ఒక రాష్ట్ర ఉన్నతాధికారులు పదవిలో ఉండగా రాష్ట్రప్రభుత్వలో జరిగే అవినీతి, బందుప్రీతి, కులజాడ్యం, ప్రాంతీయ పక్షపాతం ప్రొజెక్టులలో జరిగే అవినీతి తప్పిదాలపై మాట్లాడలేరు. అది న్యాయం కూడా కాదు. అది ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి నియంత్రణ చట్టాల క్రిందా, విధివిధానాల పరంగా కూడా సాధ్యం కాదు. అందుకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ప్రభుత్వ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేయలేకపొయ్యారు. అయితే ప్రభుత్వ జాతి వ్యతిరెఖ పోకడలు, అవినీతి, బందుప్రీతి, చీకటి వ్యాపారాలు, రకరకాల రాజకీయాలు వారికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదు. అందుకే పదవీ విరమణ తరవాత మాత్రమే వారు సరిగ్గా స్పందిస్థారు
ఆంధ్రప్రదేశ్ లో మితి మీరుతున్న అవినీతిపై మరో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్ )అజేయ కల్లం తన గళం విప్పారు. రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకు పోయిందని, సాగు నీటి ప్రాజెక్టులు తదితరాల పేరుతో అవినీతి విశృంఖలంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. అపూర్వ విశ్వనగరం అమరావతి రాజధాని నగరం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం;రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తోందని ఐవైఆర్ కృష్ణారావు తప్పు పట్టారు. అధికార కేంద్రీకరణ తప్పుడు విధానమని, కాస్మో బృహ మెగా నగరాల ఆలోచనే అసంబద్ధమని, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి తప్ప ప్రజలకు ఏవిధం గానూ ఉపయోగం కాదని కుండ బద్దలు కొట్టారు
70 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్న రాష్ట్రాల్లో మహనగరాల అవసరం లేదు. నాయకుల పేరు ప్రతిష్ట ల కోసం వారిని ప్రజలు ఎన్నుకోలేదు. ప్రజలకు విద్య ఆరోగ్యం ఉచితంగా అందించే ప్రభుత్వాలు చాలు. మిగిలిందంతా ప్రయివేట్ పరం చేసి కఠిన చట్టాల ద్వారా ప్రభుత్వ ప్రయివేట్ వ్యవస్థలను నియంత్రించే పాలన అవసరమని గుర్తించాలి
ప్రభుత్వం మొత్తం ఒకే చోట కేంద్రీకృతం ఎందుకు కావాలి, ఒకే నగరంలోనే అన్నీ ఎందుకు ఉండాలి, ఇవే ఆతరవాత రాష్ట్ర విభజనలకు ఊపిరిపోస్తాయనేది నేటి ఎపి ముఖ్యమంత్రికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకం.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment