Monday, November 27, 2017

విశ్రాంత ఉద్యోగస్తులు అందరూ ఒక సారి ఆలోచించండి



         ఉద్యోగ విరమణ చేసిన ప్రతి వ్యక్తి సుమారు 30 నుండి 36 సంవత్సరాల పాటు ప్రభుత్వం లేదా డిపార్టుమెంటుకి పనిచేసి, లేదా తన సేవలను అందించి ఆ తరువాత  విరమణ పొందుతాడు. అతని అన్ని సేవలకు ప్రభుత్వం లేదా డిపార్టుమెంటు పనిచేసే కాలంలో వేతనాన్ని జీతంగా అంద చేస్తుంది, దానినే ఆదాయం గా వ్యవహరిస్తారు  దాని పైనే ఆదాయ పన్నుకు బాధ్యులు గా చేస్తారు.
            కానీ పదవీ విరమణ తరువాత ,అతను అప్పటివరకు చాలా సంవత్సరాలు ,పనిచేసినందుకు, పనిచేసే సమయంలో ఒక ప్రభుత్వ ఖాతాలో తన భవిష్యత్తులో జీవనోపాధికి , ఒక వృద్ధాప్య నిధి గా  దాచుకున్న దానినుండి పెన్షన్ గా చెల్లిస్తారు.
     ఇక్కడ పెన్షన్పై ఆదాయపన్ను ఎందుకు చెల్లించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది ఏవైనా సేవలు లేదా పని చేస్తే వచ్చిన ఆదాయం కాదు. కనుక పన్ను ఉండక్కర్లేదు .ఇది చాలా సంవత్సరాల్లో తన పూర్తి కాలాన్ని మరియు యవ్వనాన్ని ప్రభుత్వం లేదా డిపార్టుమెంటుకు సేవ చేసిన ఉద్యోగికి ప్రభుత్వం లేదా డిపార్టుమెంటు భవిష్యత్తులో ముసలి వయస్సులో జీవనోపాధికి  భరోసా గా తగ్గించబడిన వేతనం.  అంటే వృద్ధులకి  ఇచ్చే జీవన బరోసా.
       అలాంటప్పుడు ఆదాయ పన్ను ఎందుకు. ఆలోచించండి, పెన్షన్పై ఆదాయపు పన్ను యొక్క లెవీని నిలిపివేయడానికి ప్రభుత్వం కు చేరేంతవరకు. ఈ విషయాన్ని మీరు ప్రశ్నించవచ్చు
        అతి కొద్దికాలము(సుమారు 5 సం.) పని చేసి అత్యంత ఎక్కువగా పెన్షన్ పొందుతున్న MPs & MLAs  నుండి దిగువస్తాయి ప్రజా సేవకులు లేదా ప్రజలచేత ఎన్నుకోబడిన వారి 'పింఛను పై లేని పన్ను 30 నుండి 36 సంవత్సరాల పాటు ప్రభుత్వం లేదా డిపార్టుమెంటుకి పనిచేసిన ఉద్యోగి పింఛను పై ఎందుకు ?. మీకు కరెక్టు అనిపిస్తే ప్రభుత్వానికి చేరేంతవరకు ప్రశ్నించవచ్చు
        పెన్షనర్ల కమ్యూనిటీ కి మరియు సివిల్ సొసైటీకి పై వాస్తవాలు తెలుసు అని అనుకుంటున్నాను

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card