సాంకేతిక పరిజ్ఞానం వృత్తిపరంగా, సామాజిక ంగా బాగానే ఉపయోగపడుతోంది. కానీ, ఈ ప్రవాహంలో ఆరోగ్యం ఏమైపోతోందన్నదే పెద్ద విషయం. ప్రత్యేకించి రోజంతా కంప్యూటర్లతో పనిచేసే వారి పరిస్థితి కొంత తీవ్రంగానే ఉంది. కళ్లయితే సివిఎస్ (కంప్యూటర్ విజన్ సిండ్రోమ్) బారిన పడుతున్నాయి. పగలంతా కంప్యూటర్‌ల ముందు కూర్చుని ఉండిపోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాఽధుల పాలవుతామనేది పరిశోధనల్లో పలుమార్లు రుజువవుతూనే ఉంది. కానీ, ఇలా కంప్యూటర్ల మీద పనిచేసే దాదాపు 70 శాతం మంది నేడు సివిఎస్ బారిన పడుతున్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈ సమస్యలకు అతీతంగా ఎలా ఉండాలో ఎవరికి వారు విధిగా ఆలోచించాల్సిందే. ఈ రోజుల్లో పనిచేసే వేళల్లో ఎక్కువ గ ంటలు కంప్యూటర్ స్ర్కీన్ ముందే గడిచిపోతున్నాయి. ఉదయం ఇంటి వద్ద ఇ-మేల్ చెక్ చేసుకోవడంతో గడిపేస్తే, ఆఫీసులో 9 నుంచి 5 దాకా ఉండిపోతున్నాం. సాయంత్రం కాగానే టీవీ దగ్గరో, కంప్యూటర్ గేమ్స్‌తోనో గడిపేస్తున్నాం. అంతిమంగా మొబైల్ ఫోన్ వాడేసి ఆ తర్వాత నిద్రలోకి జారిపోతున్నాం.
‘‘సహజంగా అయితే నిమిషానికి దాదాపు 20 సార్లు మన కళ్లు కొట్టుకుంటూ ఉంటాయి. కానీ, కంప్యూటర్ మీద పనిచేసే సమయంలో నిమిషానికి 4 నుంచి 7 సార్లే కళ్లు కొట్టుకుంటాయి. ఈ కంటిరెప్పలు కొట్టుకోవడం అనేది కంప్యూటర్ వినయోగం కారణంగా ఎంత తగ్గిపోయిందో అంచనా వేయవచ్చు. దీనివల్ల కళ్లు ఎండిపోవడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి’’ అంటున్నాడు లండన్ విజన్ క్లినిక్‌కు చెందిన ప్రొఫెసర్ డాన్ రీన్‌స్టీన్. వీటికి తోడు కళ్లు ఎరుపెక్కడం, అలిసిపోవడం, తలనొప్పి, ఒక వస్తువు రెండుగా కనిపించడం, దేనిమీద దృష్టి నిలుపలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ సమస్యలకు విరుగుడుగా రీన్‌స్టీన్ చెప్పిన సలహాలు ఇలా ఉన్నాయి.
ప్రతి గంటకొకసారైనా కంప్యూటర్ ముందు నుంచి లేచి కాస్త దూరంగా వెళ్లాలి,.
కంప్యూటర్ స్ర్కీన్ ఎల్లవేళలా శుభ్రంగా ఉంచాలి.
ఎక్కువసార్లు కంటి రెప్పలు కొట్టుకునే స్పృహ తో ఉండాలి.
కంప్యూటర్‌ను తగినంత ఎత్తులో, దూరంలో ఉంచాలి...! లేదంటే మెడ కండరాల మీద దాని దుష్ప్రభావ ం ఉంటుంది.
ఎయిర్ కండిషన్లు, ఫ్యాన్‌లు కళ్లు మరింత ఎండిపోయేలా చేస్తాయి. అందుకే వాటి ప్రభావం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

No comments:
Post a Comment