ఖాతాదారులకు
జరిగే అన్యాయాలను అడ్డుకునేందుకు, బ్యాంకు సేవగా రిజర్వ్ బ్యాంక ఆఫ్
ఇండియా అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇది
ప్రారంభమై నాలుగేళ్ళు దాటినా, కస్టమర్లకు అవగాహన మాత్రం పెరగలేదు. ఏదైనా
సేవా లోపం జరిగి ఖాతాదారుల ఫిర్యాదులను బ్యాంకు అధికారులు
పట్టించుకొనట్టయితే ఈ కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ ఆ ఫిర్యాదులను
విచారించి బ్యాంకులపై చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగదారుడికి జరిగిన
అన్యాయంపై తగు ప్రతిఫలం కూడా లభిస్తుంది.
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కేంద్రాలకు వెళ్ళేముందు గమనిం చవలసిన
కొన్ని విషయాలు ఉన్నాయి. ఎటువంటి ఫిర్యాదులను అంబుడ్స్‌మన్
స్వీకరిస్తుంది ఎవరెవరిపై ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు చేసే విధానమేంటి
తదితర విషయాలను తెలుసుకుందాం.
ఏ విషయమైనా సరే బ్యాంకులు సరిగ్గా
స్పందించకున్నా, చెల్లింపుల్లో ఆలస్యం జరిగి ఖాతాదారుడికి నష్టం కలిగినా,
చెక్కు కలెక్షన్స్, డ్రాఫ్ట్స్ , బిల్స్ తదితరాల్లో వచ్చే సమస్యలపై,
ఆఖరికి చిన్న డినామినేషన్ నోట్లు (ఒకటి, ఐదు, 10 రూపాయల నోట్లు, నాణేలు)
స్వీకరించడానికి నిరాకరించినా ఫిర్యాదు చేయవచ్చు. పనివేళల్లో బ్యాంకుల్లో
సేవలందకపోయినా, ముందుగా చెప్పకుండా చార్జ్‌లను కస్టమర్లపై వేసినా, రావలసిన
వడ్డీని కలపకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. అకౌంట్‌ను ప్రారంభించడానికిగానీ,
ముగించడానికి గానీ బ్యాంక సరిగా స్పందించకపోయినా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు
చేయవచ్చు. ముందుగా తెలియ జేయకుండా లేక సరైన కారణం లేకుండా అకౌంట్‌ను
ముగిస్తే ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుల ద్వారా లేక బ్యాంకు ప్రతినిధుల
ద్వారా ఏ విధమైన నష్టం కలిగినా ఫిర్యాదు చేయవచ్చు.
అన్ని జాతీయ, ప్రైవేటు, ప్రైమరీ కో
ఆపరేటివ్, రీజనల్ రూరల్ బ్యాంకులన్నింటిపై ఫిర్యాదులను పంపించవచ్చు.
ఫిర్యాదు చేయదలచుకున్న బ్యాంకు బ్రాంచ్‌ని వివరంగా తెలుపుతూ, అక్కడి
అధికారి పేరును ప్రస్తావిస్తూ సమస్యను వివరించవచ్చు. బ్యాంకు శాఖల వివరాలు,
అక్కడి అధికార్ల వివరాలు దాదాపు ప్రతి బ్యాంకు ఆధికారిక వెబ్‌సైట్‌లో
పొందుపరచబడి వున్నాయి.వివిధ రీజియన్లలో బ్యాంకింగ్ అంబుడ్‌మన్స్ స్థానిక
కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటి వివరాలను ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్
ని చూసి తెలుసుకోవచ్చు.బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు పంపే ఫిర్యాదుల్లో
ఫిర్యాది చిరునామా తప్పనిసరి. అదే విధంగా అంబుడ్స్‌మన్‌కు అందే ఫిర్యాదు
ముందుగా బ్యాంకుకు పంపాలి. బ్యాంకు 30 రోజుల్లోపై సరిగా స్పందించకపోయినా,
లేదా బ్యాంకు స్పందన సంతృప్తి కరంగా లేదని అనిపించినా అంబుడ్స్‌మన్‌కు
తెలియ పరచవచ్చు. ఈ ఫిర్యాదుల కోసం ఆర్‌బిఐ ఒక ఫార్మాట్‌ను సిద్ధం చేసింది. ఈ
ఫార్మాట్‌ను కూడా ఆర్‌బిఐ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. ఈ ఫార్మాట్‌లో
కాకుండా మరే విధంగా ఫిర్యాదును పంపినా దాన్ని తిరస్కరించే అధికారం
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు వుంది. కస్టమర్‌కు కలిగిన నష్టంపై సాక్ష్యాలు,
బ్యాంకుకు ఫిర్యాదు అందినట్టు ఎకనాలడ్జ్‌మెంట్ కాపీ, పర్సనల్ వివరాలతో
ఫిర్యాదు చేయాలి. అదే క్రెడిట్ కార్డులపై ఫిర్యాదులైతే అధికంగా బిల్లులు
వచ్చినా, డబ్బును నష్టపోయినా, బ్యాంకు అధికారుల ప్రవర్తన సరిగా లేకున్నా,
మానసికంగా వేధించినా, ఆఖరికి సమయం కోల్పోయినా న్యాయం చేయాలని
అంబుడ్స్‌మన్‌ను కోరవచ్చు. అయితే, ఈ ఫిర్యాదులను గరిష్టంగా ఒక సంవత్సరంలోపు
అందించాలి. మొదట ఇచ్చిన కంప్లైంట్‌కు బ్యాంకు స్పందన సరిగా లేదని
అంబుడ్స్‌మన్ భావిస్తే తగు చర్యలు తీసుకుంటుంది. వాదోపవాదాల కోసం
అంబుడ్స్‌మన్ తరపున బ్యాంకుకు, కస్టమర్‌కు మధ్య ఒక మధ్యవర్తి వుంటారు.
వాదోపవాదాలను బట్టి ఫిర్యాదును కొట్టి వేయడం కానీ, లేక నష్టపరిహారం కోసం
గానీ అంబుడ్స్‌మన్ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలను బ్యాంకులు 15 నుంచి
30 రోజుల్లోపై పాటించి తీరాలి.ఒకవేళ అంబుడ్స్‌మన్ ఒకసారి ఫిర్యాదును
కొట్టివేస్తే మళ్ళీ అదే ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. అయితే, ఈ విషయంలో
జడ్జిమెంట్ కాపీ అందిన 45 రోజుల్లోగా అప్పిలేట్ అథారిటీకి వెళ్ళే సదుపాయం
ఖాతాదారులకు వుంటుంది. అక్కడ కేసును మళ్ళీ తిరిగి విచారిస్తారు
http://www.rbi.org.in/scripts/ bs_viewcontent.aspx?Id=164# అనే
లింక్‌పై క్లిక్‌చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా దిగువ పేర్కొన్న
చిరునామా, టెలిఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. Reserve Bank of India,
6-1-56, Secretariat Road, Saifabad, Hyderabad. 500 004.
Tel.No. 23210013/ 23243970
Fax No. 04023210014
Fax No. 04023210014
No comments:
Post a Comment