GST విధానంలో లెక్కలు అన్నీ దాదాపుగా VAT లో ఉన్న విధంగానే ఉంటాయి. ఖరీదు - అమ్మకం మధ్యన
ఉన్న వ్యత్యాసం పైననే పన్నును నిర్దేశించిన విధంగా కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును
ప్రతి నెలా GST కౌన్సిల్
నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు
గురికావాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించుట అత్యంత ప్రమాదం.
నిర్ణీత పన్ను చెల్లింపులు అన్నీ బ్యాంక్ ద్వారాగానీ, E-బ్యాంక్ ద్వారా గానీ, ఆన్ లైన్ ద్వారాగానీ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారాగానీ మాత్రమే
చెల్లించాలి. నగదు, చెక్కులు,
డ్రాఫ్టులు చెల్లవు.
VAT విధానంలో
ప్రతినెలా జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెలచివరలో ఒకేసారి VAT200 ద్వారా తెలిపేవారు. కానీ GST విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు వెనువెంటనే
అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్, ఇంటర్ నెట్, ఇన్వర్టర్, స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా
కలిగియుండాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment