అభివృద్ధి
ఫలాలు యెవరికి చేరాయంటే సమాధానం వుండదు. నిజమే , భౌతికంగా అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తుంది. గుడిసెల స్థానంలో శ్లాబ్ ఇళ్ళు వచ్చాయి. వాటి
మీద టివి యాంటినాలు మొలిచాయి.
బళ్ల గోర్జీలు మట్టి దార్లయ్యాయి, మట్టి
దార్లు సిమెంట్ రోడ్లయ్యాయి. వాటి మీద మోటార్
సైకిళ్ళు తిరుగుతున్నాయి. కల్లు బదులు వంట
సారా, దాని స్థానంలో ప్రభుత్వ
పర్మిషన్ తో దిగిన ‘రాయల్ స్టాగ్’ వంటి బ్రాండెడ్
సరుకు గూడెంల్లోకి వూళ్ళలోకి దర్జాగా చొచ్చుకొచ్చాయి.
ఇదంతా అభివృద్ధే ; కానీ శ్లాబ్ యిళ్ళల్లో
తినడానికి తిండి గింజలుండవు. రాత్రీ
పగలూ తేడా లేకుండా సీరియళ్ళలో
సీరియస్ గా మునిగి పక్కవాడు
చస్తున్నా పట్టించుకోరు. స్వదేశీ విదేశీ తేడా లేకుండా చీప్
లిక్కర్ యేరులై ప్రవహిస్తుంది; కానీ తాగడానికి సురక్షితమైన
నీళ్లుండవు. ఎన్ని సదుపాయాలొచ్చినా యిప్పటికీ
వైద్యం కొందరికి అందని
మాని పండే. సమయానికి వైద్యం
అందక చిన్న చిన్న రోగాలతోనే
(డయేరియాతోనో మలేరియాతోనో) చనిపోవచ్చు.చీకట్లోనే కాదు పగలు కూడా దారి
చూపడానికి సెల్ ఫోన్ టార్చ్
వెలుగు తోడుంటుంది.
‘ప్రకృతిని దేవతలా కొలిచే అత్యంత సహజమైన మానవులు. ఈ భూమిపైన అణువణువూ
పవిత్రమైనదేనని భావించే సమూహం. తన పూర్వీకుల జ్ఞాపకాలు
చెట్లలో ప్రవహించే జీవరసమనీ … పరిమళించే ప్రతి పువ్వూ అక్కచెల్లెలేనని
… పలకరించే ప్రతి జీవీ అన్నదమ్ముడే
అని భావించే అతి పురాతన మానవ
సమాజం’
లోకి , చెట్టుకీ పుట్టకీ అడవి తల్లికీ వూరి
జాతరమ్మ కీ మొక్కిన
వారి ఇండ్లలోకి వారివి కాని ‘అక్షయత్రుతీయలు, రాఖీలు, హోళీలు’ వచ్చాయి.. సొంత
భాషా వేషం అన్నీ పోయాయి.
. చీకటి పడుతూనే, వూరు వెన్నెల
పులుముకుంటూనే యిల్లిల్లూ చుట్టివచ్చే పిల్లల
వెన్నెల్లో ఆటల్లేవు. నానమ్మ చెప్పే రాక్షసుడూ,రాజకుమారి,రెక్కల
గుర్రాలు కొరివి దెయ్యాల ,కథల్లేవు ,తాతయ్యల వీరగాధలతో నిద్రలో జారుకోవటం
లేదు,మామయ్య బాబాయిల చిక్కు ప్రశ్నలు, అక్కలు వదినల,అత్తయ్య,పిన్నిల పొడుపు కధలు లేవు, కిన్నెర మోత లేదు. సన్నాయి ధ్వనుల్లేవు.
డప్పు శబ్దాల్లేవు. జానపద సుస్వరాల్లేవు.
ఆడా మగా పదం కలిపి
పాడే బృందగానాల్లేవు. గొబ్బెల్ల
చుట్టూ అడుగుల్లేవు. రచ్చబండలో కబుర్లు లేవు సామూహిక
జీవితం, ఆట, పాట, పండుగ,
జాతర అన్నీ ధ్వంసమై పోయాయి.
మంది బతుకునీ సామూహిక సాంస్కృతిక వ్యవస్థనీ నిలిపిన ఒగ్గు,చెంచు,కాటికాపరి,హరిదాసు,బుర్రకథ,గంగిరెద్దు,పిట్టలదొరలూ బతికే తెరువు లేక ,కాపలదారులు గానో,మరో
రకం గానో హైదరాబాదు,చెన్నయ్యో బెంగళూరో
వలసపోయి భవననిర్మాణ కూలీలుగా కూలిన శిధిలాల కింద సమాధవుతున్నారు
అదీ హైటెక్ అభివృద్ధి.
ఎంత పారడాక్స్?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment