Thursday, August 30, 2018

RIP అనే పదం మీకు కూడా అలవాటా? అయితే చదవండి


ఫలానా వ్యక్తి మరణించారనే వార్త ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ లో చూసిన వెంటనే మనం RIP అని కామెంట్ పెట్టడం అలవాటు. నిజంగా మనం RIP అని ఎందుకు వ్రాస్తున్నామో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం. అసలు దీనికి అర్థమేమిటని పరిశోధిస్తే, విజ్ఞానవంతులైన మనం ఎంత అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నామని అర్థమవుతోంది. RIP అంటే Rest in peace అని అర్థం.
క్రైస్తవం ప్రకారం మరణించాక, జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా ఒక డే వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకూ ఈ ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని మనం ఈ RIP ద్వారా కోరుతున్నాం.
మరి సనాతనధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ?
అలాగే మరణానంతరం జీవి యొక్క పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో, మోక్షానికి వెళ్ళడమో వంటి ప్రతిచర్యలుంటాయి. మోక్షం వరకూ ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంతే కానీ మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు. RIP అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక, మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో, లేక స్వర్గస్తుడవ్వాలనో, శాశ్వత పుణ్యలోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప, RIP అని ప్రార్థించడం సనాతనధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి.

LIMITS OF CASH TRANSATIONS


Saturday, August 25, 2018

‘మతం’ అంటే ‘సమ్మతం’ అయినదనేగా..........అర్ధం


‘మతం’ అంటే ‘సమ్మతం’ అయినదనేగా..........అర్ధం

హిందూ మతంలోని వివక్ష గురించీ, కుల మెట్ల గురించి మాట్లాడినప్పుడల్లా.. ఇదేదో మెకాలే చదువుల ఫలితమని..విదేశీ శక్తుల ప్రోద్భలమని..ఓ వైపు మాట్లాడేవాళ్ళను శత్రువుల్లా చిత్రించడమే గాకుండా..అసలు కులాలే హిందూ మతంలో లేవని, యివి ఆంగ్లేయులు భారత సమాజాన్ని చీల్చడానికి వేసిన ఎత్తులనీ కూడా అంటారు. ఈ మధ్యే ఒకాయన హిందూమతంపై విషం చిమ్మడం కొన్నేళ్ళనుండే మొదలయింది అన్నాడు. నిజం కాదు. హిందూమతం ,మతం మాత్రమే కాకుండా ఒక ధర్మంగా స్థిరపడుతున్నప్పటినుండే దానిమీద నిరసనలూ, పోరాటాలూ కూడా ప్రారంబమయ్యాయి.

చార్వాకుడు లేదా లోకాయుత ధర్మం బహుశా వేదాలను, వేద ధర్మాన్ని వ్యతిరేకించిన తొలి నిరసన కావచ్చు.
రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే బౌద్దాన్ని నెలకొల్పిన బుద్దుడిదీ హైందవం మీద నిరసనా, తిరుగుబాటే!
బుద్దిడి తర్వాత మరో వెయ్యేండ్లకు బసవ తత్వం నెలకొల్పిన బసవన్నదీ హైందవం మీది తిరుగుబాటే!
పధ్నాలుగు, పదిహేనో శతాబ్దాల్లో భక్తి వుద్యమాన్ని నడిపిన కబీరూ, తుకారాం, మీరా.. లాంటి కవులు హిందూమతంలోని అనాచారాల మీద గొంతెత్తినవారే!
పదిహేడో శతాబ్దపు మన వేమన చేసినదీ తిరుగుబాటే, నిరసనే!
యిక స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యాక సామాజిక మార్పు కోసం, హిందూ కుల వివక్షల మీద పోరాటం చేసిన పూలే దంపతుల నుండీ..అంబేద్కర్ వరకూ ..

పోరాటం జరుగుతూనే వుంది. జరుగుతూనే వుంటుంది.

ఏ పోరాటం అయినా  ఆగిపోవడం అనేది, అన్యాయం ఆగిపోవడంతోనే సాధ్యం. ఒకరు చెబితేనో, ప్రోత్సహిస్తేనో జరిగే పోరాటం గుప్పున మండి ఆరిపోవచ్చేమో గానీ శతాబ్దాల తరబడి జరగదు. శతాబ్దాల తరబడీ పోరాటం జరుగుతోందంటే పోరాటం విఫలమయినట్లూ కాదు, అన్యాయం జరగనట్లూ కాదు.

అయినా ఇప్పటికీ హిందూమతం తన ఉనికిని కోల్పేలేదు .కారణం అది ‘దేవుడు’ అనే పరిధిలో మాత్రమే లేదు ధర్మాధర్మాలు రూపేణా జీవన శైలి అయింది. మన జీవన శైలిని అంత త్వరగా ఎదో కారణాలు చెప్పి ఇతరులు మార్చలేరు.  దీనికి గట్టి ఉదాహరణ అంబేడ్కరే
          దేశంలో అంబేద్కర్ ని,అయన భావాల్ని  అభిమానించి పూజించే వారు చాలామంది వున్నారు ,కానీ అంబేద్కర్ అనుసరించిన భౌద్ధమతాన్ని ఎంత మంది అనుసరిస్తున్నారు.అసలు మన తెలుగు వారిలో భౌద్ధ మతం అనుసరించేవారు ఉన్నారనుకోను.
  అందువల్ల ఎక్కడో ఎవరో ఎదో చేసారని మతం ద్రోహం లేదా దాడి అనుకోవటం అర్ధరహితం.ఆలోచనా రాహిత్యమ్
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, August 23, 2018

GOLD NEWS





మీ బిడ్డకి ఏ పేరు పెట్టిన గొడవే లేదు.


                మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు?

                రాముడు, రావణుడు.

                నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం.

                మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బిడ్డకి ఆ పేరు పెట్టకూడదని మీరు భావించారో, అవి మీ కొడుకులో కూడా కలగకుండా మీరు వాటిని నిరోధించేలా పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఏ పేరు పెట్టిన గొడవే లేదు.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, August 16, 2018

తడబడు అడుగుల ‘తప్పిన’ తాళం



నీ చేతులు మురికి అని, *లిక్విడ్ సోప్* అన్నారు.
అనారోగ్యం మురికి మాటేమో గానీ *ప్రపంచమంతా ప్లాస్టిక్ డబ్బాలే!!*
అరిటాకు, మట్టి పాత్రలు *అనాగరికం* అన్నారు. స్టీల్ ప్లాస్టిక్ పాత్రలు పేపరు పళ్లేలు వాడమన్నారు.
ప్లాస్టిక్ పేపరు హానికరమైనవని తెలిసేసరికి, *అరిటాకులు మట్టి పాత్రలు మాయం.*
చెట్లనుండి నేరుగా కోసుకు తినడం అనారోగ్య కారకం అన్నాడు.
పాకేజి ఫుడ్, ప్రోసెస్ఢు ఫుడ్ తినమన్నాడు.
అవి హానికరమైన కెమికల్స్ తో నిండి ఉంటాయని తెలిశాక, *కోసుకుతినడం మరచిపోయాము.*
పిల్లలు గట్లమీద, మైదానంలో ఆడుకుంటే అనారోగ్యమని, *ఆటబొమ్మలు, విడియో గేమ్స్* ఆడుకోమన్నాడు.
బొమ్మలు విడియోలు ఒళ్ళు మెదళ్ళు పాడు చేశాయని తెలిసే సరికి, *గట్లు మైదానాలు, స్నేహితులు మాయం.*
చేనేతలు, నూలు బట్టలు గరుకని, అసహ్యమని, *నైలాన్లు, పాలియెస్టర్లు* బ్రాండు వేసి తెచ్చాడు.
నైలాన్లు పాలియెస్టర్లు హానికరమని చూస్తే, *చేనేతకార్లు మాయం.*
ఇంటి వైద్యం, ప్రాచీన వైద్యం *అనాగరికం, పనికిరావు* అన్నాడు
రసాయన వైద్యం ఆధునికమన్నాడు.
ఆధునిక వైద్యం హానికరమైనది తెలిసేటప్పటికి, *ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాము.*
రోగి బాధలు, వ్యాధి లక్షణాలు వ్యాధినిర్ధారణకి సరిపోవని, *మషీన్లు టెస్టులు* తీసుకొచ్చాడు.
మషీన్లు టెస్టులు జేబుల్ని కత్తిరించినా వ్యాధి నిర్ధారణ కాదని తెలిసేసరికి,
*
మంచి డాక్టర్‌లు* మాయం.
మన కంటికి కనిపించని *క్రిములను చూపి భయపెట్టి,* శక్తివంతమైన రసాయన క్లీనింగ్ ఏజెంట్స్ వాడమన్నాడు.
కానీ ఆ రసాయనాలు హానికరమని చూసేసరికి, *శ్వాసకోశాలు దెబ్బతిన్నాయి.*
మనకేది మంచిదో తెలిసే టప్పటికి  *మనిషే మాయం*
Top of Form
Bottom of Form
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, August 15, 2018

స్వాతంత్రం రాకుండా ఉండుంటే ఎలా ఉండేవాళ్ళం



మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భైరెండేడ్లు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.  ప్రస్తుతానికి సాధించింది ఎంతో మనందరకూ తెలుసు. "బ్రిటిష్ వాళ్ళ కభంద హస్తాలలో చిక్కుకొని, కార్చడానికి కన్నీరు ఇంకి పోయి, తన బిడ్డలా అవస్థలు చూడలేక, వాళ్ళకు విముక్తిని ప్రసాదించలేకఆ విషపు కోరల మధ్య నలిగిపోయిన భారత మాత ద్రాస్య సృంఖలాలు తెంచిన స్వాతంత్రం"..  బాబోయి ... చాలు  ..బాబోయి.. చాలు .. ఈ తాండ్ర పాపారాయుడు టైపు డైలాగులకు ఇది సమయం కాదు కానీఅసలు స్వాతంత్రం రాలేదు అనుకొంటే మన దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఒక సారి తమాషాగా చూద్దాం.
  • బ్రిటిష్ వాళ్ళు పెట్టిన  మనదేశం పేరు మారదు కానీ ఇండియా, యుకె లో భాగం అయ్యి ఉండేది. అంటే మనం లండన్ వెళ్లి ఆక్ఫోర్డ్,  Cambridge university లో చదవాలంటే  VISA అక్కర లేదు. 
  •  మనవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లండన్, యుకె వెళ్లి పనిచేసుకోవచ్చు. టికెట్ కొని వెళ్ళడమే అంతే.
  • ఒక్క యుకె మాత్రం కాదు, ఐరోపా ఖండం మొత్తం తిరిగి రావచ్చు. ఎక్కడైనా పని చేసుకోవచ్చు.
  • అమెరికా వెళ్ళాలంటే 90 డేస్ వీసా ఫ్రీ ఎంట్రీ. ఈజీ గ్రీన్ కార్డు ప్రాసెస్సింగ్.
  • మన కరెన్సీ పౌండ్ అయివుండేది. ఒక పౌండ్ అంటే దాదాపు 75 రూపాయలు, అమెరికన్  డాలర్ కంటే చాల ఎక్కువ అంటే అమెరికన్స్ కన్నా ధనవంతులం. 
  • రిజర్వేషన్ లు ఉండేవి కాదు, టాలెంట్ ఉన్నోడిదే ఉద్యోగం. 
  • ఆంధ్ర, తెలంగాణా అంటూ  ఉన్న టైం అంత తగలేసే ఉద్యమాలు ఉండేవికాదు. 
  • చీటికి మాటికి నిరాహార దీక్షలంటూ, ఓట్లకోసం రైతు జపం చేసిరోడ్డుల మీద, రైలు పట్టాల మీద పడుకొని, అదే ఒక ఉద్యమం అని మురిసిపోయేపనికిమాలిన రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కాదు. 
  •  విశ్వ విద్యాలయాల్లో చదువుకొంటున్న విద్యార్ధులే ప్రభుత్వ ఆస్తులు  ధ్వంసం చేస్తేఆ ఆస్తులు రక్షించాల్సిన ప్రజా నాయకులే వాళ్ల మీద కేసులు ఎత్తివేయాలని సిగ్గులేని డిమాండులు చేసి ఉండేవాళ్ళు కాదు.
  • తెల్ల రేషన్ కార్డులు, పచ్చ రేషన్ కార్డులు, రెండు రూపాయల బియ్యం, రచ్చ బండ, గుదిబండ, లాంటి ఒట్లాకర్షణ గిమ్మిక్కులు ఉండేవి కావు. 
  • మన బస్సులు మనమే తగల బెట్టుకొనిఅదో గొప్ప ఘనకార్యం గా మురిసిపోయే మూర్ఖ ప్రజలను, నాయకులను చూసి గర్వపడే దౌర్భాగ్యపు స్థితిలో ఉండేవాళ్ళం కాదు. 
  • పాకిస్తాన్ నుండి వచ్చి, వందల మందిని పట్ట పగలు చంపిన వాడికి, సాక్షాలు సరిపోలేదంటూ ఇంకా రాచ మర్యాదలు చేస్తూజైల్లో చికెన్ బిరియానిలు తినిపించే వాళ్ళం కాదు. 
  • మనకు తల్లి లాంటి  పార్లమెంటు మీద దాడి చేసినాలుగురు  సైనికులను చంపినవాడినిమత ప్రాతిపదికన, ఓట్ల కారణంగా ఉరి తియ్యలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు.
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, మరెన్నో. నష్టాలు కూడా చాలా ఉండొచ్చు ఇది కేవలం   హాస్యం కోసంతప్ప చర్చావేదిక కాదు.జస్ట్ నవ్వుకోండి అంతే
స్వతత్రం వచ్చి మంచి జరిగిందాలేక పెనం మీద నుండి పొయ్యిలో పడిన సామెత లాగాక్రూరత్వం, మరెంతో తెలివైన పరిపాలన కలిగిన బ్రిటిష్ వాళ్ళనుండిమూర్ఖపుకుల-మత ప్రాతిపదికన పరిపాలించే మన భారతీయ రాజకీయ నాయకుల చేతుల్లో పడ్డామా  అనేది ఎప్పటికి అర్ధం కానీ ప్రశ్న. 
..  జై భారత్ , జై జై భారత్.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card