Friday, April 28, 2017

జుట్టు కత్తిరించకనే క్షవరము చేయు వృత్తులు అనేకం



జుట్టు కత్తిరించకనే క్షవరము చేయు వృత్తులు అనేకం


                       అసలు మానవదేహమే అశాశ్వతము గదా! మళ్ళీ ఈ అశాశ్వత దేహానికి అంతకన్నా
అశాశ్వతమైన ఈ జుట్టెందుకు? ఈ బట్టతల ఒక్క మానవ మగాళ్ళకేనా? దేవుడు మాగాళ్ళకుండదా? ఏమో! దేవుళ్ళకి మాత్రం బట్టతల్లేదని ఎలా తెలుస్తుంది? వాళ్ళెప్పుడైనా కిరీటాలు తీస్తేగదా!
సరే! మళ్ళీ విషయానికొస్తాను.
                    తలపై కత్తిరించు ప్రదేశము తక్కువ కావున కత్తెరకి పని తక్కువ. కాబట్టి డబ్బులు కూడా తక్కువేమో అనుకున్నాను, కానీ కాదుట! నెత్తిమీద జుట్టుతో నిమిత్తం లేకుండా క్షవరానికింత అని స్టాండర్డ్ రేటు వుంటుంది. వాస్తవంగా జుట్టు ఎంత తక్కువుంటే, సొమ్ములు అంత ఎక్కువ వసూలు చెయ్యడం న్యాయమని క్షురకుని అభిప్రాయం! ఎందుకంటే - వున్న కొద్ది వెంట్రుకల్నీ అత్యంత ఏకాగ్రతతో, నిపుణతతో సర్దుబాటు చెయ్యాలి కదా!

                    
నాకు క్షవరం చేయించుకోవటం భలే ఇష్టం! ఒక చేతిలోని దువ్వెనతో దువ్వుతూ, రెండోచేతిలోని కత్తెరని
లయబద్దంగా ఆడిస్తూ, కొంచెం కొంచెం జుట్టు కత్తిరిస్తూ - నాకు ప్రతి క్షురకునిలోనూ ఒక అమరశిల్పి
జక్కన కనిపిస్తాడు, ప్రతి కత్తెర శబ్దంలోనూ ఒక ఇళయరాజా వినిపిస్తాడు.

క్షురక వృత్తి ప్రత్యేకమైనది. ఎంతటి మారాజునయినా తలదింపే శక్తి ఈ వృత్తికుంది. పైగా వారిచేతిలో కత్తెరా,కత్తీ ఉంటాయి. అందువల్ల అందరూ భయభక్తులతో తల దించుకోవాలి. 'ఎవరికీ తల వంచకు' అంటూ ఘంటసాల స్టోన్లో గర్జించిన ఎన్టీవోడిక్కూడా క్షురకుని ముందు తలవొంపులు తప్పవు గదా!

'తల'కి మాసిన మానవాధములకు తైలసంస్కారాన్ని ప్రసాదించే ఈ వృత్తి ఎంతటి పవిత్రమైనది! క్షవరము అనగా జుట్టు కత్తిరించుట. పైకమునకు జుట్టు కత్తిరించుట క్షౌరవృత్తి. కానీ - జుట్టు కత్తిరించకనే
క్షవరము చేయు వృత్తులు అనేకం.

'జుట్టు కత్తిరించకుండా క్షవరమా! కొన్ని ఉదాహరణలిమ్ము.'
           
డాక్టర్లు లేని రోగములకు ఇన్వస్టిగేషన్లు, ప్రొసీజర్ల పేరున క్షౌరము చేయుదురు. కొందరు అత్యాశపరులైన
డాక్టరుబాబులైతే ఏకంగా గుండే గీసేస్తారు. ఆపై ఆ గుండే గీయకపోతే నువ్వు చచ్చేవాడివని దబాయిస్తారు.
క్షమించాలి! కొందరు –అంతే- అందరూ కాదు                
                                    రాజకీయ నాయకులు 'ప్రజాసేవ' అనే క్షవరం చేస్తారు. ఈ క్షురకర్మని నిర్వర్తించుటలో - 'స్కీములు, స్కాములు' అంటూ ఒక్కొక్కరిది ఒక్కో పధ్ధతి. గవర్నమెంటు ఉద్యోగులు 'అమ్యామ్య' పేరుతో క్షవరం చేస్తారు. వీరి క్షౌరశాల తిరుమలలోని కళ్యాణకట్ట కన్నా పెద్దదిగా యుండునని అభిజ్ఞువర్గాల భోగట్టా. వీరి లీలలు అనంతం. ఈ క్షురకాగ్రేశర చక్రవర్తుల చరిత్ర రాసుకొంటూ పోతే మన సమయం క్షవరం అవుతుంది!
          
             మిత్రులారా, ఈ ప్రపంచమే ఓ పెద్ద క్షౌరశాల. అందు మనమందరమూ క్షురకులమే! ఇచ్చట నిరంతరముగా, అత్యంత లాఘవముగా 365 రోజులూ క్షౌరశాలలు నిర్వహించబడును. క్షురకర్మలు చేయబడును. ఇది కలియుగ ధర్మము! క్షవరం చెయ్యడం మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ తరవాత అలవాటైపోతుంది. 'సాధనమున సమకూరు ధరలోన' అన్నారు పెద్దలు. అయినా - 'క్షవరం చేయుటకు నీవెవ్వరు? చేయుంచుకొనుటకు వాడెవ్వడు? అంతా నేనే!' అని గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు (రిఫరెన్స్ అడగొద్దు)!

                 ప్రపంచం విశాలమైందే కాదు, మోసాలపుట్ట కూడా! ప్రతిక్షణం ఒకళ్ళనొకళ్ళని క్షవరం చేసుకుంటూ జీవించడం మానవ నైజం. ఎటువంటి అన్యాయం చెయ్యకుండా ఫిక్సెడ్ ధరలకి క్షవరం చేస్తున్న క్షురకులకి అభినందనలు. మీరే లేకుంటే జుట్టు పెరిగిపొయ్యి దురదలు పుట్టి గోక్కోలేక చాలామంది చచ్చేవాళ్ళు. థాంక్స్ వన్సెగైన్!   
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, April 27, 2017

తెలుగు వార్తలకి జర్నలిస్టులెందుకు



 
తెలుగు వార్తలకి జర్నలిస్టులెందుకు!?
 
             మనిషి స్వేచ్ఛాజీవి. ఇష్టం లేని పన్లు మానెయ్యొచ్చు. అలాగని అన్నిపన్లూ మానెయ్యలేం. ఉదాహరణకి - నాకు గెడ్డం
చేసుకోడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ - దురద వల్ల చచ్చినట్లు చేసుకుంటాను. కొన్నిపన్లు మాత్రం
మానేశాను - ఎంతోకాలంగా తెలుగు సినిమాలు మానేశాను, తెలుగు సీరియళ్ళ చానెళ్ళని చూడ్డం
మానేశాను. ఉదయాన్నే పొన్నూరు రాగానే టీ లేదా కాఫీ  చప్పరిస్తూ రెండుమూడు ఇంగ్లీషు పేపర్లు తిరగేస్తాను.

               అలాగని నేను తెలుగు భాషకి వ్యతిరేకిని కాను. ఆమాటకొస్తే కాస్త ఎక్కువ ఇష్టం .అయితే - ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ, ఎదుటి పార్టీ నాయకుణ్ణి దుమ్మెత్తి పోసే 'వార్తల'  కరపత్రాల్ని’ డబ్బిచ్చి కొనడం దండగ అని నా అభిప్రాయం. అలాగే ప్రతి న్యూస్ చానెల్‌కీ ఒక ఎజెండా వుంది. ఏ చానెల్లోనూ ఏ వొక్క వార్తా వొకే విధంగా రాదని అర్ధమయ్యాక న్యూస్ చానెళ్ళని
చూడ్డం మానేశాను.

               మరప్పుడు తెలుగు జర్నలిస్టులు ఎవరు? రాజకీయ బ్రోకర్లైన యాజమాన్యాల అభిరుచికి తగ్గట్టుగా వార్తలు
వండి వార్చే కార్మికులే జర్నలిస్టులు! వీళ్ళని జర్నలిస్టులని అనాలంటే మనసొప్పదు గానీ, ఇంకో పదం
దొరకట్లేదు. కొంతమంది టౌన్ స్థాయి జర్నలిస్టులైతే ఒక ముఠాగా ఏర్పడి, వృత్తిరీత్యా ఏర్పడ్డ పరిచయాల్తో పైరవీలు
చేసుకుంటూ సంపాదిస్తారు. ఈ సో కాల్డ్ జర్నలిస్టులు కొంతమంది,ప్రయాణాల్లో రాయితీ పొందుతారు, ప్రభుత్వంతో లాలూచీ
పడి చౌకగా ఇళ్ళ స్థలాలు కొట్టేస్తారు. ఇంక ప్రభుత్వాన్ని,అధికారుల తప్పులని ఎత్తి చూపుతూ వీళ్ళేం 'వార్తలు' రాస్తారో అర్ధం కాదు!

                సరే! ఈ దేశంలో నడిచే అనేక అక్రమ వ్యాపారాల్లాగానే ఈ న్యూస్‌పేపర్ వ్యాపారం కూడా వొకటి. వీటిని ఎవాయిడ్
చెయ్యడం మినహా మనం చెయ్యగలిందేంలేదు. కొన్ని పత్రికలు ఎడిట్ పేజిలో కొంత స్పేస్ వ్యాసాల కోసం వదిలేస్తాయి. ఈ
స్పేస్‌లో మన తెలుగు మేధావులు వ్యాసాలు రాసి తరిస్తుంటారు! ఒక అనైతికమైన వ్యాపార పత్రికలో తమ వ్యాసాల్ని
అచ్చేయించుకునే ఈ మేధావుల డొల్లతనం ఆశ్చర్యం కలిగిస్తుంది!

             తెలుగు న్యూస్‌పేపర్లకి ఎడిటర్లు వుంటారు గానీ - వాళ్ళది సెక్షన్ ఆఫీసర్ స్థాయి. జీతం కోసం తల
వొంచుకుని పన్జేయ్యడం వీరి స్పెషాలిటీ మరియూ అర్హత. మరి వీళ్ళకి 'ఎడిటర్' అని ట్యాగ్ ఎందుకబ్బా!
విలువలు లేని ఈ పత్రికల వార్తలు కొందరికి నచ్చొచ్చేమో గానీ – కొంత మందికి  మాత్రం రోత. అందువల్ల  చాలామంది ఈ
'గొప్ప' పేపర్లని చదవడం మానేశారు.

          ఈ మధ్య నాయకుల మీద  కేసు లు,లేదా అభియోగాలు  ఎక్కువయిన కొద్దీ  వారి మీద జర్నలిస్టుల ఆరాధన పెరిగిపోతుంది  .కొన్ని టీవీ చానెల్స్ ప్రసార కార్యక్రమాలు సరీగ్గా నచ్చక. చానెల్స్ మారుస్తుండగా. యాక్సిడెంటల్‌గా ఒక తెలుగు రిపోర్ట్ కంటబడింది. ఎందు నిమిత్తం అయినా  అలాంటి  కేసులు,లేదా అభియోగాలు  ఎక్కువగా వున్న ఒక నాయకుడు దేవుడి దర్శనానికి తిరుమల వెళ్ళాట్ట - గొప్పగా హైలైట్ చేసి ఆయన సౌండ్ బైట్స్ తీసుకుంటున్నారు. ఇదీ మన తెలుగు జర్నలిస్టుల పనితీరు!

            ఈ రకమైన జర్నలిస్టులకి  ‘విమర్శ’  అంటే అర్ధం కానిది- ‘పరామర్శ’  అంటే  ఉత్సాహంగా పరుగెత్తించేది. హమ్మయ్యా! నా నిర్ణయం కరెక్టే - తెలుగు వార్తల (ముఖ్యంగా రాజకీయ  వార్తల ) రిపోర్టింగ్ అత్యంత హీనం, హేయం.
 ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, April 26, 2017

మన దేశపు మేధావులు మన దేశానికి చేస్తున్నదేమీ లేదు



మన దేశపు మేధావులు మన దేశానికి చేస్తున్నదేమీ లేదు
(నిన్నటి వ్యాసానికి ముగింపు-2)


                      ఇప్పుడే కాదు భారత దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గిర నించి ఇదే పరిస్థితి. మనది Mixed economy. అంటే కొన్ని పరిశ్రమలు government run చేస్తుందికొన్ని private parties run చేస్తాయి. కారా మాస్టర్ ‘కుట్ర’  లో చెప్పినట్టు మన దేశం భ్రష్టు పట్టి పోవడానికి కారణం మన policies & decision making. Heavy industries అంటే ‘భార’  పరిశ్రమలు అన్నీ government, Corporate Industries అంటే ‘భారీ’ పరిశ్రమలు అన్నీ private. అంటే ప్రజల సొమ్ముతో పెట్టిన పరిశ్రమలు అన్నీ private పరిశ్రమలకి ముడి సరుకులు అందించే పరిస్థితే గానీ మన దగ్గిర ఉన్న low technology తో తయారైన heavy industrial goods కి globalగా demand లేదు. తయారుచేసినవి బయట అమ్ముకోలేకఅమ్ముకోవడానికి మన దేశంలో ఉండే పెట్టుబడిదారులు ఎవరూ ముందుకి రాకపోతే వాళ్ళకి concessions ఇచ్చిఅప్పులు ఇచ్చి వాళ్ళని కోటీశ్వరులు చెయ్యడం తప్పితే ప్రజలకి ఒరిగిందేమీ లేదు. Liberalization పేరుతో Capitalist agenda ని అద్భుతంగా అమలుపరచడందాన్ని ఏదో గొప్ప achievement అని ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ప్రయత్నిస్తే రూపాయి విలువ పడిపోకుండా ఆపొచ్చు అన్నది మన నాయకులకి తట్టదుఅనిపించదు. ఎందుకంటే వాళ్ళ agenda యే వేరు. ఇప్పటికీ మనం technology వేరే దేశాలపై ఆధారపదడమే కానీ indigenous technology కి సంబంధించి ఏమీ positive steps తీసుకున్న దాఖలాలు కనపడవు. అప్పుడప్పుడు పృథ్వీఅగ్ని అనడమే- అంతే. మన దేశంలో పుట్టిమన దేశంలో చదువుకునివిదేశాలకి లాభం చేకూర్చడమే కానీమన దేశపు మేధావులు మన దేశానికి చేస్తున్నదేమీ లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ వాళ్ళ తెలివితేటలకి గౌరవం లేదు. వసతులు లేవు. పైపెచ్చు ఇక్కడ ఏమైనా చేద్దామనుకున్నవాడికి unnecessary harassment. పరిపాలిస్తున్న నాయకులకి ఏమి చేస్తే దేశానికి మంచి జరుగుతుందో తెలియదా తెలుసు కానీ వాళ్ళ గొడవలు వాళ్ళకి ఉన్నాయి. దీనికి తోడు కొంతమంది బుర్రలు లేని నాయకులు. బుర్ర ఉండి commitment ఉన్నవాడిని రానివ్వరు. బుర్ర ఉన్నా అది వాడే అవసరం ఉండదు. ఇంకా ఏమైనా చేద్దామనుకున్న కొందరు మనకెందుకులే ఈ international- power play- politics లో నలిగి, అని ఊరుకోవడం. Balance ఏమైనా మిగిలిపోతే అవి regional, Cast(communal ) politics లో నలిగి నాశనం. ఇంక మిగిలినవి మన private పెట్టుబడిదారులు మూసేశారు. అదీ పరిస్థితి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Tuesday, April 25, 2017

కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా మన జీవితాలలోకి ప్రవేశపెట్టబడతాయి




కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా మన జీవితాలలోకి  ప్రవేశపెట్టబడతాయి


            ఇప్పటికీ భారతదేశం produce చేసే సరుకులకి demand లేదు. మన crudeoil imports రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ crude oil reserves ని control చేస్తున్న USA తాలూకు dollar కి పరువుబరువు. అమెరికా ఇరాక్ లో చేసిన యుధ్ధం అంతా దీని గురించే. కారణం ఏదైనా చెప్పొచ్చు. నిజంగా ఈ petrol, diesel లేకపోతే పని నడవదానడుస్తుంది కానీ competition పెరిగిన ప్రపంచంలో ఎవడి ఉనికి వాడు నిలబెట్టు కోవడానికి  scooter,  ఇంకా status కూడా add అయితే car తప్పవు. ముందు వీటిని మనకి అమ్మితే వీటి ఇంధనం కోసం చచ్చినట్టు petrol, diesel కొనడమే. ఏ దేశమైతే resources control చేస్తుందో దానిదే పైచెయ్యి. కొన్ని మనకి అవసరం లేకపోయిన బలవంతంగా మన జీవితాలలోకి  ప్రవేశపెట్టబడతాయి. ఉదాహరణకి toothpaste, brush లేకపోతే పళ్ళు తోముకోలేమానా చిన్నప్పుడు మా తాతగారి ఊరిలో వేప పుల్లలులేదా ఉప్పు,కచ్చిక(కొబ్బరి డొక్కలు కాలిస్తే వచ్చేది) పెట్టి పళ్ళు తోముకునే వారు. అప్పుడూ పళ్ళు శుభ్రం గానే,ఇప్పటి కంటే గట్టిగానే ఉండేవి. ముందు status symbol గా అందరి జీవితాలలోకి ప్రవేశించిన ఈ toothpaste ఇప్పుడు నిత్యావసరం లోకి మారింది. ఇప్పుడు అది ఏ పల్లెటూరు అయిన brush, paste compulsory. మనం దినసరి అలవాట్ల లో వాడే (తినేవి కూడా కావచ్చు)చాలావాటిని  ముందు మనకి అలవాటు చేసితరువాత ధర పెంచడంఅవసరం లేని వస్తువుని ప్రవేశపెట్టి ,అవసరంగా మార్చడం అదో marketing strategy.  marketing గురించి మాట్లాడుకుంటే అదో మహాసముద్రం.   ఇప్పుడు  industrialization దెబ్బకి చెట్లు కూడా లేవు వేప పుల్లలు దొరకవు. రేపటి రోజున ఎవడో ఒకడు ప్రత్యేకించి విదేశీయుడు “nature in its original form –herbal cure for teeth and gums – Neem stick” అని వేపపుల్లని toothpaste కంటే ఎక్కువ rate కి అమ్మేసినా ఆశ్చర్యపోవఖ్ఖరలేదు.
             crude దెబ్బ అక్కడితో ఆగదు. దీనివల్ల LPG ధర పెరుగుతుందిరవాణా ఖర్చులు పెరుగుతాయినిత్యావసర వస్తువుల ధర పెరుగుతుందిచివరిగా మనం తినే తిండి ధర మనం భరించలేనంతగా పెరుగుతుంది. ఏదో విదేశీ ప్రయాణాలువిదేశాల్లో చదువులు అంటే మానేయొచ్చు కానీ తిండి మానడం కుదరదు కదా. ఇంతకు ముందు చరిత్రలో ఇలాటివి జరగలేదా అని question రావోచ్చు. నూటికి నూరు శాతం వచ్చి ఉంటాయి. కానీ చరిత్రలో అవి రాసుకోరు. ఒకవేళ రాసుకున్నా దాని గురించి మాట్లాడుకోరు. ఉదాహరణకి మన విజయనగర సామ్రాజ్యంలో అంగట్లో రత్నాలు అమ్మేవారుట. Persia నించి వచ్చిన ‘అబ్దుర్ రజాక్’  చెప్పాడు కాబట్టి కొంత నమ్మోచ్చు. కానీ నాకు చిన్నప్పుడు మా class teacher విజయనగర సామ్రాజ్యంలో ముత్యాలువజ్రాలు,రత్నాలు road పక్కన కుప్పలు పోసి అమ్మే వారని చెప్పింది. నేను చిన్నప్పుడు నోరు వెళ్లబెట్టాను. ఇలా కూడా ఉంటుందా అని. ఆవిడ కూడా ఏ ఉత్సాహంకల చరిత్రకారుడు చెప్పిన చరిత్ర విని ఉంటుంది.   ఆ తరువాత రాయల సామ్రాజ్య పతనంవిజయనగర దుస్థితిఅది ఎంత హీనదశ చూసిందిఎవడో రాసే ఉంటాడు కానీ మనకి అఖ్ఖరలేదు. ఎందుకంటే మొదటి విషయం ఇచ్చిన kick రెండో విషయం ఇవ్వదు. ఇందుకే మన రూపాయి విలువ దీని ఫలితంగా(status symbol పేరుతో మనకున్న వస్తువుల పై  మోజువల్ల) వచ్చిన inflation వల్ల పడిపోయింది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card