Monday, July 23, 2018

ఇప్పటి వరకు నడిచిన ప్రత్యెక హోదా/పేకేజీ కధ.......ఔను కదా?



ఓ మహిళ చీరకొనడానికి బెనారస్ పట్టుచీరల దుకాణానికి వెళ్ళింది!యజమాని మంచి స్నేహితుడుకూడా! దుకాణం నిబంధనల ప్రకారం ముందే డబ్బు చెల్లించింది!ఓ కంచి పట్టుచీర ఎంపిక చేసుకొంది!అది ఔట్ డేట్ ఫేషన్
అనీ!ఎవరూ కొనడంలేదనీ దుకాణ్ దారు అన్నాడు!తాను చెప్పిన నార్తిండియన్ బెనారస్ పట్టుచీర సుకోమన్నాడు!
సరేనంది!అతనుచెప్పిన చీరతో ఇంటికి వెళ్ళింది! ఆచీర రంగు వెలుస్తోంది!అన్నీ కన్నాలే!మరలా దుకాణానికి
వెళ్ళి చీర మార్చి కంచి పట్టుచీరే ఇమ్మంది!అతను వీలుకాదన్నాడు!సరే "బెనారస్ చీరే" చిరుగులు లేని రంగు
వెలవని దీ ఇమ్మంది!ఓసారి తీసుకొన్నాకమార్పిడీ లేదూ!దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు!భర్త రంగ ప్రవేశంజేశాడు! దుకాణానికి వెళ్ళియజమానిని చీర ఇమ్మన్నాడు!ఆమె నిలకడ లేనితనం వివరించాడు!
భర్తకు బోలెడుకోపం వచ్చింది!కొనేసమయంలో తానుంటే అలాజరిగేది కాదుగదా అని బండబూతులు
తిట్టెడు!(అసలు ఆమెను వదిలించు కోవాలని ఉన్నాడు!) తప్పంతా భార్యదే నని అందరూ వినేటట్లు
తిట్టేడు ,బాదేశాడు! నీతో కాపురం ఇక వీలు కాదన్నాడు!దుకాణదారుపై కోపంరాలేదు!భార్యపై కోపం!
వదిలించుకొనే ఛాన్సు వదులుకోదలుచుకోలేదు! చిరిగిన చీరతో ఇంటికి వెళ్ళారు!పిల్లలు కొత్తచీర ఏదన్నారు!
తప్పు మీఅమ్మదే!నేను ఈమెకు విడాకులిస్తున్నా!కోర్టులో మీరు సాక్ష్యంజెప్పినాకు అండగా నిలవాలి
అన్నాడు!సరే నాన్నగారూ!మనం చీరకోసం చెల్లించిన యిభైవేలకు గాను ఈ చిరుగులచీరే గతా?రేపు కొత్తమమ్మీని
ఈ చిరుగుల చీరతో చూసే దెలా!మన కుటుంబానికి జరిగిన నష్టం సంగ తేమిటి? అమ్మ మీద కోపంతో!
రేపు కొత్త మమ్మీకి ఈ చిరుగుల చీరే కట్టబెడతారా? అంటే! ఔను తప్పంతా మీ మమ్మీదే! కొత్త మమ్మీ వచ్చాక చూడండి! బ్రహ్మాండంగా ఉంటుంది! అన్నాడు! సరే నాన్నగారూ అప్పుడైనా అదే దుకాణం అదే దుకాణ్ దారూ
కదా? అప్పుడు మంచి చీర ఇస్తాడంటారా? అంటే! తప్పకుండా! కొత్తభార్యతో వెళితే సమస్య పరిష్కారమే!
అన్నాడు!మీరు మాత్రం కోర్టులో విడాకులకు మద్దత్తు కొత్తమమ్మీకి ఆహ్వానం చెప్పడానికి సిధ్ధంగా ఉండమన్నాడు!
ఇరుగు పొరుగువారితో భార్య నిలకడలెనితనం గురించీ! విడాకులసంతీ! వారూ కోర్టులో జరిగినది చెప్పి "విడాకులకు" సహకరించమనీ అడిగాడు! చీర కోసంచెల్లించిన డబ్బు చర్చలోకి రావడంలేదు! తన భార్య నిలకడలేని తనమే సమస్యకు మూలమన్నాడు! కొత్త భార్య ! జనం మద్దత్తుతో "కొత్తభార్య" తో కాపురం పాత భార్యను తరిమేయడం! ఓ సుందర దృశ్యం కళ్ళముందు కదిలాడింది! కొత్త పెళ్ళికి ముహూర్తం మదిలో మెదలాడే!
("పల్లకీలోన ఊరేగే ముహూర్తం కదలాడే!") పెళ్ళిపనులు దగ్గరపడుతున్నాయి! అదండీ సంగతి!పిల్లలేమో కొందరు
తండ్రిపక్షం!కొందలు అమ్మ పక్షం! ఏమౌతుందో ఏమో!

  ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, July 18, 2018

దయచేసి ఆంధ్రప్రదేశ్లోని వృత్తి పన్నుల రేట్లలో మార్పును గమనించండి


దయచేసి ఆంధ్రప్రదేశ్లోని వృత్తి పన్నుల రేట్లలో మార్పును గమనించండి
G.o.Ms.No . 82 తేదీ 04-02-2013  మొదటి  షెడ్యూల్ ప్రకారంగా
నెలకు 15,000 / - కంటే తక్కువ జీతంపై వృత్తిపరమైన పన్ను లేదు (ఇంతకూ ముందు  ఇది రూ.5000 / - జీతానికి  వర్తించేది). ఆ తరువాత కేవలం రెండు స్లాబ్ల జీతాలు  తీసుకునేవారు మాత్రమే పన్ను పరిధిలో వున్నారు. 15,001 / - నుండి 20,000 / - మధ్య జీతంపై నెలకు  PT Rs.150 / - PM మరియు నెలకు  రూ .20,000 / - కంటే ఎక్కువ జీతాలు.గలవారు రూ.200/-నెలకు పన్ను గా చెల్లించాలి

కంపెనీలు APVAT/GST  చట్టం క్రింద నమోదు చేయబడిన వ్యాపారస్తులు సంవత్సర టర్నోవర్  రూ. 10.00 లక్షలు  లోపు వుంటే ఎటువంటి  PT ను చెల్లించాల్సిన పనిలేదు. రూ.10 లక్షలు దాటి రూ.50
 లక్షలు టర్నోవర్ గల వారు సంవత్సరానికి రూ.1250/- రూపాయలు, రూ.50
 లక్షలు టర్నోవర్ దాటినవారు సంవత్సరానికి రూ.2500/- వృత్తి పన్ను గా చెల్లించాలి. కంపెనీ నుండి వేతనాలను పొందే  డైరెక్టర్లు (ప్రభుత్వ నామినేట్ కాకుండా) రూ .2,500 / - PA చెల్లించాలి

ఎక్కువగా Sl.No.39 లో వివరించబడిన కార్మిక ఆధారిత పనులు వ్యక్తులకు పూర్తిగా మినహాయింపు ఇవ్వబడినది

కొత్తగా ఒక వర్గం చేర్చబడింది  -, ఏదైనా వృత్తిలో, వ్యాపారంలో లేదా ఇతరులకి పని కల్పించే వృత్తి  చేస్తున్నవారిలో  ఒక సంవత్సర కాలపరిమితికి రూ .180,000 / కంటే ఎక్కువ వార్షిక ఆదాయంతో వున్నవారు.( ఉపాధి కల్పించే విషయంలో ఇంతకుముందు  ఉన్న ఎంట్రీలలో పేర్కొన్నవాటి లో, చట్టం యొక్క సెక్షన్ 31  లో  ఎంట్రి  No. 39, SL నెం .40 కింద  చేర్చబడి  మినహాయించబడిన వారికి తప్ప మిగిలిన వారు) పన్ను చెల్లింపు  @ 2,500 / - P.A. చేయాలి
-                                 ----------- ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Saturday, July 14, 2018

స్వేచ్ఛ అనే హక్కు

స్వేచ్ఛ అనే హక్కు మనం పొంది 69 సంవత్సరాలు దాటింది,
అంటే 90 సంవత్సరాలు దాటిన మన తాత లు ,నానమ్మలు,బామ్మలు అంతకుముందు 21 సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండానే గడిపారా.!
కానీ, ఏ నాడు తమ స్వేచ్ఛకు భంగం కలిగిందని చెప్పినట్లు నాకు గుర్తు లేదు.
రాజ్యాంగపు చట్టాలు లేని రోజుల్లో మనుషుల మధ్య విలువలు ఉండేవి,
ఇప్పుడు ఆ విలువలను కాపాడుటకు చట్టాలు మాత్రమే ఉన్నాయి.
విలువలను కాపాడుటకు వ్యక్తులు మారకుండా..
వ్యక్తులను కాపాడుటకు చట్టాలు మారుస్తూ గడిపేస్తున్నాము...!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, July 13, 2018

"చెప్పుల"కున్న విలువ మనిషికి లేదా?




ఉదయం ఎనిమిది అయ్యింది. టిఫిన్ చేసి, పేపరు చదువుతున్నాను. ఇంతలో ఫోను మోగింది. ఒక మిత్రుడు .అవసరమైతే తప్ప కాల్ చేయని వాడి నుంచి ఫోను వచ్చిందంటే వెంటనే ఏదో పని చేసి పెట్టాల్సిందే అనుకుంటూ ఫోన్ ఎత్తాను. నిన్న నా కారుకి యాక్సిడెంట్ అయింది. కారు బాగా పాడైంది. ఇరవై వేలు ఖర్చవుతుందన్నారు. పదివేలున్నాయి... మిగిలినవి సర్దితే ఒకటో తేదీ ఇచ్చేస్తానుఅన్నాడు. ‘సరే ఇస్తాలే’ అని ఊరుకోకుండా  ఇన్సూరెన్స్ ఉంటుంది కదా?’ అనగానే- ఏడాదికి మూడు వేలు వృథా ఎందుకని చేయించలేదన్నాడు.

ముందే చేయిస్తే ఇంత ఖర్చుండేది కాదుగా?’ అంటే ప్రతిసారీ జరుగుతుందా? అయినా, నాకు ఈ ఇన్సూరెన్స్‌లు వేస్టనిపిస్తాయిఅన్నాడు. నాకు కోపమొచ్చి బండి కాబట్టి ఇరవై వేలతో పోయింది. అదే నీకేదైనా అయ్యుంటేఅనగానే అటునుంచి సౌండ్ లేదు.
        అప్పుడు నేను మనీ పర్స్అనే పుస్తకంలో ‘వంగా రాజేంద్రప్రసాద్ ‘ రాసిన ఓ విషయం చెప్పాను. ‘‘గుడి బయట చెప్పులు వదిలితే అవి పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్కు తీసుకోకుండా వాటిని రూపాయిచ్చి  దాస్తాం.

ఓ పావుగంట కోసం, అరిగిపోయిన చెప్పుల్ని అంత జాగ్రత్తగా బీమా చేసుకున్న మనం, విలువైన జీవితాన్ని బీమా చేయించడం మరిచిపోవచ్చా? మన జీవితం చెప్పుల కంటే హీనమైనదా?’’ అని! వాడికి జ్ఞానోదయమైనట్లుంది, ‘సాయంత్రం వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఆ పుస్తకం కూడా ఇవ్వరాఅంటూ ఫోను పెట్టేశాడు. పోన్లే ఇప్పటికైనా వీడు మారితే చాలనుకుని నా పన్లో నేను పడిపోయా!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, July 12, 2018

మిర్చిబజ్జీలు


వాతావరణం చలిచలిగా, మబ్బుమబ్బుగా, స్తబ్దుగా ఉంది.

ఇట్లాటి సమయాల్లో కవులు కవితలు రాస్తారు, నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు తినాలనిపించింది. ఈ
చల్లని సమయంలో 'మిరపకాయ బజ్జీలు తిననివాడు దున్నపోతైపుట్టున్!' అనే నాకు తెలిసిన న్యూనుడి నా ప్రక్కవారి కూడా నచ్చుటచే బజ్జీలకోసం  వేట ప్రారంభం అయ్యింది.


అసలు 'బజ్జీ' అన్న పేరే సెక్సీగా లేదూ! బజ్జీ లేని భోజనం కర్ణుడు లేని భారతంలాంటిదని నా నమ్మకం.
బజ్జీలు అనేక రకాలు - ఘాటైన మిర్చిబజ్జీలు, కమ్మటి వంకాయ బజ్జీలు, రుచికరమైన బంగాళదుంప బజ్జీలు,
మెత్తటి అరటికాయ బజ్జీలు, కరకరలాడే ఉల్లిపాయ బజ్జీలు.. ఇలా రాసుకుంటూ పోవచ్చు.

చదువుకొనే రోజుల్లో స్నేహితుల్తో సాయంకాలాలు మిరపకాయ బజ్జీలు తినడం, గోళీసోడా తాగుతూ కబుర్లు
చెప్పుకోవడం.. నిన్నమొన్నలా అనిపిస్తుంది. మిరపకాయ బజ్జీ నోట్లో కెళ్ళంగాన్లే రాముడులాంటివాడు
రావణుళ్లా వీరావేశంతో ఊగిపోయేవాడు.. మిర్చి ఘాటు ప్రభావం! కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం,అనుకూల, ప్రతికూల గ్రూపులు..అమెరికా ,రష్యా,అనుకూల, ప్రతికూల గ్రూపులు.. కపిలదేవ్, సిద్ధూ,గవాస్కర్, విశ్వనాథ్ క్యాంపులు.. సినిమాలు,….రోజూ చూసే  అమ్మాయిలు కాదేది వాదనకనర్హం?!   

ప్రక్కనున్న ఇద్దరు పిల్లలకి బజ్జీ విశిష్టతనీ, ప్రాచుర్యాన్నీ.. మరీ ముఖ్యంగా బజ్జీలకి నాయకుడైన మిర్చిబజ్జిగాడి రుచిని వివరించి.. ఓ రెండు మిర్చిబజ్జీలు ఆరగించితిని. కంట్లోంచీ, ముక్కులోంచి నీళ్ళు కారుతుండగా, నోరు
కారంతో మండిపోయింది. 'ఉఫ్ఫ్ ఉఫ్ఫ్' అనుకుంటూ, చల్లని నీళ్ళతో కడుపులో సంభవించిన అగ్నిప్రమాదాన్ని
నివారుస్తూ, కురుస్తున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా.  

అప్పుడు నా కంటపడిందో దారుణ దృశ్యం. ఇద్దరు పిల్లలు మిరపకాయ బజ్జీలని తోళ్ళూడగొట్టి, మిరపకాయల్ని వేరే
పేపర్లో  పడేసి, బజ్జీ పిండిభాగాన్ని చట్నీ తో నంజుకుంటూ -

" బజ్జీలు భలే బాగున్నయ్!" అన్నారు.

నా మనసు చివుక్కుమంది, గుండె బరువెక్కింది. మిరపకాయల్లేని ఆ శనగపిండి తోళ్ళని బజ్జీలంటారేమిటి!  పైగా
వాటి పక్కన రక్త పిశాచిలా భీతి గొలుపుతూ బోడి చట్నీ ఒకటీ ! ప్లేట్లో - తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు, రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల్లా దయనీయంగా పడున్నాయ్.

ఏమిటీ దుస్థితి? బజ్జీలని ఇలా హత్య చెయ్యొచ్చునా? తెలుగుభాష  కోసం ఉద్యమాలు చేస్తున్నారు,
తెలుగువంటకాల కోసం ఉద్యమం చేపట్టాలేమో! బజ్జీలు తిన్డం కూడా చేతకాని ఈ కొత్తతరం అజ్ఞానుల కోసం
కోచింగ్ సెంటర్లు అవసరమేమో!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card