Thursday, April 26, 2018

మెగా మహా నగరాలు, గ్రేటర్నగరాల నిర్మాణ వల్ల సామాన్యులకి ఉపయోగమేనా?





బృహన్నగరాల (మహా పట్టణాలు )వల్ల ప్రజలకు సర్వ విధ భారం తప్ప ప్రయోజనం ఉండదు
అనుభవజ్ఞులు మహానగరాలను కట్టరు. అక్కడ రవాణా వ్యయం, నీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, ఇంటి అద్దెలు తడిసి మోపెడై జీవన వ్యయం పెరిగి ప్రజలకు జీవితమే సమస్యగా తయారౌతుంది
              పెద్ద నగరాల్లో ఏముంటుంది? నేరాలు, వ్యభిచారం, చెడు అలవాట్లు పెరుగుతాయి. ప్రజలకు మనశ్శాంతి ఉండదు. అందువల్ల ప్రజలకు కావాల్సింది “గ్రామ స్వరాజ్యం”మాత్రమె నని ‘జాతి పిత మహాత్మా గాంధీ’ ఆనాడే చెప్పారు. స్వయం సమృద్ధి, స్వయంపాలన గల చిన్న ప్రాంతాలను టౌన్షిప్స్ గా మౌలిక సదుపాయాలు అన్ని పకడ్బంధీగా అభివృద్ధి చేస్తేనే ప్రజలకు అన్నీ వనరులు చౌకగా అందుబాటు లోకి వస్తాయి
           నగరాల పరిమాణం పెరిగే కొద్దీ ప్రజలు నివసించడానికి ఉపయోగపడేలా ఉండవని జర్మనీ తో పాటు పలు దేశాలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. నగరాలు పెద్దవయ్యే కొద్దీ అన్ని రకాల ఖర్చులూ పెరుగుతాయని జర్మనీలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది
            పెద్ద నగరాలుంటేనే పెద్ద పెద్ద సంస్థలు వస్తాయని ప్రజలను భ్రమల్లో ముంచడం తెలివి తక్కువ ఆలోచన. ‘మైక్రోసాఫ్ట్ ‘ప్రధాన కేంద్రం ఎక్కడుంది? లాస్ఏంజెలెస్, షికాగో, న్యూయార్క్’ లాంటి నగరాల్లో లేదు కదా? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (యూఎస్ ఏ) మారుమూల ప్రాంతమైన ‘రెడ్ మాండ్ ‘లో ‘మైక్రోసాఫ్ట్’ ప్రధాన కేంద్రం ఉంది
ఎంత పెద్ద సంస్థైనా ప్రశాంత వాతావరణం కోరుకుంటాయి. మన బెంగళూర్ ,హైదరాబాదు(సైబరాబాద్) లో గంటకు ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలం. దాంతో సగం జీవితం ఉద్యొగానికి మిగతా సగం రవాణాకి సరిపోతుంది. ఇక నగర జీవికి బ్రతుకెక్కడ
‘వారెన్ బఫెట్’ అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని  ‘ఒమాహా’ అనే మారు మూల గ్రామీణ ప్రాంతం నుంచే నడుపుతున్నారు. పెద్ద నగరాలు కట్టడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకే మేలు జరుగుతుంది. స్థిరాస్తి ధరలను పెంచి భారీగా ఆర్జిస్తారు. మరి ఎందుకోసం అంతర్జాతీయ స్థాయి నగరాలు ?

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card