"నరాలు జివ్వున లాగే గొప్ప అనుభవాన్ని స్త్రీ మనకిచ్చినప్పుడు, ఆ అనుభవం తర్వాతి అనుభూతిని హాయిగా నెమరవేసుకుని అమరత్వం పొందే ఆ కాన్షస్నెస్ని అద్భుతంగా చెప్పగలిగితే, అది సాహిత్యం ఎందుక్కాదు...?" అని ప్రశ్నించి మరీ కవితలు రాసేస్తే, ఆ భావప్రవాహాన్ని సాహిత్యం అనకుండా వుండగలమా!
"మనిషీ కావాలి...
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"
కవిత్వాన్ని ఎందుకు రాస్తారో నాకు తెలీదు.అపుడప్పుడూ కవితల పేరుతో నేనూ పదాలు అల్లినా, ప్రాసల్ని గిల్లినా అదొక ప్రయత్నంగా మిగిలింది. కొన్నిట్లో అసాధారణమ్,మరికొన్నిట్లో సాధారణత్వం చూసి మురిసిపోయాను. భావగర్భిత ఉద్వేగాలు కొన్ని కవితల్లో చవిచూస్తే, మరికొన్ని కవితలు వేదనావేదనల్ని పదాల్లో కూర్చగా చదివాను.కానీ ఇప్పటివరకూ ఎక్కడా చాచి లెంపకాయకొట్టినట్లు షాక్ ఇచ్చే కవితల్ని చదవలేదు.ఈ మధ్యనే ఒక స్నేహితుడిపుణ్యమా అని అలాంటి కవితా సంకలనాన్నొకటి దక్కించుకుని, కొన్ని బలమైన లెంపకాయల్ని ప్లెజంట్ గా షాకింగ్ గా తిన్నాను. Its an outrageous poetry that I have ever read in Telugu.
అదే "లెట్ మి కన్ఫెస్" అనే పుస్తకం. 'పసుపులేటి పూర్ణచంద్ర రావు' రాసిన కవితల సంకలనం. మంగళవాక్యాలు పాడేసిన తరువాత వరుసగా మనసుతడిని, యవ్వనపు చిత్తడిని, స్త్రీపురుషుల కాంప్లెక్స్ బంధాల కథాకమానిషుని ఆద్యంత్యం అద్భుతంగా, ఆలోచనాత్మకంగా, అబ్బురపడేలా కవిత్వించేశారు.
పబ్లిషర్ : ELMO BOOKS ధర: Rs 75/-ప్రతులకు : విశాలాంధ్ర, నవయుగ పుస్తకాలయాలు అని కాకుండా ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలంటే మొత్తం సంకలనాన్నిక్కడ మక్కీకి మక్కీ దింపాలి. ఎందుకంటే, ఇందులోని ఏ కవితా స్వయం సంపూర్ణం కాదు. మొత్తం సంకలనం కూడా స్వయంప్రకాశకం కాదు. జీవితాన్ని మధించకపోతే, ముందుగా కొంత యోగం పొందకపోతే ఈ భోగం అర్థం కాదు. కవి జీవితంలోని లోతుల్ని కూసింతైనా మనజీవితంలో అనుభవించకపోతే లేక కనీసం కనీవినకపోతే obscene ideas of perversion లాగా అనిపిస్తాయే తప్ప అక్కునచేర్చుకుని ఆదరించదగ్గ అద్భుత కవితల్లా కనిపించవు. అందుకే, simply outrageous అనాల్సొచ్చింది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment