Tuesday, April 16, 2019

‘దోచుకోవటం’ మాగ్రామ శివుని కళ్యాణ సేవల్లో ఒక సేవ ( ఆచారం)...మీరు విన్నారా?




నాకు తెలిసినతవరకు  ప్రపంచంలో మరెక్కడా లేని ఒక ,వింత ఆచారం మా గ్రామం లోవుంది అది ఏమిటంటే “దోపుసేవ”
మావూరు  అంటే  గుంటూరు జిల్లాలో పొన్నూరు మండలంలోని వల్లభరావుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా శ్యామలాంబ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం లోని ఒక ఘట్టం
కళ్యాణం జరిగిన మరునాడు రధోత్సవం- తర్వాత రోజు ధ్వజావరోహణం( గరటుగుడ్డ దించి ఉత్సవాలు ముగింపు) -
సరిగ్గా ఆరోజునే “దోపుసేవ” అంటే దొంగల దోపిడీ-5రోజుల తిరణాల తర్వాత ఇది ఆరవ రోజు జరుగుతుంది
                 ఇప్పటి తరానికి పెద్దగా తెలీక పోవచ్చుగానీ మాకు మా ముందు తరాలకి అదొక అద్భుతమైన  ఉత్సాహభరితమైనది కార్యక్రమం
.తిరణాల మొత్తంలో  ఆతృతగా ఎదురు చూసే  కార్యక్రమాలలో ఇది కూడా ఒకటి
శ్రీ గంగా శ్యామలాంబ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి దేవస్థానం ముఖద్వారం

                  ఆరోజు రాత్రి ఎవరు ఎక్కడ ఎ ఇంట్లో అవకాశం వుంటే ఆ యింట్లో  దొంగతనం చేసుకోవచ్చు.....నిజం....కాకపొతే .దోచిన వస్తువులు ఎవరూ తీసుకెళ్లకూడదు    మరుసటిరోజు  వారు కాస్త కంగారు పడి తర్వాత  వెతుక్కుంటే  దొరికేలా ఎక్కడో ఒక చోట దాచి వెళ్ళాలి (కనీసం ఎవరోఒకరికి కనపడేవిధంగా ) తెల్లావారినాక వారి వారి వస్తువులు వారికి జేరేటట్లుగా ఆచూకి వదలాలి’
ఆ ఆచారం ఇప్పటికీ వుంది... కానీ.... దొంగలే లేరు.(ఒక వేళ...జరుగుతున్నదేమో నాకు తెలీదు).
శ్రీ గంగా శ్యామలాంబ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి దేవస్థానం
                  ఈ ఆచారం వెనుక కధ ఏమిటంటే   కవి సార్వభౌముడు   శ్రీనాధుని-“ హరవిలాసం” చదివితే అర్ధమవుతుంది ముఖ్యంగా 5 వ ఆశ్వాసం లో   శివపార్వతుల విరహం ఈ భాగంలో వుంటుంది -లింగోద్భవ ఘట్టానికి (శివునికి ప్రతిరూపంగా ‘లింగం’ ఎలా వచ్చింది  అనే సందర్భం )దీనికి  మూలాలు ఈ  ‘దోపుసేవ’ వలెనే  

                  గౌరీ కల్యాణం  తర్వాత రోజు శివుని అత్తగారి వూళ్ళో దోపిడీ -తదనంతరం  జరిగిన పరిణామాలు- శివుడి ఆగ్రహం -తర్వాత లింగోద్భవమ్ .ఇదీ కధ (శృంగారమ్ మితిమీరిన పద్యాలు (శ్రీనాధుడు రసికుడు కదా) వీలయితే చదివి ఆనందించండి)
అప్పుడూ కల్యాణం తర్వాత రోజే దోపిడీ  జరిగింది కాబట్టి  అదే ఆచారాన్ని ఇప్పటికీ మావూళ్లో కొనసాగిస్తున్నాము
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card