Tuesday, October 21, 2014

మన సంపూర్ణ ఆహారం ఏది?

ఆహారంలో ఉండే స్థూలమైన భాగం ఈ శరీరాన్ని నిర్మిస్తే, సూక్ష్మమైన అంశం మన మనస్సుగా రూపొందుతుందని పెద్దలు ఏనాడో చెప్పారు. మనం సంపూర్ణ ఆహారం తింటే ఇవి రెండూ సంపూర్ణంగా తయారవుతాయి. మట్టి మంచిదైతే కుండ గట్టిగా ఉంటుంది. మనం సంపూర్ణ ఆయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే మనం సంపూర్ణ ఆహారాన్నే ఈ శరీరానికి అందించాలి. ఏ రంగు ఇంకు పెన్నులో పోస్తామో ఆ రంగు రాతే బయట కనబడుతుంది. మన బతుకు కూడా ఇంతే. ఈ సత్యాన్ని గ్రహిస్తే విషయం సులభమవుతుంది. లేదా ఆరోగ్యమనేది జీవితంలో అర్థం కాదు. ఈ ప్రకృతిలో భూమిపై జీవించే జీవరాశుల్లో ఎక్కువ భాగం తినే ఆహార పదార్థాలను ముఖ్యంగా ఆరు జాతులుగా విభజించవచ్చు. అవి ఆకుజాతి, కూరగాయల జాతి, దుంపజాతి, పండ్ల జాతి, గింజ జాతి, మాంస జాతి మొదలగునవి. ఏదన్నా ఒక జాతి జంతువులు సామాన్యంగా ఒకే జాతి ఆహారాన్ని జీవిత కాలమంతా తిని జీవిస్తూ ఉంటాయి.
ఉదాహరణకు మేకల ఆహారం ఏమిటని అడిగితే అందరూ ఆకులని చెబుతారు. పులి ఆహారం అంటే మాసం అని, చిలుక ఆహారం అంటే పండ్లని, పావురాయిల ఆహారం అంటే గింజలని ఇలా అందరూ ఒకే సమాధానం చెబుతారు. ఆ జీవులన్నీ ఈ ప్రకృతిలో తమ కోసం తయారైన జాతి ఆహారాన్ని తిని మిగతా జాతి ఆహారాన్ని ముట్టను కూడా ముట్టవు. ఉదాహరణకు మేకలు చెట్టుకుండే ఆకులను తిని కాయలు గానీ, పండ్లు గానీ, వాటి గింజలు గానీ కనిపించినా వదిలేస్తాయి. దాని అవసరం ఆకుల ద్వారా తీరాక ఇంకా మిగతా వాటితో పనేముందని మేకకు బాగా తెలుసు. ఇక మన విషయానికొద్దాం. మనిషి ఆహారం ఏదీ అంటే అందరూ నవ్వుకుంటారే తప్ప సమాధానం చెప్పరు. అన్ని జంతువుల విషయంలో వెంటనే సమాధానం వచ్చింది కానీ మన ఆహారం గురించి అడిగితే మనకే తెలియడం లేదు. ఆ జంతువులు ఏమి తింటే మనకెందుకు మనమేది తినాలో మనకు తెలియాలి గానీ, ఆలోచించి చివరకు మనిషి చెప్పే సమాధానం, ఆ ఆరు జాతులు మనవేనని. కనపడ్డ ప్రతిదీ మనదే. ఒక జాతి అనే విచక్షణ మానవజాతికి లేదు. నానాజాతి సమితి లాగా. అన్నింటిలని కలబోసి కూరడం తెలిసింది. అందుకే నానా జాతి రోగాలన్నీ కలిపి ఒక్క మానవ శరీరాన్నే ఎన్నుకుంటున్నాయి. మానవుడు అన్ని జీవుల కంటే గొప్ప జీవి, కాబట్టి అన్ని జాతుల ఆహారాల్లో గొప్ప ఆహారమేదో తెలుసుకొని దాన్నే తినగలిగితే మంచిది. ఆ గొప్ప జాతి ఏదో తెలుసుకుందాం.

సకల పోషకాలున్న ఆహారం 

సంపూర్ణ ఆహారం అంటే సకల పోషక పదార్థాలున్న ఆహారం అని అర్థం. అన్నీ కలిపి ఒకే దానిలో దొరికే సూపర్‌ మార్కెట్‌ లాగా సూపర్‌ ఆహారాన్ని, ఆ ఒక్కదాన్నే తిన్నా మనకు అన్నీ అందుతాయి. మనకు అప్పుడు, అది చాలింది, ఇది చాల్లేదు ఇది ఉంది, అది లేదు అని గొడవ ఉండదు. శరీరానికి ముఖ్యంగా ఏడు రకాల పోషక పదార్థాలు ప్రతిరోజూ అవసరం. అవి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటిమిన్‌లు, మినరల్స్‌, ఎంజైమ్స్‌, పీచు పదార్థాలు ఈ ఏడు పోషక పదార్థాలు ఏ జాతి ఆహారంలో ఉంటాయో అది సంపూర్ణాహారం. కూరగాయల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు సరిగా ఉండవు. మిగతావి ఐదు బాగానే ఉంటాయి. పండ్లలో కూడా ఇంతే. దుంపలలో అయితే ఒక్క పిండి పదార్థాలే ఎక్కువ తప్ప మిగతావి సరిగా ఉండవు. ఆకులలో అయితే కొవ్వు పదార్థాలు తప్ప మిగతావి సరిగా ఉండవు.
మాంసాహారం అయితే, అది అన్నింటికంటే నీచమైన జాతి. మానవజాతి ముట్టకూడని జాతి. అందుకే మన పెద్దలు దానికి నీచు అని పేరు పెట్టారు. గింజలలో అయితే శరీరానికి కావాల్సిన ఏడు పోషక పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా కావాల్సిన అన్ని రకాల మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. మాంసకృత్తుల వల్ల శరీరానికి కండపుష్ఠి, కొవ్వు పదార్థాల వల్ల మేధాశక్తి, ఆయుష్షు లభిస్తూ ఉంటాయి. గింజజాతి ఆహారాన్ని సంపూర్ణ ఆహార జాతి అని చెప్పవచ్చు. ఈ రహస్యం మనకు తెలియడం లేదు గానీ మన పూర్వీకులకు ఏనాడో తెలిసింది. అందుచేతనే, దేవుడి ప్రసాదాల్లో గింజలను (వడపప్పు, కొబ్బరి) పెట్టారు. ఈ రూపంలోనైనా గింజలను తింటే బాగుపడతారని. పేరంటాలలో పెసలు, శెనగలు, నువ్వుల చిమిలి, పెళ్లిళ్లు, కర్మకాండల్లో నవధాన్యాలు మొదలగునవి పెట్టి మన చేత తినిపించారు. కోడిపుంజులు, ఎడ్లకు పందాలకు ముందు గింజలనే పెడతారు.
మేధాశక్తి విషయానికొస్తే, బ్రాహ్మణులకు ఉన్న తెలివితేటలు, మేధాశక్తి ఇతర కులస్థులకు ఉండక పోవడం అందరూ గమనించే ఉంటారు. వారు ముఖ్యంగా వెనుకటి రోజుల్లో నవ ధాన్యాలను బాగా తిని, ఆ రకమైన పవర్‌ను పెంచుకున్నారు. మనం కూడా ఇకనుంచి ఆ గింజలను రోజులో ఒకసారి తిన్నా శరీర అవసరాలన్నీ తీరుతాయి. కాబట్టి తినే ప్రయత్నం చేద్దాం. గింజలను తినమన్నామని సపోటా గింజలను, సీతాఫలం గింజలను కూడా తినకండి. ఏ గింజలను తినాలో ఎలా తినాలో వివరంగా తెలుసుకుందాం,తినడం ప్రారంద్దాం

No comments:

Post a Comment

Address for Communication

Address card