లీటర్ వేరుశనగనూనె
కావాలంటే ఎన్ని కిలోల వేరుశనగలు కావాలి? రెండున్నర కిలోల వేరుశనగలు కావాలి. కిలో వేరుశనగ గింజల సేకరణ, ప్రాసెసింగ్ కి 90 రూపాయలు అవుతుంది. అంటే ముడిపదార్ధం ధరే
లీటరుకు 225రూపాయలు
పడుతుంది. బాట్లింగ్, ప్యాకేజింగ్ మరో 10 రూపాయలు. ఉత్పత్తి వ్యయం లీటరుకు 50 రూపాయలు అవుతుంది. వెరసి 285 రూపాయలు అవుతుంది.
నూనె తీయగా
మిగిలిన తౌడు, చెక్కనుంచి
కిలోకి 30రూపాయల వరకూ
వస్తుంది. లీటరు నూనె ప్రాసెస్ చేస్తే కిలోన్నర వరకూ తౌడు వస్తుంది. కాబట్టి 45రూపాయల వరకూ మినహాయించవచ్చు.
అప్పుడు లీటరు
వేరుసెనగ నూనె ధర ఎంత వుండాలి? 240నుంచి 250 రూపాయలు. అది అన్ని ఖర్చులతో కూడుకున్న
ఉత్పత్తి వ్యయం. అంతకంటే తక్కువకు.. అందులో సగం రేటుకే దొరుకుతున్నది సిసలు నూనేనా?
కల్తీ నూనెనా?
ఒకసారి కాచిన
నూనెను మళ్లీ వాడకూడదని, అది అనారోగ్యమని
మనకో ఆరోగ్య సిద్ధాంతం వుంది.
ఈ విషయంలో అనేక
జాగ్రత్తలు తీసుకుంటుంటాం.
అసలు మార్కెట్లో,
ప్యాకెట్లో
కొనుక్కుంటున్న నూనే.. ఒకసారి కాచినది అయితే?
సంప్రదాయ నూనె
గానుగల్లో చెక్కల మధ్య గింజలు పంపి నూనె తీస్తారు. ఆ ప్రక్రియలో వేడి జనించదు. ఈ
మధ్యకాలంలో చెరుకురసం తీయడానికి కూడా సంప్రదాయ చెక్క గానుగ యంత్రాలను వాడడం
చూస్తున్నాం.
నూనె గానుగ
యంత్రాల్లో అనేక ఆధునికత ప్రక్రియలు వచ్చాయి. దానివల్ల రెండున్నర కిలోల గింజల
బదులు, రెండు కిలోలకే,
ఇంకా తక్కువ కిలోలకే
లీటరు నూనె ఉత్పత్తి అవుతోంది. అయితే.. ఆ ప్రక్రియలో, గింజలను గానుగపట్టే ప్రక్రియలో నూనెను
మరిగిస్తారు.
ఈ ప్రక్రియలో
తీసిన దానికి కూడా.. ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరకు మ్యాచ్ కావడంలేదు.
ఒక్క వేరు సెనగ
నూనె ధరనే కాదు.. మిగతా నూనెల విషయంలో కూడా ఇదే పరిస్థితి.
ఇంతకీ మనం నూనె
వాడుతున్నామా? మరేదన్నా
వాడుతున్నామా?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment