Monday, April 24, 2017

‘మతం అంటే ఏ కులానికి ఆ కులం తమ స్వార్ధంకోసం కొట్లాడే విడివిడి ఆటవిక గుంపులు’



 మతం అంటే ఏ కులానికి ఆ కులం తమ స్వార్ధంకోసం కొట్లాడే విడివిడి ఆటవిక గుంపులు’- అంబేడ్కర్‌
                ఈ భారత సమాజం మళ్ళీ ఆటవిక గుంపులు/ జాతులు/కులాలు/మతాలూ/వర్గాలుగా మిగిలిపోతుంది. సారాంశంలో అంబేడ్కర్‌ పరిశోధనలు ముఖ్యమైనవే. అయితే శాశ్వత పరిష్కారాలు మాత్రం కావు. ఆయనది సాంస్కృతిక విప్లవంలో ఎన్నదగిన పాయ లాంటి పోరాట రూపమే తప్పితే, సమూల మార్పు తెచ్చే వర్గపోరాట రూపం కాదు. దేశంలోని రెండు/మూడు కులాలు భూయాజమాన్యం, సంపద ద్వారా పొందిన ఆర్ధిక స్థితినుంచి -వ్యాపారం,  ఉత్పత్తి సాధనాల యాజమాన్యం ద్వారా రాజ్యాంగ యంత్రాంగం లోనికి, రాజ్యాధికారం లోనికి చొచ్చుకుపోయాయి. తద్వారా నేడు వారికి వచ్చిన సామాజిక హోదాకి కారణం, మూలం- ఆర్ధికమే అని తెలియడం లేదా?  
              అంతేకాక ఏ కులాన్ని తీసుకున్నా కూడా ఆ కులంలో పై మెట్టులో ఉన్న ఆస్తి ఎక్కువగా గల వర్గం ఆఖరు మెట్లపై ఉన్న తన కులంలోనే ఆస్తి తక్కువగా గల/ ఆస్తి లేని వర్గం వారిని తమ దరి చేరనివ్వరు. సారాంశంలో, వర్ణవ్యవస్థలోని కులం వలె కాక నేడు ప్రతి కులం- ఆస్తే మూలంగా, ఆస్తి కొనసాగింపునకు అధికారమే (రాజ్యాధికారమే) లక్ష్యంగా- ఈ రెండింటిద్వారా సమకూరే సామాజిక హోదాయే తమ కులం కొనసాగింపునకు అసలు గమ్యంగా కొనసాగుతున్నాయని తెలుసుకోవాలి.
           మానవ స్వార్ధం అనాదిగా ఉందనీ, శాశ్వతమనీ నమ్మే, ఎదుటి వ్యక్తిని మోసం చేస్తే తప్ప మనలేమనే భ్రమాత్మక విశ్వాసం ఆధారంగా నడుస్తున్న సామాజిక స్థితిలో అందరూ మసలడం, సమాజం అంటే ఒక  ఆకారం లేని విషయమనీ, సంపద తెలివైనవాని సొత్తనీ, అలా ఎంతైనా సంపద సమాజంలో ఉందనీ, లేదా ముందుగా సొంతం చేసుకున్న వారికే అది దక్కుతుందనే దోపిడీ భావజాలం ఫలితంగా కలిగే సంపాదనా యావ. కుల, వర్గ భావనకు కారణాలు. మతాలూ మతగ్రంధాలు కావు దోపిడీ కొనసాగింపునకు అవి ‘సాకులు’ మాత్రమే------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card