కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా మన
జీవితాలలోకి ప్రవేశపెట్టబడతాయి
ఇప్పటికీ భారతదేశం produce చేసే సరుకులకి demand లేదు. మన crudeoil
imports రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ crude oil
reserves ని control చేస్తున్న USA తాలూకు dollar కి పరువు, బరువు. అమెరికా ఇరాక్ లో చేసిన యుధ్ధం అంతా దీని గురించే. కారణం ఏదైనా
చెప్పొచ్చు. నిజంగా ఈ petrol, diesel లేకపోతే పని నడవదా? నడుస్తుంది కానీ competition పెరిగిన ప్రపంచంలో ఎవడి ఉనికి వాడు నిలబెట్టు కోవడానికి
scooter, ఇంకా status కూడా add అయితే car తప్పవు. ముందు వీటిని మనకి అమ్మితే వీటి ఇంధనం కోసం చచ్చినట్టు petrol, diesel కొనడమే. ఏ దేశమైతే resources control చేస్తుందో దానిదే పైచెయ్యి. కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా
మన జీవితాలలోకి ప్రవేశపెట్టబడతాయి. ఉదాహరణకి toothpaste, brush లేకపోతే పళ్ళు తోముకోలేమా? నా చిన్నప్పుడు మా తాతగారి ఊరిలో వేప పుల్లలు, లేదా ఉప్పు,కచ్చిక(కొబ్బరి
డొక్కలు కాలిస్తే వచ్చేది) పెట్టి పళ్ళు తోముకునే వారు. అప్పుడూ పళ్ళు శుభ్రం గానే,ఇప్పటి
కంటే గట్టిగానే ఉండేవి. ముందు status symbol గా అందరి జీవితాలలోకి ప్రవేశించిన ఈ toothpaste ఇప్పుడు నిత్యావసరం లోకి మారింది. ఇప్పుడు అది ఏ పల్లెటూరు అయిన brush, paste
compulsory. మనం దినసరి అలవాట్ల లో వాడే (తినేవి కూడా కావచ్చు)చాలావాటిని ముందు
మనకి అలవాటు చేసి, తరువాత ధర పెంచడం, అవసరం లేని వస్తువుని ప్రవేశపెట్టి ,అవసరంగా మార్చడం అదో marketing
strategy. ఈ marketing గురించి మాట్లాడుకుంటే అదో మహాసముద్రం. ఇప్పుడు industrialization దెబ్బకి చెట్లు కూడా లేవు వేప పుల్లలు దొరకవు. రేపటి రోజున ఎవడో
ఒకడు ప్రత్యేకించి విదేశీయుడు “nature in its original form –herbal
cure for teeth and gums – Neem stick” అని వేపపుల్లని toothpaste కంటే ఎక్కువ rate కి అమ్మేసినా ఆశ్చర్యపోవఖ్ఖరలేదు.
ఈ crude దెబ్బ అక్కడితో ఆగదు. దీనివల్ల LPG ధర పెరుగుతుంది, రవాణా ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధర పెరుగుతుంది, చివరిగా మనం తినే తిండి ధర మనం భరించలేనంతగా
పెరుగుతుంది. ఏదో విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో చదువులు అంటే మానేయొచ్చు కానీ తిండి
మానడం కుదరదు కదా. ఇంతకు ముందు చరిత్రలో ఇలాటివి జరగలేదా అని question రావోచ్చు. నూటికి నూరు శాతం వచ్చి ఉంటాయి. కానీ
చరిత్రలో అవి రాసుకోరు. ఒకవేళ రాసుకున్నా దాని గురించి మాట్లాడుకోరు. ఉదాహరణకి మన
విజయనగర సామ్రాజ్యంలో అంగట్లో రత్నాలు అమ్మేవారుట. Persia నించి వచ్చిన ‘అబ్దుర్ రజాక్’ చెప్పాడు
కాబట్టి కొంత నమ్మోచ్చు. కానీ నాకు చిన్నప్పుడు మా class teacher విజయనగర సామ్రాజ్యంలో ముత్యాలు, వజ్రాలు,రత్నాలు road పక్కన కుప్పలు పోసి అమ్మే వారని చెప్పింది. నేను
చిన్నప్పుడు నోరు వెళ్లబెట్టాను. ఇలా కూడా ఉంటుందా అని. ఆవిడ కూడా ఏ ఉత్సాహంకల
చరిత్రకారుడు చెప్పిన చరిత్ర విని ఉంటుంది. ఆ తరువాత రాయల సామ్రాజ్య పతనం, విజయనగర దుస్థితి, అది ఎంత హీనదశ చూసింది, ఎవడో రాసే ఉంటాడు కానీ మనకి అఖ్ఖరలేదు. ఎందుకంటే
మొదటి విషయం ఇచ్చిన kick రెండో విషయం ఇవ్వదు. ఇందుకే మన రూపాయి విలువ దీని ఫలితంగా(status symbol పేరుతో మనకున్న వస్తువుల పై మోజువల్ల) వచ్చిన inflation వల్ల పడిపోయింది.
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment