Monday, June 12, 2017

మా మనో భావాలు గాయపడ్డాయి




టీవీ ప్రకటనల్లో మొన్న ఓ  సినిమా చూస్తూ ఒక విపరీతం చూశాను. హీరో ఏమో విపరీతమైన ఆవేశంలో వున్నాడు. అంతెత్తున ఆకాశంలోకెగిరి మరీ ప్రత్యర్థులను చంపుతున్నాడు. సరిగ్గా హీరో అలా ఆకాశంలో వున్నప్పుడు అతన్ని అక్కడే వుంచేసి “Tide” అతని చొక్కాని తెల్లగా మార్చేసి “Tide” వాడమని చెబుతుంది. థూ ఇంతకంటే దరిద్రంగా సినిమా చూడలేమేమొ! సినిమా ఎలాగూ దరిద్రంగా వుంది గనుక సరిపోయింది.
మరో విపరీతం ఏమిటంటే ఒక సినిమాలో ఒక పాత్ర చేసిన దాన్ని మొత్తం కులానికో వర్గానికో ఆపాదించుకొని దుమారం లేపడం. సినిమా అన్నాక అందులో సమాజంలో వున్నదంతా వుంటుంది. శూద్రుడూ వుంటాడు, బ్రాహ్మణుడూ వుంటాడు. ప్రేమించడమూ వుంటుంది, వ్యభిచారమూ వుంటుంది. అవి ఆయా పాత్రలు చేసినట్టుగా భావించాలే గానీ మొత్తం వర్గానికీ ఆపాదించుకుంటే ఎలా? అయితే సినిమా తీసేవాళ్ళు భావోద్వేగాలని దృష్టిలో పెట్టూకొని విపరీతాలకు పోకుండా వుంటే మరీ మంచిది. ఇప్పుడు ఇది ముదిరిపోయింది. మమ్మల్ని హీనం చేశారు లేదా మమ్మల్ని హేళన చేశారు. ఒక వర్గంలో ఒకరిద్దరు చేసే పనులే వర్గం మొత్తానికి చెందనప్పుడు, ఒక సినిమాలో ఒక పాత్ర చేష్టలు ఒక వర్గం మొత్తానికి ఎలా చెందుతాయి!
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card