Saturday, April 13, 2019

వనవాసం లో సీతారాములకి విసుగు(బోర్) రాలేదా ?



ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
                                    శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు, అత్తలు వారించినా వినకుండా సీత పట్టు బట్టి "నిన్ను విడచి నేనుండలేను. అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా నాకు హంసతూలికా తల్పంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను." అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరింది.. అప్పుడు రామునకు 25 సంవత్సరములు, సీతకు 18 ఏళ్ళు, సీతారాములు చిత్రకూట పర్వతం, మందాకినీ నది అందాలను చూసి మురిసిపోతూ వనవాసం గడుపసాగారు. ఇంకా అనేక ముని ఆశ్రమాలు సందర్శించిన తరువాత సీతారామ లక్ష్మణులు పంచవటిలో పర్ణశాలను నిర్మించుకొని వనవాసకాలం గడుపసాగారు.
                                అన్ని రోజులపాటు ,అంతపెద్ద అడివిలో మరో వ్యాపకం లేకుండా ఒకరితో ఒకరు విసుగు లేకుండా ఎలా ఉండగలిగారు ఎంతప్రేమున్నా అది ఎలా సాధ్యం. మనం ఉండగలమా?
                             ఇదే సందేహం 'రామాయణం' ఎన్నోసార్లు చదివి ,మరెన్నో సార్లు  గీసి,చలన చిత్రాలుగా తీసిన   ‘బాపూ’ కి కూడా వచ్చిందా?
అందుకేనేమో ఈ క్రింది కార్టూన్ గీసి ,తన,మన సందేహాన్ని ఒకేసారి తీర్చారు


సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నోళ్లు ఎడారిలో వేసినా బతుకగలరు

                             .. ఇంతకూ ఏముంటుంది హాస్యంలో అంటే.. పొర్లించి పొర్లించి పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తది. ఆముదం తాగినట్టున్న మొఖాలపై కూడా తేనె పూస్తది.
                                 హాస్యం అద్భుతమైన ఔషధం లాంటిది. మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. మనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యాయామంలో హాస్యం ముందు వరుసలో ఉంటుంది
                              ఏముంది మనిషి జీవితం? అంతా అసహజత్వం అయిపోతున్నది. సంపాదించాలి.. సాధించాలి అనే రేసులో పడి ఒత్తిళ్లను అగ్గువకు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఉద్యోగ సమస్య.. వ్యాపార సమస్య.. తిండి సమస్య.. అన్నీ సమస్యలే. దీన్ని ఆసరా చేసుకొని మీకు ఆ సమస్యా? ఈ సమస్యా? జీవితంపై విరక్తి చెందారా? మమల్ని సంప్రదించండి అంటూ సొమ్ము చేసుకొనే సంస్థలూ పుట్టుకొచ్చాయి. అవన్నీ ఎందుకు? సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించొచ్చు. ఇదొక లాజికే కాదు మెడిసిన్ కూడా!

No comments:

Post a Comment

Address for Communication

Address card