Tuesday, April 24, 2018

చేవ చచ్చినోడిలా ఒకడిచ్చేదాని కోసం మనం అరిచిగీ పెట్టడమేంటి?



ఒకడిచ్చేదాని కోసం మనం అరిచిగీ పెట్టడమేంటి? అదేం ఆత్మాభిమానం? తెలుగోడిలో సత్తా ఉంది. తన కాళ్ళ మీద తాను నిలబడగలడు. నలుగుర్నీ నిలబెట్టగలడు అని అందరూ అనుకుంటే అదీ ఆత్మాభిమానం. ఎమీ లేకపోయినా వీడు పైకొచ్చాడురా అంటే అదీ అసలైన గౌరవం. భావోద్వేగాలతో ఆవేశపడిపోయి అడుక్కుంటారో లేక ఆ ఆవేశాన్ని ఆలోచింపచేసి ముందడుగేస్తారో ఇక మీ ఇష్టం.
ప్రభుత్వ పాలనలో ఎన్నో లొసుగులున్నాయ్, వాటి గురించి వీళ్ళు ఎందుకు ఎక్కువగా మాట్లాడరు? వాల్లకి కావలిసినవి ఓట్లు మాత్రమే, యువత దృష్టి ఇప్పుడు ఇటువైపు వెంటనే మరులుతుంది కాబట్టి దీనిని ఆసరాగా తీసుకుని, యువకులను ఉద్యమం పేరుతో బలిపశువలను చేసి రాజకీయంగా లాభపడాలన్నదే వారి అభిమతమై ఉండవచ్చు.

అయినా ఉద్యోగాల కోసం కార్పోరేటు వాల్లను మనం పిలవటమేంది. మనం ఉద్యోగాలను సృష్టించుకోలేమా? ఒకవైపు దేశంలో యువత స్టార్టప్పులని, బిజినెస్ లని ముందుకు దూసుకుపోతుంటే, ఎవడో వచ్చి మనకి ఉద్యోగమివ్వటమేంటి? ఒక మంచి ఆవిష్కరణ కొన్ని వందల ఉద్యోగాలు సృష్టించగలదు, ఒక కొత్త ఉపాయం అనేక సమస్యలను దూరం చేయగలదు. అటువంటి ఆవిష్కరణలు తెలుగు యువత చేయాలి. మనకు మనమే కొత్త ఉపాధులను సృష్టించుకోవాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Monday, April 23, 2018

కొత్త ఫారాలతో పన్ను ఎగవేసి తప్పించుకోలేరు


కొత్త ఫారాలతో పన్ను ఎగవేసి తప్పించుకోలేరు మరింత కచ్చితత్వం, రిటర్నుల దాఖలును పెంచేందుకు రెవెన్యూ అధికారులు పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మదింపు చేయడానికి డిజిటల్ సమాచారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పన్ను ఎగవేతలను నిరోధించడంతో పాటు, సమాచార మదింపు కోసం ప్రభుత్వ వర్గాలు ఇ-అసెస్మెంట్ల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు
అలాగే వేతనం, ఇంటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలపాల్సి ఉంటుంది. గతంలో ఈ నిబంధన లేదు. వేతన రూపంలో వచ్చే ఆదాయ వివరాలు అంటే పన్ను మినహాయింపులు, పెర్క్విజిట్లు, వృత్తి పన్నుపై పొందిన మినహాయింపుల వివరాలు కూడా ఇవ్వాలి. అలాగే ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయం వివరాలు అంటే స్థూల అద్దె ఆదాయం వివరాలు, స్థిరాస్తి పై చెల్లించిన పన్ను, చెల్లించిన వడ్డీ వివరాలు లాంటివి తెలపాలి. దీని వల్ల పన్ను చెల్లింపుదారుల ఆదాయ వనరులపై స్పష్టత వస్తుందని పన్ను అధికారులు భావిస్తున్నారు
ఆర్థిక చట్టం-2017 లో కొత్తగా చేర్చిన నిబంధన ప్రకారం, సెక్షన్ 56(2)(x) పరిధిలో నిర్ధేశించిన సందర్భాలలో తీసుకున్న డబ్బు కానీ ఆస్తి కానీ రూ.50 వేలు మించినట్లయితే ఆ వివరాలను తప్పకుండ ఐటీఆర్-2 లో తెలియజేయాలి
జులై 31 గడువు లోపు పన్ను రిటర్నులు దాఖలు చేయనివారు రూ.5 వేలు జరిమానా కట్టాలి. అలాగే డిసెంబర్ 31 లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇలా జరిమానాలు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు సమయానికి రిటర్నులు దాఖలు చేయడం మంచిది
ఇంటి అద్దె ద్వారా ఆదాయం పొందేవారు అద్దెకుండే వారి పాన్ నెంబర్(ఉంటే)ని తెలపాలి. 2016-17 వరకు ఇది ఐచ్ఛికంగా ఉండేది. అలాగే ఇంటి అద్దె భ్యతం(హెచ్ఆర్ఏ)ని క్లెయిం చేసుకునేవారు తప్పకుండా ఇంటి యజమాని పాన్ నెంబర్ని తెలపాలి
రూ.50 వేల కంటే ఎక్కువ అద్దె చెల్లించే వారు అద్దె నుంచి మూలం వద్ద పన్ను(టీడీఎస్) తీసివేస్తున్న విషయం తెలిసిందే. అలాగే టీడీఎస్ కోసం ఇంటి యజమానులు కూడా అద్దెకుండే వారి పాన్ నెంబర్ సమాచారాన్ని ఈ కొత్త ఫారాలలో తెలియజేయాలి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, April 06, 2018

రామా!........ కనవేమిరా .....!


                  
అడిటర్లు ఎకౌంటెంట్లు మీ ఫీజులో హాస్పిటల్ బిల్లు కొరకు కొంత సర్ ఛార్జ్ అదనంగా  వసూలు చేయాల్సిన కాలం దగ్గరుకొచ్చినట్లుంది
ఎందుకంటే
                   జీ ఎస్టీ లో  ఆడిట్  ‘నమూనా పత్రాలు’ విడుదలైనవి .మొత్తం 56 పేజీలు  .వాట్లో ఎక్కువగా ప్రశ్న జవాబు పద్దతిలో వున్నాయి. అన్ని ప్రశ్నల్లో ఎక్కువగా  నెలవారీ అంశాలే అధికం. పీడియఫ్ లో ఉన్నందున దీనితో జతపరచ లేకపోతున్నాను
                    ఒక్కసారి వాటిని చదవండి చాలు .సన్నగా ఎక్కడో చిన్న నొప్పి మొదలవుతుంది.ఇక వాటిని జాగ్రత్తగా పూర్తి చేయాలంటే మీకెందరు క్లయంట్లు వుంటే అంతమందికి చేయాలంటే జాగ్రత్తగా పూర్తి చేయాలంటే..ఆ శ్రీరాముడే మీకు రక్ష
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


 Format of Proposed Audit Form (Form GST 9C and FORM GSTR –9D) in respect of Annual Audit required under GST Laws is in circulation on Social Media from 4th April 2018.

The PDF File in Circulation Contains Form GST 9C which is a Audit Report and GST FORM GSTR –9D in which all details related to GST Audit needs to be provided.

Form GST 9C is like Form 3CA of Income Tax Audit and Form GSTR –9D is akin to Form 3CD of Income Tax.  Form GSTR9D have 13 sections and 28 Annexures in which all details needs to be given by Taxpayers under GST Audit.  In total its a 56 Page Audit Report Format which is dated 08.12.2017 with the remark that Its a Draft for private circulation.

Form GST 9C- GST Audit Report

(See Section 35 (5) and Section 44 (2) of the Central Goods and Services Tax Act, 2017 read with Rule 80 of the Central Goods and Services Tax Rules, 2017)

GST FORM GSTR –9D – [See rule 80]

Statement of particulars required to be furnished under section 35(5) and 44(2) of the CGST Act, 2017 read with corresponding provisions under the relevant State GST, UTGST and IGST Laws.

GST డీలర్లుకు ముఖ్యమైన హెచ్చరిక :



రుణాలని (రుణదాతలు మరియు రుణగ్రహీతలను) ఒకసారి జాగ్రత్తగా సమీక్షించండి
అరువు ఇన్వాయిస్ యొక్క ఇన్పుట్ పన్ను క్లెయిమ్ చెయ్యడానికి, దాని చెల్లింపు 180 రోజుల్లోపు ఉంటేనే ఇవ్వబడుతుంది. అలా చెల్లింపు చేయకపోతే, ఆ ఇన్వాయిస్పై తీసుకున్నపన్ను  క్రెడిట్ను తప్పనిసరిగా తిరిగి చెల్లించాలి . ఇన్వాయిస్ యొక్క ఇన్పుట్ పన్ను ఇన్వాయిస్ వచ్చిన నెలలో చూపించి అప్పుడే క్లెయం చేసివుంటారు అటువంటి వాటికి చెల్లింపు 180 రోజులలోపు ఉండక పొతే ఇన్పుట్ రివర్స్ చేస్తారు
    .ఈ తర్కం ద్వారా, అక్టోబర్ 1, 2017 ముందు జారీ చేయబడిన ఇన్వాయిస్లు మార్చి 2018 నాటికి చెల్లించబడాలి. లేకపోతే, ఇన్పుట్ క్రెడిట్ను మీరు రివర్స్ చేయవలసి ఉంటుంది. ఇది రుణగ్రస్తులు మరియు ఋణదాతల యొక్క సరైన కాల విశ్లేషణకు అవసరం.
  కనుక మీ మార్చి 2018 GST రిటర్న్ సరిగా ఫైల్ చేయండి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, April 04, 2018

దైవ ప్రార్ధనలలో శృంగారం ఎందుకు మిళీతమైంది?


దైవ ప్రార్ధనలలో  శృంగారం ఎందుకు మిళీతమైంది


"కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే"
రసాత్మక శృంగార సుప్రభాతానికి అర్ధం, " ఓ శ్రీనివాస ప్రభో! గత రాత్రి శృంగార రసవాహినిలో తమ ధర్మపత్ని శ్రీదేవి ని కౌగిలిలో బంధించి ఆ సమ్మొహనములో పరవసించినది నీ వక్షస్థలం పై  కుంకుమ వర్ణం ముద్రలు పడ్డాయి. అవి ఆమె కమలాలవంటి కుచద్వయం నీ నీలి దేహం పై కుంకుమ వర్ణం తో మీరు కౌగిలిలో బంధించిన విషయం స్పష్టమౌతుంది. కమలములవంటి అక్షి ద్వయమున్న ఓ దేవా! మీకు విజయమగుగాక! అనేది ఆ సుప్రభాత శ్లోకానికి పరిపూర్ణ అర్ధం.
  

కాటుక కంటినీరు, చనుకట్టు పయింబడ నేల ఏడ్చెదో
కైటభధైత్యమర్ధనుని గాదిలి కోడల! యోమదంబ! యో
హటక గర్భురాణి!  నిను నా కటికిం గొనిపోయి యెల్ల క
ర్ణాట కిరాత కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతి!”     
అమ్మా! భారతీ దేవీ! కాటుక కంటినీరు జాలువారుతూ వక్షద్వయం పై నున్న వస్త్రం రవికపైబడేలా ఎందులకు ఏడ్చావు తల్లీ!  రాక్షసుడైన కైటభుని చంపిన శ్రీమహవిషువు కోడలివైన నీకే కష్ఠమొచ్చిందని విలపిస్తావు! యో మహాదేవీ ఈ సమస్థ భువనాన్ని సృష్టించిన బ్రహ్మదేవుని ఇల్లాలివైన నిన్ను బయటకు తీసుకెళ్ళి ఆకర్ణాట కిరాత కీచకులైన రాజులకు అమ్మనని వారికి అంకితము ఇవ్వనని మనసా, వాచా, కర్మణా ప్రమాణం చేస్తున్నాను తల్లీ!”  అని అర్ధం.

సంస్కృత  శ్లోక సాహిత్యం, తెలుగు పద్య సాహిత్యం, పురాణ సాహిత్యం తెలుగు వారికున్నంత ఏ యితర భారతీయ భాషల వారికి లేదు. అయితే హిందువుల దైవ ప్రార్ధనలలో శృంగారం ఎందుకు మిళీతమైంది? మహా విజ్ఞులు, భాషా వాజ్మయం లో విస్తృత పరిజ్ఞానమున్న పండితులందరూ భక్తికి శృంగారాన్ని ఎందుకు మిళితం చేశారు? ఇదే ప్రశ్న ...సమాధానం కావాలి.  
 ప్రపంచములో ఏ జాతి జనుల దేవతలకైనా భార్యా బిడ్డలు కుటుంబం ఉండరు. కాని హిందూ మతధర్మంలో ఇది కనిపిస్తుంది. రూపం, ఆకారం, గుణ ఏదీలేదంటూ ఆదిమద్యాంత రహితుడూ, సర్వాంతర్యామి, నిరామయుడని చెపుతూనే ఆ దైవానికి ఇద్దరేసి భార్యలను అంతగట్టి విగ్రహాలను దేవాలయాలను నిర్మించి పూజలూ పురస్కారాలు చేస్తూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తూ కళ్యాణాలు జరిపిస్తూ ఏకాంత సేవలూ చేస్తూ సంతొషపడటమంటే ఆదైవానికి కూడా మానవ ధర్మములోని శృంగారాన్ని అన్వయిస్తున్నాం కదా!
సుమారు 3000 సంవత్సరాల క్రితమే హరప్ప మొహోంజదారో కాలములోనే శివాలయాలు నిర్మించాం. అందులో శివలింగం పురుషుని అవయవాన్ని పోలి ఉంటుంది. పానవట్టం స్త్రీ అవయతత్వాన్ని పోలి ఉండి అసలు శివ స్వరూపమే - ప్రకృతి పురుషుల మేలు కలయికగా భావిస్తూ దైవమే భక్తి శృంగార స్వరూపం సృష్టి అంతా శృంగార స్వరూపంగా చెప్పుకుంటున్నాం. చతుర్విధ పురుషార్ధాలైన ధర్మ-అర్థ-కామ-మోక్షా లలో కామం తరవాతనే మోక్షానికి స్థానమిచ్చం. "కామి గాని వాడు మోక్ష గామి కాడు" అంటూ కామం (శృంగారం) ప్రాముఖ్యతను పెంచేశాం. శేంగార జీవనాన్ని వడలి అందరూ సన్యాసాన్ని స్వీకరిస్తే సృష్టి నిలిచిపోతుంది. అందుకే జీవన ధర్మం పాటించేటట్లు జీవనాన్ని నిర్దేశించారు.


దైవ చింతనలో పడి పోయి కాలం గడిపివేస్తే ఆహారం ఎలాలభిస్తుంది? సంసార ధర్మం పాటించకపోతే (శృంగారం లేకపోతే) సంతానం లేక సృష్టి కార్యం ఆగి సృష్టి కర్త (బ్రహ్మ) కు పనిలేకుండా పోతుంది. అందుకే ధర్మ, అర్ధాలో కామాన్ని కలిగి ఉంటేనే మానవ జీవితం మోక్షం పొందుతుంది.తన ధర్మ పత్నితో కలసి ఉండే  ధర్మం కామం అంటే శృంగారం. అన్య కాంతలతో జరిపే అధర్మ కామం వ్యభిచారం. అందుకే అనాదికాలములో బహుభార్యాత్వాన్ని, కొన్ని సందర్బాల్లో బహుభతృత్వాన్ని సంఘం సమాజం అనుమతించాయి. మానవాభివృద్ది ఇంత జరగటానికి మూలం కామం కోరికలే. కామమే లేకపోతే సృష్టే ఉండదు. వీటిపరమావధి సుఖమే. అందుకే అమలిన శృంగారం ఒక రకంగా పవిత్ర కార్యమే.

స్వామీజీల పుణ్యమా అని రోజంతా వేదాంత చర్చలు వైరాగ్య ప్రవచనాలు ప్రయోజనాలనివ్వవు. అందుకే భక్తి కార్యక్రమాలనుండి యువతకు మార్గనిర్దేశం చేసే టందుకే శృంగారాన్ని దైవకార్యాల్లో, దైవపఠనాల్లో సుగర్ కోటెడ్ (తీయనైన శృంగారాన్ని పైపూతగా దైవ పఠనాల్లో)  పూశారు అంటే శృంగారం తరవాతే భక్తి. జీవన అక్రమాన్ని రక్తి (శృంగారం), భక్తి (దైవ కార్యములో నిమగ్నం), ముక్తి (దైవములో కలిసిపోవటం)  అన్నారు. అంటే రక్తి తరవాతే ముక్తి.  శృంగారం ప్రధానంగా సాగే భక్తి గీతాలే అన్నమాచార్య కీర్తనలు, జయదేవుని అష్ఠపదులు, క్షేత్రయ్య పదాలు ఇవన్నీ శృంగార సమ్మిళితాలే. దేవుళ్ళకు భారయలున్నప్పుడు భక్తిలో శృంగారం తప్పుగాదు కదా!

చాలామంది హిందూ భక్తి సాహిత్యమంతా శృంగారమయమే కదా! అంటారు. ఇక్కడ మన మనసును దైవం వైపు మరల్చటానికి 10% మాత్రమే వాడారు. మిగిలిన 90% వైరాగ్యమే. అందుకే హిందూ తత్వం ఒక జీవన విధానమే కాని మతం కాదు అంటారు. ఎవరైనా అలా భావిస్తే అది వారి ధృష్టి దోషమే కాని, సృష్టి దోషం కాదు. కూరలో కరివేప రుచి కోసమే, తినటం మొదలెట్టాక కరివేపాకును పక్కన పెడతాం. ఆదైవ సన్నిధిలో శృంగారం ప్రవేశం (ఎంట్రి) మాత్రమే. లోపలంతా వైరాగ్య వైభోగమే.



శృంగార రహిత జీవితంతో విశ్వం జీవ రహితమౌతుంది. జీవుల సృష్టికి తొలిమెట్టు శృంగారమే. అది ప్రతి ప్రాణికి జన్మ హక్కు. అమలిన శృంగారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజూ శృంగారంలో క్రమ పద్దతిలో పాల్గొంటే ఈ యోగాలు, వ్యాయామాల అవసరమే ఉండదు. అనైతిక శృంగార ఫలితమే అతి ప్రమాదకర హెచైవి లాంటి రోగాలకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయటం మనం చూస్తూనే ఉన్నాం. అమలిన శృంగారం అత్యావస్యకం, దైవత్మం ఉన్న పవిత్రకార్యమే.      



Address for Communication

Address card