Wednesday, November 01, 2017

"ఇండియా లో ఏమిటి లోపం".



"ఇండియా లో ఏమిటి లోపం".


           నాకు ఇండియా గురించి తప్పితే విదేశాల గురించి news paper , TV , పుస్తకాలు, ఇంకెవరైనా చెబితే  విని తెలుసుకోవడం తప్పితే వేరే రకంగా direct అనుభవం లేదు, తెలియదు. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎక్కడైనా మనుషులు మనుషులే. చిన్న చిన్న తేడాలతో అలవాట్లు ఒకటే. అయినా ఇప్పుడు నేను చెప్పబోయేది ఇండియా గురించే.
             ఒకప్పుడు అన్ని రకాలుగా విరాజిల్లిన ఇండియా ఇప్పుడు అతి పెద్ద పేద ప్రజలతో నిండిన దేశంగా ఎందుకు మారిపోయింది. స్వాతంత్రానికి ముందు జరిగిపోయిన గతం గురించి మాట్లాడటం లేదు. దాని తరువాత మన పరిపాలన వచ్చిన తరువాత విషయాలే మాట్లడుకుందాము. అందరూ మార్పు రావాలి అంటున్నారు. కానీ ఎందుకు మార్పు రావటం లేదు. ఎంతో మంది మేధావులు ఎన్నో రకాల సలహాలు ఇస్తున్నారు. Infrastructure లో invest చెయ్యండి. Judicial system మార్చండి ఇలాటివే ఎన్నో. కానీ గత 40 ఏళ్ళగా ఉన్న సమస్యలు ఇంకా resolve కాలేదు.  కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్న ఇండియన్ యువతకి ఇది ఎవరి  తప్పు,  ఎందుకు ఇలా ఉందో తెలియదు. ఇంతకు ముందు వ్రాసిన వాటిలో కూడా నేను చెప్పాను వీటికి solutions . కానీ అవి focussed గా చెప్పలేదోమోనని అనిపించి మళ్ళీ నా view of point  చెబుతున్నాను. ఇవి ఎంత వరకు ఆచరణ యోగ్యమో తెలియదుగానీ, ఇష్టం వుంటే
కష్టమేమీ కాదు
"ఇండియా కి pyscho therapy అవసరం ఎంతైనా ఉంది".
                          generation ఎలాగైనా ఉండనీ. కానీ రాబోయే generation ని సక్రమంగా ఆలోచించేలా చెయ్య గలిగితే మనం విజయం సాధించినట్టే. ఎదిగే పిల్లల మీద  ఇల్లు, స్కూల్, చుట్టుపక్కల సంఘం తాలూకు వాతావరణం ప్రభావం చూపిస్తాయి. ఈ generation కి pyschotherapy చెయ్యించ గలిగితే కనీసం వచ్చే generations కి మంచి ప్రపంచాన్ని ఇవ్వగలం. 
నేను అనుకుంటున్నవి ముందు points లా చెప్పి తరువాత detail చెప్తాను.
1 . education
విధానం మారాలి
2.
అన్యాయం ని సహించడం - neutral గా ఉండడం పోవాలి
3.
చిన్నప్పటి నించి మన పిల్లలకి కుల, మత తత్త్వం వంట పట్టించటం ఆపాలి.
1. education
విధానం మారాలి
                            schools లో చిన్నప్పటి నించి పిల్లల లోని సృజనాత్మకత చంపేసి, వాళ్ల ఎదుగుదల natural గా జరగకుండా తొక్కేసి, బెత్తాలతో బెదరించి పాఠాలు చెప్పి- marks , ranks వెనకాలే టీచర్స్, తల్లి తండ్రులు వెర్రెత్తిపోయి పిల్లలని బానిసలుగా మారుస్తున్నారు. ఈ schools లో పిల్లలు వాళ్ళ అభిప్రాయాలూ వ్యక్తం చెయ్యడానికి అనువుగా ఉండే పరిస్థితి ఉండదు. మన courses కూడా ఏ debate లేని  ఒక మూస teaching style లో ఉంటాయి. మన దేశం లో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఎవరూ చెప్పరు. ఇది ఇలాగే కొనసాగితే పిల్లలు వాళ్ళ view point develop చేసుకునే అవసరమే రాదు. భట్టీ వేసి ranks లో pass అయిపోతూ promote అయిపోవడమే. ముందు వాళ్లకి ఆలోచించడం నేర్పాలి, question వేసే freedom ఇవ్వాలి. సమాధానం వెతికే దారులు చూపాలి. అప్పుడు మంచి సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది. 
2.
అన్యాయం ని సహించడం - neutral గా ఉండడం పోవాలి
                            చిన్నప్పటినించి corruption చూస్తూ పెరుగుతారు. అది అలవాటు లోకి ఎంత sink అయిపోతుందంటే ,ఇది ఇంతే -అంటే ఇంతే, కామోసు అనుకుంటారు. నా చిన్నప్పుడు మా అమ్మ train  లో  టికెట్స్ తీసేటప్పుడు మాకు హాఫ్ టికెట్ తీసేది - -అయిదేళ్ళు దాటినా కూడా  - అడిగితె ఆవిడ ఆర్ధిక పరిస్థితి ఆవిడ వివరిస్తుంది. చాలా చోట్ల ఇలానే అందరూ. ఇలాటి చిన్న చిన్న మోసాలు ఇక్కడ, అక్కడ పిల్లలకి ఒక రకమైన అన్యాయాన్ని చూసీ చూడనట్టు పోవడం నేర్పిస్తుంది. ఇంతమంది politicians , bureaucrats దేశాన్ని ఇంతలా దోస్తున్నా చూసేంతలా. అది మారాలి, అంటే మన ఇళ్ళల్లో పెద్దలు నేర్పే విద్యా బుద్ధులు, పద్ధతులు మారాలి.
3.
చిన్నప్పటి నించి మన పిల్లలకి కుల, మత తత్త్వం వంట పట్టించటం ఆపాలి.
                     అంటరాని తనం నేరం  - చిన్నప్పుడు మా తెలుగు వాచకం వెనకాల ఇలా అచ్చు వేసి ఉండేది. మా టీచర్ని నేను అడిగాను. టీచర్ ఇదేమిటని. నెత్తి మీద duster తో కొట్టింది. ఇంకా ఎవరినైనా అడగాలంటే భయం వేసింది. తరువాత ఊహతో పాటు జ్ఞ్యానం కూడా పెరిగిన తరువాత అర్ధం అయ్యింది. ఇంకా  వేరు వేరు కుటుంబాలలో జరిగే మత పరమైన పండగలు పబ్బాలు అవీ, ఎందుకు వేరు అన్న విషయం తెలపకనే తెలుపుతాయి. ఇప్పుడు జరిగే ఈ elections లో కులాల, మతాల propaganda ఏమిటో అందరూ చూస్తూనే ఉన్నారు. కాలేజీ లో  basis లో కొట్టుకు చచ్చే వారు. నీ కులమేదైనా వేరే కులాన్నినీ మతమేదైనా కానీ వేరే మతాన్ని అసహ్యించుకోవటం ఆపేయాలి. నువ్వు ఆపాలి. నీ పిల్లలకి ఆ ఊసు, ఊహ రానీయకు. కనీసం వాళ్ళు కొంత ద్వేషరహిత సమాజంలో బ్రతుకుతారు. మనిషిని మనిషిలా చూస్తారు.
నేను పైన చెప్పినవనీ మనం చెయ్యగలమనే అనుకుంటున్నా. అందరూ చెయ్యగలిగితే అప్పుడు performance base లో election results ఉంటాయి. Governance మారుతుంది. Automatically changes in rest of the  things will follow .


ఈ సారి నేను చాలా clear గా నాకు అనిపించిన solution based approach చెప్పాననుకుంటాను. 
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card