దైవ ప్రార్ధనలలో శృంగారం ఎందుకు మిళీతమైంది?
"కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే"
ఈ రసాత్మక శృంగార సుప్రభాతానికి అర్ధం, " ఓ
శ్రీనివాస ప్రభో! గత రాత్రి శృంగార రసవాహినిలో తమ ధర్మపత్ని శ్రీదేవి ని
కౌగిలిలో బంధించి ఆ సమ్మొహనములో పరవసించినది నీ వక్షస్థలం పై ఆ కుంకుమ
వర్ణం ముద్రలు పడ్డాయి. అవి ఆమె కమలాలవంటి కుచద్వయం నీ నీలి దేహం పై
కుంకుమ వర్ణం తో మీరు కౌగిలిలో బంధించిన విషయం స్పష్టమౌతుంది.
కమలములవంటి అక్షి ద్వయమున్న ఓ దేవా! మీకు విజయమగుగాక! “ అనేది ఆ సుప్రభాత శ్లోకానికి పరిపూర్ణ అర్ధం.
“కాటుక కంటినీరు, చనుకట్టు పయింబడ నేల ఏడ్చెదో
కైటభధైత్యమర్ధనుని గాదిలి కోడల! యోమదంబ! యో
హటక గర్భురాణి! నిను నా
కటికిం గొనిపోయి యెల్ల క
ర్ణాట కిరాత కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము
భారతి!”
అమ్మా! భారతీ దేవీ! కాటుక కంటినీరు జాలువారుతూ
వక్షద్వయం పై నున్న వస్త్రం రవికపైబడేలా ఎందులకు ఏడ్చావు తల్లీ! రాక్షసుడైన కైటభుని
చంపిన శ్రీమహవిషువు కోడలివైన నీకే కష్ఠమొచ్చిందని విలపిస్తావు! యో మహాదేవీ
ఈ సమస్థ
భువనాన్ని సృష్టించిన బ్రహ్మదేవుని ఇల్లాలివైన నిన్ను బయటకు తీసుకెళ్ళి ఆకర్ణాట కిరాత కీచకులైన
రాజులకు అమ్మనని వారికి అంకితము ఇవ్వనని మనసా, వాచా, కర్మణా ప్రమాణం చేస్తున్నాను తల్లీ!” అని అర్ధం.
సంస్కృత శ్లోక సాహిత్యం, తెలుగు పద్య సాహిత్యం, పురాణ
సాహిత్యం తెలుగు వారికున్నంత ఏ యితర భారతీయ భాషల వారికి లేదు. అయితే హిందువుల దైవ
ప్రార్ధనలలో శృంగారం ఎందుకు మిళీతమైంది? మహా విజ్ఞులు, భాషా వాజ్మయం లో విస్తృత పరిజ్ఞానమున్న పండితులందరూ
భక్తికి శృంగారాన్ని ఎందుకు మిళితం చేశారు? ఇదే ప్రశ్న ...సమాధానం కావాలి.
ప్రపంచములో ఏ జాతి జనుల దేవతలకైనా భార్యా బిడ్డలు
కుటుంబం ఉండరు. కాని హిందూ మతధర్మంలో ఇది కనిపిస్తుంది. రూపం, ఆకారం, గుణ
ఏదీలేదంటూ ఆదిమద్యాంత రహితుడూ, సర్వాంతర్యామి,
నిరామయుడని చెపుతూనే
ఆ దైవానికి ఇద్దరేసి భార్యలను అంతగట్టి విగ్రహాలను దేవాలయాలను నిర్మించి పూజలూ
పురస్కారాలు చేస్తూ
స్వర్ణాభరణాలతో అలంకరిస్తూ కళ్యాణాలు జరిపిస్తూ ఏకాంత సేవలూ చేస్తూ సంతొషపడటమంటే
ఆదైవానికి కూడా మానవ ధర్మములోని శృంగారాన్ని అన్వయిస్తున్నాం
కదా!
సుమారు 3000 సంవత్సరాల క్రితమే హరప్ప మొహోంజదారో
కాలములోనే శివాలయాలు నిర్మించాం. అందులో శివలింగం పురుషుని అవయవాన్ని
పోలి ఉంటుంది. పానవట్టం స్త్రీ అవయతత్వాన్ని పోలి ఉండి అసలు శివ స్వరూపమే
- ప్రకృతి పురుషుల మేలు కలయికగా భావిస్తూ దైవమే భక్తి శృంగార స్వరూపం
సృష్టి అంతా శృంగార స్వరూపంగా చెప్పుకుంటున్నాం. చతుర్విధ పురుషార్ధాలైన
ధర్మ-అర్థ-కామ-మోక్షా లలో కామం తరవాతనే మోక్షానికి స్థానమిచ్చం. "కామి గాని వాడు
మోక్ష గామి కాడు" అంటూ కామం (శృంగారం) ప్రాముఖ్యతను పెంచేశాం. శేంగార
జీవనాన్ని వడలి అందరూ సన్యాసాన్ని స్వీకరిస్తే సృష్టి నిలిచిపోతుంది.
అందుకే జీవన ధర్మం పాటించేటట్లు జీవనాన్ని నిర్దేశించారు.
దైవ చింతనలో పడి పోయి కాలం గడిపివేస్తే
ఆహారం ఎలాలభిస్తుంది? సంసార ధర్మం పాటించకపోతే (శృంగారం లేకపోతే) సంతానం
లేక సృష్టి కార్యం ఆగి సృష్టి కర్త (బ్రహ్మ) కు పనిలేకుండా పోతుంది. అందుకే
ధర్మ, అర్ధాలో
కామాన్ని కలిగి ఉంటేనే మానవ జీవితం మోక్షం పొందుతుంది.తన ధర్మ పత్నితో కలసి ఉండే ధర్మం కామం
అంటే శృంగారం. అన్య కాంతలతో జరిపే అధర్మ కామం వ్యభిచారం. అందుకే అనాదికాలములో
బహుభార్యాత్వాన్ని, కొన్ని సందర్బాల్లో బహుభతృత్వాన్ని సంఘం సమాజం
అనుమతించాయి. మానవాభివృద్ది ఇంత జరగటానికి మూలం కామం కోరికలే. కామమే లేకపోతే
సృష్టే ఉండదు. వీటిపరమావధి సుఖమే. అందుకే అమలిన శృంగారం ఒక రకంగా పవిత్ర కార్యమే.
ఈ స్వామీజీల పుణ్యమా అని రోజంతా వేదాంత
చర్చలు వైరాగ్య ప్రవచనాలు ప్రయోజనాలనివ్వవు. అందుకే భక్తి
కార్యక్రమాలనుండి యువతకు మార్గనిర్దేశం చేసే టందుకే శృంగారాన్ని దైవకార్యాల్లో, దైవపఠనాల్లో
సుగర్ కోటెడ్ (తీయనైన శృంగారాన్ని పైపూతగా దైవ పఠనాల్లో) పూశారు అంటే
శృంగారం తరవాతే భక్తి. జీవన అక్రమాన్ని రక్తి (శృంగారం), భక్తి (దైవ కార్యములో నిమగ్నం), ముక్తి
(దైవములో కలిసిపోవటం) అన్నారు. అంటే రక్తి తరవాతే ముక్తి. శృంగారం ప్రధానంగా
సాగే భక్తి గీతాలే అన్నమాచార్య కీర్తనలు, జయదేవుని అష్ఠపదులు, క్షేత్రయ్య
పదాలు ఇవన్నీ శృంగార సమ్మిళితాలే. దేవుళ్ళకు భారయలున్నప్పుడు
భక్తిలో శృంగారం
తప్పుగాదు కదా!
చాలామంది హిందూ భక్తి సాహిత్యమంతా శృంగారమయమే
కదా! అంటారు. ఇక్కడ మన మనసును దైవం వైపు మరల్చటానికి 10% మాత్రమే
వాడారు. మిగిలిన 90% వైరాగ్యమే. అందుకే హిందూ తత్వం
ఒక జీవన విధానమే కాని మతం కాదు అంటారు. ఎవరైనా అలా భావిస్తే అది వారి ధృష్టి
దోషమే కాని, సృష్టి దోషం కాదు. కూరలో కరివేప రుచి కోసమే, తినటం
మొదలెట్టాక కరివేపాకును పక్కన పెడతాం. ఆదైవ సన్నిధిలో శృంగారం
ప్రవేశం (ఎంట్రి) మాత్రమే. లోపలంతా వైరాగ్య వైభోగమే.
శృంగార రహిత జీవితంతో విశ్వం జీవ రహితమౌతుంది.
జీవుల సృష్టికి తొలిమెట్టు శృంగారమే. అది ప్రతి ప్రాణికి జన్మ
హక్కు. అమలిన శృంగారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజూ శృంగారంలో క్రమ పద్దతిలో
పాల్గొంటే ఈ యోగాలు, వ్యాయామాల అవసరమే ఉండదు. అనైతిక శృంగార ఫలితమే అతి
ప్రమాదకర హెచైవి లాంటి రోగాలకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయటం మనం
చూస్తూనే ఉన్నాం. అమలిన శృంగారం అత్యావస్యకం, దైవత్మం ఉన్న పవిత్రకార్యమే.
No comments:
Post a Comment