Friday, November 15, 2019

120% ITC ద్వారా రాబోయే సమస్యలు


ఒక నెల GSTR 3B నుండి GSTR 2A లో చూపిన దానిపై  120% ITC మీరు గరిష్టంగా తీసుకోండి అని . రూల్ 36 (4) CGST  చెప్తుంది
కానీ వాటి ద్వారా  రాబోయే  సమస్యలు -
1. GSTR 1 ని ‘11 ‘తేదీ అర్ధరాత్రి 11.59 PM కు ఖచ్చితంగా  లాక్ చేస్తాం అని చెప్తుంది. వాస్తవానికి 11 వ తేదీకి ముందు ఎంత మంది పన్ను చెల్లింపుదారులు GSTR 1 ని దాఖలు చేస్తారు? మరియు పోర్టల్ ప్రతి నెల 10’ , “11” లో రద్దీ కారణంగా లేదా సాంకేతికంగా  పని చెయక పొతే? మన నెలవారీ సరఫరాదారు 12 లేదా 13 న ఫైల్ చేస్తే? వచ్చే నెలలో మాత్రమే మనకు ఈ క్రెడిట్ వస్తుందా ?? అతను  సకాలము లో  దాఖలు చేయక పోవడం మన తప్పా ??  మనం ఐటిసి పొందిన తరువాత జిఎస్టిఆర్ 2 ఎ అప్‌డేట్ / సవరించబడినప్పుడు అంటే జిఎస్‌టిఆర్ 1 గడువు తేదీ తర్వాత ఏమి జరుగుతుంది?
2. 120%  నిర్ధారణ GSTR 2A యొక్క స్థితిని  11 ”తేదీ ప్రకారం అర్ధరాత్రి 11.59 PM కు ఖచ్చితంగా  లాక్ చేయడం పై అధార్ పడి వుంటుంది. . లాక్ చేయబడకుండా  11 న ఎలా పొందగలం? ఏ సాఫ్ట్‌వేర్‌ కూడా  అందించలేదు. GSTR2A ఒక డైనమిక్ ఫారం ఇది చాలా ఉపయోగం ,  ఎస్సెస్మెంట్ / విచారణ / పరిశోధనల సమయంలో  చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి.
3. మన 120%% ని నిర్ణయించడానికి, ఈ గజిబిజి దశలను అంచనా వేయడానికి  మనకి ఎంత సమయం, ఎంత సహనం, ఎంత నైపుణ్యం ఉంటుంది ?? మనపై  భారం సమయం మరియు ఖర్చు చాలా రెట్లు పెరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని నిజంగా సింపుల్‌గా చేస్తున్నారా?మీకు అలా అనిపిస్తుందా?
4. రిజిస్టర్డ్ వ్యక్తి ప్రతి నెలా క్రెడిట్ మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది మరియు క్లెయిమ్ చేయని క్రెడిట్ల కోసం తరువాతి నెలల్లో కూడా వెతకాల్సిన అవసరం వుంది. అర్హతగల ఐటిసి గుర్తింటం ఒక పని, క్లెయిమ్ చేయని ఐటిసిని ట్రాక్ చేయడం మరియు తరువాతి నెలల్లో రిపోర్టింగ్ను ట్రాక్ చేయడం  మొత్తం గజిబిజి పని. ఇంకా సమయం ఉంతుందా?
5.నిర్వహణా మూలధనం(నగదు) ప్రతిష్టంభన కూడ ఉంటుంది. SME రంగం దీనికి సిద్ధంగా ఉందా ??
6. వారు త్రైమాసిక సమస్యను పూర్తిగా మరచిపోయారు. త్రైమాసిక రాబడిని దాఖలు చేసే SME సరఫరాదారులకు సడలింపు లేదు. గ్రహీతకు త్రైమాసిక ప్రాతిపదికన క్రెడిట్ లభిస్తుంది. మొత్తం రిజిస్టర్డ్ టాక్స్ చెల్లింపుదారులలో త్రైమాసికంలో దాఖలు చేసే వారు 7% మాత్రమే అని కారణం చెప్పడం తార్కికంగా ఉందా ??ఒక వేళ త్రైమాసికంలో దాఖలు చేసే మెజారిటీ సరఫరాదారులు నా వద్ద ఉంటే? వారు చెప్పేది ఏమిటంటే మీరు ఈ ఐటిసిని త్రైమాసిక ముగింపు నెలలో తీసుకోండి .అని.. ఇది న్యాయమా ??
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్

20% నిబంధన ఓ ప్రశ్నార్థకం –ఒక ప్రహేళిక !


20% నిబంధన ఓ ప్రశ్నార్థకం –ఒక ప్రహేళిక  !
(2 వ భాగం)
సరఫరాదారులు  కొన్ని ఇన్వాయిస్లు తరువాతి నెల రిటర్న్లో అప్లోడ్ చేస్తే ఏమిటి?.
20% నిబంధన నెలవారీ లేదా త్రైమాసిక లేదా ఏటా వర్తించాలా అనేది స్పష్టంగా లేదు. అందువల్ల, వడ్డీ కూడా ప్రశ్నార్థకం.
ఉదాహరణ:
ఈ నెలలో నాకు రావలసిన ఇన్పుట్-రూ.1,00,000/-, కానీ నేను రిటన్ దాఖలుచేసే సమయానికి 2ఎ ప్రకారం—రూ.60,000/-వుంది.అంటె రూ.72,000/-మాత్రమే నాకు ఈ నెల అందుబాటులో వుంది.సరె అలాగే రిటన్ సబ్మిట్ చెసాం.
  తర్వాత  కొంత మంది అప్లొడు చెయటం వల్ల రూ.20,000/- అదనంగా ఆ నెలలొనే చెరింది .ఇప్పుడు
20% లెక్క తప్పింది. ఎలా ?
            ఇదే నెల కి సంబందించిన సరఫరాదారులు  వెర్వెరు నెలల్లొ  అప్లొడు చెస్తె ఎలా. దీనికి  గడువు ఏమయినా వుందా? తర్వాత  ఎప్పుడొ అందరూ అప్లొడు చెస్తే  అదనపు  20%  రిఫండు ఏలా? దీన్ని ఎలా సరిచెయాలి. తర్వాత నెలల్లొ ఎలా సర్దుబాటు చెయాలి. అసలు ఖాతా పుస్తకాల్లో ఈ అన్ని ఎంట్రీ లు  ఎలా రాయాలి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు

ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ కొత్త నియమం లో ఇబ్బందులు


 
 ఇటీవల, సెక్షన్ 9 (1) కింద సరఫరాదారు అప్‌లోడ్ చేసిన ఇన్వాయిస్‌ల ఆధారంగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను అర్హత కలిగిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌లో 120% కి పరిమితం చేస్తూ , అక్టోబర్ 9, 2019 న నోటిఫికేషన్ నెంబర్ 49/2019-సెంట్రల్ టాక్స్ వచ్చింది.
ఈ నోటిఫికేషన్ లో వివరాలు విశ్లేషిస్తే, క్రింద సమస్యలు కనిపించాయి.
కొత్త నియమం:
                    పొందవలసిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్,కింద సరఫరాదారులు అప్‌లోడ్ చేయని వివరాలు 20 %  మించకూడదు.
అమలు విధానం:
                              GSTR-2A లో భాగాలను కలిగి ఉంది: A. అందుబాటులో ఉన్న ఇన్వాయిస్‌ల ఐటిసిB. గ్రహీతతో సంబంధం లేని ఇన్వాయిస్‌ల ఐటిసి అనగా తప్పు జిఎస్‌టిఎన్ కింద సరఫరాదారు అప్‌లోడ్ చేసిన ఇన్వాయిస్లు .గ్రహీతకు అందుబాటులో ఉండవు కానీ ఆ ఐటిసి ఉంటుంది.C. గ్రహీతకు చెందిన వే కానీ ఇన్వాయిస్లు ఉండవు ఐటిసి ఉంటుంది ఉదా. వైమానిక ఇన్వాయిస్లు, బ్యాంక్ ఛార్జీలు (లేదా అవి తరువాత స్వీకరించబడినట్లు).D .సెక్షన్ 17 (5) ప్రకారం  నిరోధించడిన ఐటిసి.E. ITC రివర్స్  
* సరఫరాదారులు అందరూ అన్ని ఇన్వాయిస్లు అదే నెలలో అప్‌లోడ్ చేసారని భావిస్తే. ఐటిసి సంతృప్తి గా ఉంటుంది: ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ను తన వద్ద వున్న ఇన్వాయిస్లు ప్రకారం అంతా  క్లెయిమ్ చేయడానికి అర్హత  వుంటుంది:
ఇబ్బందులు
1. కవర్ చేసిన పన్ను కాలం పేర్కొనబడలేదు:
                  సరఫరాదారు ఆర్థిక సంవత్సరానికి ఇన్వాయిస్‌లను అప్‌లోడ్ చేయవచ్చు లేదా సవరించవచ్చు, ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత కూడా సెప్టెంబర్ లేదా వార్షిక రిటర్న్ దాఖలు చేసిన తేదీ వరకు సవరించవచ్చు .అందువల్ల, సరఫరాదారు ఇన్వాయిస్ను తరువాతి నెల రిటర్న్లో అప్లోడ్ చేస్తే చిక్కులు ఏమిటి? నోటిఫికేషన్ కవర్ చేయవలసిన కాలాన్ని పేర్కొనలేదు. 20% నిబంధన నెలవారీ లేదా త్రైమాసిక లేదా ఏటా వర్తించాలా అనేది స్పష్టంగా ఉందా? లేదు. అందువల్ల, వడ్డీ కూడా ప్రశ్నార్థకం.








2. అమలు తేదీపై స్పష్టత లేదు:
                ఈ నిబంధన అక్టోబర్ 9, 2019 నుండి అమలులోకి వస్తుందని నోటిఫికేషన్ నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, పన్ను చెల్లింపుదారుడు ఈ నిబంధనను సెప్టెంబర్ 2019 రిటర్న్ కోసం కూడా పరిగణించాలా లేదా అది అక్టోబర్ 2019 నుండా?
              ఈ కొత్త చట్టం 30 సెప్టెంబర్, 2019 న ఉనికిలో లేదు , తద్వారా ఈ పరిస్థితి 30 సెప్టెంబర్, 2019 వరకు వచ్చే కాలానికి ఇది వర్తించదని. 1 అక్టోబర్ 2019 న లేదా తరువాత నమోదు చేసిన సరఫరా కోసం వర్తించబడుతుంది.  అని నేను నమ్ముతున్నాను
3. పన్ను చెల్లింపుదారుపై ద్వంద్వ కష్టాలు :
            రూల్ 42 ప్రకారం చేసిన రివర్సల్‌ను మినహాయించటానికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వబడలేదు & ఇది డబుల్ రివర్సల్ ద్వారా పన్ను చెల్లింపుదారుపై ద్వంద్వ కష్టాలకు దారితీయవచ్చు.

















నా అభిప్రాయం ప్రకారం, రూల్ 42 మరియు రూల్ 43 లో సవరణలు లేనందున ప్రస్తుతం రూ .50 తొ  రివర్సల్ చేయబడుతుంది. అయితే తార్కికంగా  చూస్తే రివర్సల్ రూ. 36 గా ఉండాలి, ఎందుకంటే అసెస్సీ ఇప్పటికే పన్ను క్రెడిట్ యొక్క దామాషా రివర్సల్ చేసాడు , లేకుంటే అది రెట్టింపు అవుతుంది
4. ఇన్వాయిస్ సవరణ తర్వాత:
                    తదుపరి నెలలో సరఫరాదారు చేసిన ఇన్వాయిస్ లో సవరణను , గ్రహీత ఇప్పటికే అసలు వివరాలు ఆధారంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ వాడుకున్నారు . ఈ ఇన్వాయిస్  తర్వాత నెలలొ అదనపు క్రెడిట్ గా క్లెయిమ్ చేయబడింది .ఒకే. కానీ ఇది GSTR-2A ప్రకారం తప్పు-సరిపోలికను సృష్టిస్తుంది మరియు గ్రహీత పొందినది వాస్తవ క్రెడిట్. ఏమి చేయాలి?
5. భవిష్యత్తులో పరిశీలన యొక్క చిక్కులు :
                    తరువాతి సంవత్సరాల్లో పరిశీలనలో క్రెడిట్ అర్హత లేదని తేలితే, అనర్హమైన క్రెడిట్‌ను రివర్స్ చేయమని విభాగం కోరవచ్చు. ఇంకా, డిపార్టుమెంటు ప్రకారం చేయవలసిన రివర్సల్ మొత్తం అనర్హమైన క్రెడిట్ అవుతుంది. ఇది మరింత రివర్సల్ మరియు వడ్డీ కు దారితీయవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అదనపు ఐటిసి క్లెయిమ్ చేయడం మరియు రివర్స్ చేయడం.ఎలా?

























ఇది పన్ను చెల్లింపుదారు మరియు పన్ను అధికారుల మధ్య చట్టపరమైన గొడవలకు దారితీస్తుందని మేము నమ్ముతున్నాము.
6. సమయ వ్యవధిలో ఆడిట్ కనుగొనే ప్రభావం:
                  డిపార్ట్‌మెంట్ ఆడిట్ సమయంలో, వారికి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను నిరాకరించి రివర్స్ చెయటం అవసరం కావచ్చు, దీనివల్ల 20% అంతర్గత నిష్పత్తి మారుతుంది, తద్వారా అదనపు పన్ను రివర్సల్‌కు దారితీస్తుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్





























Friday, November 01, 2019

సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం

రుణం పొందాలంటే బ్యాంకులు, సంస్థలు ముందుగా కోరేది రుణ చరిత్ర. సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం తెలుసుకుందాం.


సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ.  సిబిల్‌ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని  సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్‌ రుణ చరిత్ర నివేదిక, క్రెడిట్‌ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి


సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ.  సిబిల్‌ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని  సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్‌ రుణ చరిత్ర నివేదిక, క్రెడిట్‌ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి.

క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ స్కోర్‌(సీఐఆర్‌) అంటే:

సీఐఆర్‌ అంటే సిబిల్‌ జారీ చేసే మూడంకెల సంఖ్య. ఇది రుణ చరిత్ర ఆధారంగా నిర్ణయమవుతుంది. ఇందులో నిర్ణీత కాలానికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన రుణ చెల్లింపుల వివరాలు ఉంటాయి.

క్రెడిట్‌ స్కోర్‌ కోసం సిబిల్‌ వద్ద నమోదు చేసుకునే పద్ధతి:

ఆన్‌లైన్‌ ద్వారా:

  • క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర ఆన్‌లైన్‌లో సిబిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
    పాన్ ఉన్నవారు నిమ్పవలసిన వివరాలు కింది విధంగా ఉంటాయి.

    CIBIL-A.jpg
పాన్ లేనివారు నిమ్పవలసిన వివరాలు:


  • నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.
  • వివరాలను ఆన్‌లైన్‌ నమోదు ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
  • ధృవీకరణ పూర్తయిన తర్వాత రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోర్‌లను మెయిల్‌ ఐడీకి పంపిస్తారు.

ఆఫ్‌లైన్‌ ద్వారా:

  • పోస్ట్ ద్వారా సైతం ప‌త్రాల‌ను పంపి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.
  • మొదట వెబ్‌సైట్ నుంచి నమోదు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • నమోదు పత్రంలో వివరాలను నింపాలి.
  • నమోదు పత్రానికి, కేవైసీ పత్రాలు, నిర్దేశించిన రుసుము  డీడీని జతపరుస్తూ నిర్దేశిత చిరునామాకు పోస్ట్‌ చేయాలి.
  • సిబిల్‌కి సీఐఆర్‌ కోసం ఆన్‌లైన్‌లో ఒక మెయిల్‌ను పంపించాలి.
    నమోదు పూర్తయిన తర్వాత మీ మెయిల్‌ ఐడీకి సమాచారం వస్తుంది.

ఉచితంగా రుణచరిత్ర:

  • సంవత్సరానికి ఒకసారి సిబిల్ ఉచితంగా రుణ చరిత్ర అందిస్తుంది.

రుణ దరఖాస్తు సమయంలో వివిధ దశలు:

  1. దరఖాస్తు దారుడు దరఖాస్తు ఫారాన్ని నింపి బ్యాంకు, ఆర్థిక సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.
  2. వెంటనే రుణ సంస్థ, సిబిల్‌ను ఆశ్రయించి క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర నివేదికల కోసం ప్రయత్నిస్తుంది.
  3. ఈ దశలో క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే, దరఖాస్తు ప్రక్రియను కొనసాగిస్తారు.
  4. అందుకు అవసరమైన పత్రాల కోసం రుణసంస్థలు రుణగ్రహీతను సంప్రదిస్తా

బ్యాంకుల పరిశీలన ఇలా:

cibil.jpg
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు క్రెడిట్‌ స్కోర్‌ ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఒక వ్యక్తి సమగ్ర రుణ చరిత్రను తెలియజేయడం వరకూ మాత్రమే సిబిల్‌ పరిమితమవుతుంది. మంచి క్రెడిట్‌ స్కోర్‌తో పాటు వ్యక్తి ఆదాయ వనరులు, వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆస్తి−అప్పుల నిష్పత్తి వంటి వాటిని బ్యాంకులు లోతుగా విచారిస్తాయి. తర్వాత మాత్రమే రుణం మంజూరీ గురించి ఆలోచిస్తాయి.

సీఐఆర్‌లో ఉండే సమాచారం:

సీఐఆర్‌లో గృహ, ఆటోమొబైల్‌, వ్యక్తిగత, వాహన రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌లకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
ఈ సమాచారాన్ని సిబిల్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Address for Communication

Address card