సంస్కరణల పేరు మీద కేంద్ర
ప్రభుత్వాలు ప్రతీ ఏడాది కార్పొరేట్ వర్గాలకు బహుమతులను లక్షల కోట్ల రూపాయల మేర
అందిస్తోంది. ఈ బహుమతులు రెండు రకాలు. ఒకటి రుణమాఫీ రూపంలో రెండవది ఎక్సైజ్ సుంకం,
దిగుమతి సుంకాల తగ్గింపు
రూపంలో. ఉదాహరణకు ''2010లో బడ్జెట్‌లో
ప్రభుత్వం ఆ వర్గాలకు రూ.5లక్షల కోట్లు
బహుమతులను అందించింది.'' 'బడ్జెట్‌లోని
కోల్పోయిన ఆదాయం' అనే సెక్షన్‌లోని
ప్రకటన). ఈ విషయాన్ని ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఈ బహుమతులు నిమిషానికి రూ.57 కోట్లు. క్రిందటేడాది 'బహుమతులు' నిమిషానికి రూ.30 కోట్లు ఇవ్వబడ్డాయి. అంటే ఈ బహుమతులు ఏడాది
ఏడాదికీ పెరిగిపోతున్నాయి. కానీ రైతులకు అందరికీ కలిపి ఒక్క 2008లో మాత్రమే రూ.70వేల కోట్లు రుణమాఫీ చేశారు. ''1991 నుండి రైతులకు చేసిన రుణమాఫీని కార్పొరేట్ల
కిచ్చిన బహుమతులనూ విశ్లేషిస్తే 2009 వరకూ కార్పొరేట్లకిచ్చిన 'బహుమతుల మొత్తం
రైతులకు ఇచ్చిన రుణమాఫీకి 15 రెట్లుగా
ఉంటుంది.
ఇలా అన్ని పద్ధతుల్లో
రైతుల నడ్డి విరుస్తూ, ప్రభుత్వం
కార్పొరేట్లకు ఊడిగం చేస్తుంటే, రైతులకు
ఆత్మహత్యలు కాకుండా వేరే మార్గమేముంది?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment