ఒకడిచ్చేదాని
కోసం మనం అరిచిగీ పెట్టడమేంటి? అదేం ఆత్మాభిమానం?
తెలుగోడిలో సత్తా ఉంది.
తన కాళ్ళ మీద తాను నిలబడగలడు. నలుగుర్నీ నిలబెట్టగలడు అని అందరూ అనుకుంటే అదీ
ఆత్మాభిమానం. ఎమీ లేకపోయినా వీడు పైకొచ్చాడురా అంటే అదీ అసలైన గౌరవం.
భావోద్వేగాలతో ఆవేశపడిపోయి అడుక్కుంటారో లేక ఆ ఆవేశాన్ని ఆలోచింపచేసి ముందడుగేస్తారో
ఇక మీ ఇష్టం.
ప్రభుత్వ పాలనలో
ఎన్నో లొసుగులున్నాయ్, వాటి గురించి
వీళ్ళు ఎందుకు ఎక్కువగా మాట్లాడరు? వాల్లకి
కావలిసినవి ఓట్లు మాత్రమే, యువత దృష్టి
ఇప్పుడు ఇటువైపు వెంటనే మరులుతుంది కాబట్టి దీనిని ఆసరాగా తీసుకుని, యువకులను ఉద్యమం పేరుతో బలిపశువలను చేసి
రాజకీయంగా లాభపడాలన్నదే వారి అభిమతమై ఉండవచ్చు.
అయినా ఉద్యోగాల
కోసం కార్పోరేటు వాల్లను మనం పిలవటమేంది. మనం ఉద్యోగాలను సృష్టించుకోలేమా? ఒకవైపు దేశంలో యువత స్టార్టప్పులని, బిజినెస్ లని ముందుకు దూసుకుపోతుంటే, ఎవడో వచ్చి మనకి ఉద్యోగమివ్వటమేంటి? ఒక మంచి ఆవిష్కరణ కొన్ని వందల ఉద్యోగాలు
సృష్టించగలదు, ఒక కొత్త ఉపాయం
అనేక సమస్యలను దూరం చేయగలదు. అటువంటి ఆవిష్కరణలు తెలుగు యువత చేయాలి. మనకు మనమే
కొత్త ఉపాధులను సృష్టించుకోవాలి.
------------ ధరణికోట సురేష్
కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment