‘యద్దనపూడి సులోచనారాణి అంటే అందరికీ రెక్కలు
చాచుకున్న కార్లు, ఆరడుగుల 'రాజశేఖర్' లూ, ముక్కుమీద కోపం ఉన్న 'రోజా'లు’జయంతిలు
గుర్తుకొస్తారేమో... కానీ నాకు మాత్రం మెత్తని మాట, మందస్మితం, హుందాతనం, నిరాడంబరత్వం మూర్తీభవించిన ఆమె మూర్తిమత్వమే
గుర్తుకొస్తుంది.
, నా 15 ఏళ్ల వయస్సునుంచీ నన్ను ముంచెత్తినవి కూడా ఆ
అద్భుతమైన ప్రేమ కథలే. ఆమె కలం మధ్యతరగతి కుటుంబాలలోని సమస్యలు, అనుబంధాల చుట్టూ తిరుగుతుందితెలుగ
.సినిమాల్లో గొప్పింటి అబ్బాయి, పేదింటి అమ్మాయి మధ్య ప్రేమ అన్న ఫార్ములా సృష్టికర్త యద్దనపూడి సులోచనారాణి అనడంలో
అతిశయోక్తి లేదు.
ఆమె రచనలు వట్టి ప్రేమ కథలు కావు. భార్యభర్తల
మధ్య అనుబంధం.. వారి మధ్య ప్రేమలు.. మధ్యతరగతి
అమ్మాయిల వ్యక్తిత్వం.. ఆత్మవిశ్వాసం.. హుందాతనం.. మాటకారితనం.. లాంటివి యద్దనపూడి వారి రచనల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఆడపిల్లని
కొత్తరకంగా, చూపించినవి. ఆమె మీద ఆరోపణ కూడ అదే. ఒక్కోసారి
అనిపిస్తుంది. ఆమె ఆడపిల్లల్ని, అప్పటి తక్కిన
రచయిత్రుల్లా 'బాధితులు'
గా (విక్టిమ్స్)
చూపించివుంటే ఆమెకు విమర్శకుల మన్ననలు కూడ లభించేవేమో? కానీ ఆమె ఏరోజూ ఆడపిల్లల్ని బాధితులుగా
చూడలేదు. చూపలేదు.
చీమూ, నెత్తురూ ఉండి, సమస్యలను
ఎదురెళ్లి మరీ ఢీకొన్న మొండిఘటాలుగానే చూపించింది. ఒకవేళ తమకు సమస్యలు లేకపోతే
కొని తెచ్చుకునే పెంకితనం ఉన్న ఆడపిల్లలు వాళ్లు. ఆమె ఎవరికీ అనుభవంలోకి రాని,
రాలేని 'కలల పురుషుడిని, స్వప్నలోకాన్ని' చూపించిందన్న ఆరోపణ మహామహుల నుంచి కూడ
వస్తూంటుంది. నిజమే.. కానీ ఆడపిల్లలకు కలలు కనే హక్కును కూడ నిరాకరించే సమాజంలో
కనీసం కథల్లోనైనా కలలు కనడం ఆనందం కాదూ?
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment