర్చుకొనే
మంత్రాలు నాకు మానసిక శక్తి ప్రసాదించు గాక, నా ధ్యానం నాకు ప్రశాంతత చేకూర్చు గాక. హిందూ మతం లో సారాన్ని వదిలి, దానికి
ఎంతో సులువైనది గా మార్చి, కేవలం నేను కొన్న
అర్చన టికెట్ నాకు మోక్షం ప్రసాదిస్తుంది అన్న బ్రమలు నాకు కలగకుండు గాక.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment