భారతదేశం లో మొబైల్ - పరిపాలన
ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే మన కళ్ల ముందే ఎన్నో మార్పులొచ్చాయి. దూర ప్రాంతాలకు ఫోన్ చేయాలంటే 20 ఏళ్ల కిందట టెలిఫోన్ ఎక్స్చేంజిలకు వెళ్లి చేయాల్సి వచ్చేది. ట్రంకాల్ మాట్లాడాలంటే ఊరు అదిరిపోయే గొంతుతో మాట్లాడాల్సి వచ్చేది. ఆ తరువాత పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు వచ్చాక సులభమైంది. కాయిన్ బాక్సులు వచ్చాక ఇంకా సులభమైంది... మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయింది. స్మార్టు ఫోన్లు వచ్చాక సర్వం మారిపోయింది. స్మార్టు ఫోన్ల రాకతో చివరకు కంప్యూటర్ల విక్రయాలు కూడా సగానికి తగ్గిపోయి మైక్రోసాఫ్టు వంటి సంస్థలకే వ్యాపారం తగ్గిపోయింది. ఇక స్మార్టు ఫోన్లలో తీసుకుంటే ఆండ్రాయిడ్ ఒక్కో వెర్షన్లో కొత్తకొత్త ఫీచర్లు వస్తుండడం.. డాటా వేగం పెరుగుతుండడంతో రోజురోజుకీ మార్పులొస్తున్నాయి. 2జీ... 3జీ.. నుంచి 4జీ వేగంలోకి రావడానికి ఎంత కాలం పట్టింది? యుగాలేమీ పట్టలేదు. అంతా రెండుమూడేళ్లలోనే జరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా యాక్సెస్ చేయని కుర్రకారు ఇండియాలో ఏమూల వెతికినా కనిపించరు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో కనిపించని వారు ఉండనే ఉండరు. వాటితో విసిగిపోయి దూరం జరిగినవారు ఉన్నారేమో కానీ... వాటి గురించి ఏమాత్రం తెలియనివారు మాత్రం ఉండరేమో. టెక్నాలజీ ఇంతగా ఆకర్షిస్తూ... ఇంతగా ప్రపంచ సమాచారాన్ని అందిస్తూ.. వినోదం కలిగిస్తూ ఉన్నప్పుడు అది కల్పించే నగదు రహిత్య సౌలభ్యాన్ని మాత్రం ప్రజలు ఎందుకు వదులుకుంటారు. కావాల్సిందంతా కొత్తవారికి అది ఒకసారి అలవాటు కావడమే... అందులో నష్టమేమీ లేదన్న భరోసా దొరకడమే
ఈ రోజు మొబైల్ ఫోను, కేవలం వాక్యాలను మరియు మాటల ద్వారా సమాచార సంబంధం కల్పించే వస్తువు గా లేదు. ఇది పట్టణ ధనికులు మరియు పల్లె పేదల మధ్య ఉన్న అంకెల అంతరాన్ని తొలగించడంలో ఒక దృఢమైన సాంకేతిక విజ్ఞానంగా అవతరించింది. భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, అందరికీ చేరువు అయ్యింది. ఇంకొక వైపు, యువతకు, ప్రత్యక్షంగానూ, మరియు పరోక్షంగాను లక్షలాది ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.
తన అభివృద్ధి పధంలోని రెండవ దశలో, వివిధ రకాల సేవలకు ఇది ఒక బట్వాడా మాద్యమంగా అవతరించింది. ఎవరైనా తమ మొబైల్ ఫోను ను ఉపయోగించి, తమ బ్యాంకు ఖాతాలోని సోమ్మును వేరొక బ్యాంకు ఖాతా లోనికి బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ సంస్ధలు మరియు ప్రైవేట్ సంస్ధలు కూడ తమ పౌర సేవలు మరియు వ్యాపార సేవలను సామాన్య మానవునికి మొబైల్ ఫోను ద్వారా అందజేయడం మొదలు పెట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాణిజ్య బ్యాంకుల సేవలను మొబైల్ ఫోను ద్వారా అందజేయడానికి ఒప్పుకుంది. అదే విధంగా భారత ప్రభుత్వం, మంత్రిత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి చేసిన మొబైల్ ఫోను ద్వారా ఆర్ధిక సేవలు, సంక్షేమ పధకాలు లాంటి వాటి బట్వాడా ను అంగీకరించింది. 3 జి మరియు 4 జి సాంకేతిక పరిజ్ఞానం, భారతదేశంలో ప్రారంభమైన తరువాత వినియోగదారులు, ఆరోగ్య, విద్య, వ్యవసాయం, సమాచార సేవలను తమ మొబైల్ ఫోను ద్వారానే అందుకోగలుగుతున్నారు.సినిమాలు,లెక్కలు,పాటలు, కవితలు, నోట్స్, చిట్కాలు, పరిష్కారాలు, సలహాలు, ఇలా మొబైల్ లో లేని రంగం లేదు
దాదాపు అన్ని ప్రభుత్వ ప్రవేటు రంగాలు OTP విధానం ద్వారా మొబైల్ ఉపయోగించి లావాదేవీల రక్షణ ,దృవీకరణ పెరిగింది
ఇప్పుడు మొబైల్ లేకపోతే మన చుట్టూ వున్న ప్రపంచంలో మనం లేనట్లే. మన దినసరి కార్యక్రమాలు ని శాసించేది మొబైల్స్
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:
Post a Comment