Monday, April 23, 2018

కొత్త ఫారాలతో పన్ను ఎగవేసి తప్పించుకోలేరు


కొత్త ఫారాలతో పన్ను ఎగవేసి తప్పించుకోలేరు మరింత కచ్చితత్వం, రిటర్నుల దాఖలును పెంచేందుకు రెవెన్యూ అధికారులు పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మదింపు చేయడానికి డిజిటల్ సమాచారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పన్ను ఎగవేతలను నిరోధించడంతో పాటు, సమాచార మదింపు కోసం ప్రభుత్వ వర్గాలు ఇ-అసెస్మెంట్ల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు
అలాగే వేతనం, ఇంటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలపాల్సి ఉంటుంది. గతంలో ఈ నిబంధన లేదు. వేతన రూపంలో వచ్చే ఆదాయ వివరాలు అంటే పన్ను మినహాయింపులు, పెర్క్విజిట్లు, వృత్తి పన్నుపై పొందిన మినహాయింపుల వివరాలు కూడా ఇవ్వాలి. అలాగే ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయం వివరాలు అంటే స్థూల అద్దె ఆదాయం వివరాలు, స్థిరాస్తి పై చెల్లించిన పన్ను, చెల్లించిన వడ్డీ వివరాలు లాంటివి తెలపాలి. దీని వల్ల పన్ను చెల్లింపుదారుల ఆదాయ వనరులపై స్పష్టత వస్తుందని పన్ను అధికారులు భావిస్తున్నారు
ఆర్థిక చట్టం-2017 లో కొత్తగా చేర్చిన నిబంధన ప్రకారం, సెక్షన్ 56(2)(x) పరిధిలో నిర్ధేశించిన సందర్భాలలో తీసుకున్న డబ్బు కానీ ఆస్తి కానీ రూ.50 వేలు మించినట్లయితే ఆ వివరాలను తప్పకుండ ఐటీఆర్-2 లో తెలియజేయాలి
జులై 31 గడువు లోపు పన్ను రిటర్నులు దాఖలు చేయనివారు రూ.5 వేలు జరిమానా కట్టాలి. అలాగే డిసెంబర్ 31 లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇలా జరిమానాలు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు సమయానికి రిటర్నులు దాఖలు చేయడం మంచిది
ఇంటి అద్దె ద్వారా ఆదాయం పొందేవారు అద్దెకుండే వారి పాన్ నెంబర్(ఉంటే)ని తెలపాలి. 2016-17 వరకు ఇది ఐచ్ఛికంగా ఉండేది. అలాగే ఇంటి అద్దె భ్యతం(హెచ్ఆర్ఏ)ని క్లెయిం చేసుకునేవారు తప్పకుండా ఇంటి యజమాని పాన్ నెంబర్ని తెలపాలి
రూ.50 వేల కంటే ఎక్కువ అద్దె చెల్లించే వారు అద్దె నుంచి మూలం వద్ద పన్ను(టీడీఎస్) తీసివేస్తున్న విషయం తెలిసిందే. అలాగే టీడీఎస్ కోసం ఇంటి యజమానులు కూడా అద్దెకుండే వారి పాన్ నెంబర్ సమాచారాన్ని ఈ కొత్త ఫారాలలో తెలియజేయాలి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card