Thursday, March 28, 2019

ఆర్ధిక వ్యవస్ధకు యుగాంతం ప్రమాదం!



               క్రైస్తవులకు చివరి గ్రంధం అయిన బుక్ ఆఫ్ రివలెషన్ (ప్రకటనల గ్రంధం) లో యుగాంతం గురించి చెప్పబడి ఉంటుంది. ఇందులో యుగాంతపు నాలుగు గుర్రపు రౌతుల గురించిన వివరణ ఉంటుంది. ఈ నాలుగు గుర్రాల రాక యుగాంతాన్ని సూచిస్తుందని క్రైస్తవుల నమ్మిక. ఆ నాలుగు గుర్రాలు: విజయం (Conquest), యుద్ధం (War), కరువు (Famine), చావు (Death). ఈ నాలుగింటిని యుగాంతపు నాలుగు గుర్రపు రౌతులు (ద ఫోర్ హార్స్ మెన్ ఆఫ్ అపోకలిప్స్)  అంటారు.
          మానవ ప్రపంచానికి ఈ నలుగురు / నాలుగు అంశాలు యుగాంతాన్ని సూచించినట్లే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి వచ్చే ఆర్ధిక సంవత్సరంలో నాలుగు ప్రధాన గండాలు యుగాంతం తరహా పరిస్ధితిని చవి చూపుతాయని ప్రధాన ఆర్ధిక సలహాదారు తన తాజా ఎకనమిక్ సర్వే లో హెచ్చరించారు.
         ఏటా బడ్జెట్ ప్రకటనకు ముందు విడుదలయ్యే ఎకనమిక్ సర్వే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి (జి‌డి‌పి గ్రోత్ కి) నాలుగు పెద్ద గండాలు ఉన్నాయని హెచ్చరించింది. భారత దేశానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు (చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) రచించిన ఎకనమిక్ సర్వే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పుకుంటున్న ఆర్ధిక గొప్పలను పరిహాసం చేసినంత పని చేసింది.
             గండాలు ఉన్నాయని ఓ పక్క చెబుతూనే వచ్చే యేడు భారత ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం కంటే ఎక్కువగా 7% నుండి 7.5% వరకు వృద్ధి నమోదు చేస్తుందని సర్వే అంచనా వెయ్యడం గమనార్హం. ఆర్ధిక విశ్లేషణ ఒకింత వాస్తవ పంధాలో సాగినా ఫలితాన్ని మాత్రం మోడి-జైట్లీ గొప్పలకు భిన్నంగా పోయే సాహసం చేయలేకపోయింది. అది సలహాదారుకు ఉండే పరిమితి అని సరిపెట్టుకోవాలి కాబోలు!
ఎకనమిక్ సర్వే సూచించిన నాలుగు గండాలు ఇవి:
  • గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా తగులుతున్న ఎదురుదెబ్బల వల్ల ఎగుమతి అవకాశాలు తగ్గిపోవడం
  • వనరులను తక్కువ ఉత్పాదకత నుండి అధిక ఉత్పాదకత వైపు తరలించడమ్ లో ఎదురయ్యే ఇబ్బందులు
  • టెక్నాలజీ-తీవ్రత ,  ఆ రంగం డిమాండ్లకు అనుగుణంగా మానవ పెట్టుబడిని ఉన్నతీకరించడంలో ఎదురయ్యే సవాళ్ళు
  • వాతావరణ మార్పు వల్ల కలిగే వ్యవసాయ ఒత్తిడిని ఎదుర్కోవలసి రావడం
          ఈ నాలుగు అంశాలు భారత జి‌డి‌పి వృద్ధిని దిగదోస్తాయని ఆర్ధిక సర్వే అంచనా. ఇవి సర్వే కొత్తగా కనిపెట్టినవేమీ కాదు. గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనించిన వారికి ఇవి స్పష్టంగా కనిపించినవే. స్పష్టంగా కనిపించిన వాటిని సర్వే ఆర్ధిక పరిభాష వెనుక నర్మగర్భంగా దాచిపెట్టి ఉంచాడు. తద్వారా ప్రమాదాన్ని తేలిక చేసేందుకు విఫల యత్నం జరిగినట్లు కనిపిస్తోంది.
మరోసారి వీలు దొరికినప్పుడు ఈ నాలుగింటిని కాస్త వివరంగా చూద్దాం.

------------ ధరణికోట సురేష్    
కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681



Monday, March 25, 2019

“Protagoras paradox”


Protagoras paradox….అంటే ఏమిటో తెలుసా?********
**************అనగనగా ఒక పేద విద్యార్ధి ఉండేవాడు.
అతనులాచదువుకోవడంకోసం,ఓ ప్రొఫెసర్ గార్ని ఆశ్రయించాడు.
ఫీసేమ్మిచ్చుకోగలవని అడిగాడు ప్రొఫెసర్..
తన మొట్టమొదటి కేసు కనుక నెగ్గితే,దాంతో వచ్చిన డబ్బుతో ఫీసు ఇచ్చుకుంటానని,ప్రొఫెసర్ తో డీల్ సెటిల్ చేసుకున్న విద్యార్ధి తన చదువు పూర్తి చేసుకున్నాడు.
ఎన్ని సార్లు అడిగినా ,తనకు ఒక్క కేసు కూడా తగల్లేదని , ఎప్పటికీ తన బాకీ తీర్చకపోవడంతో ,విసుగు చెందిన ప్రొఫెసర్
కోర్టులో బాకీ వసూలు కేసు వేసాడు..
ఇద్దరూ లాయర్లే అవడంతో వాళ్ళ వాదనలు వాళ్ళే జడ్జి ముందు ఇలా వినిపించారు

ప్రొఫెసర్:-నేను కనుక ఈ కేసు నెగ్గితే, లా ప్రకారం నా సొమ్ము నాకు చేరాలి. ఒకవేళ ఓడిపోతే,వాడు గెలిచాడు కాబట్టి, మా అగ్రిమెంట్ ప్రకారం, వాడు నా సొమ్ము చెల్లించాలి..
ఎలా చూసినా నా సొమ్ము నాకుచేరాల్సిందే….

విద్యార్ధి:-నేను ఈ కేసు నెగ్గితే లా ప్రకారం నేను ఆయనకు ఏమివ్వక్ఖర్లేదు.ఒకవేళ ఓడిపోతే, మా అగ్రిమెంట్ ప్రకారం, నేను ఆయనకు ఏమీ ఇవ్వక్ఖర్లేదు.
ఎలా చూసినా నేను ఆయనకు ఏం ఇవ్వనవసరం లేదు

ఇప్పుడు చెప్పండి.. తర్కపరంగా(logically) ఎవరు ఒప్పో….ఎవరు తప్పో…..
ఈ సంఘటన నిజంగా జరిగింది.. పురాతన గ్రీకు చరిత్రలోఇప్పటికీ పరిష్కారం దొరకని కేసుగా చరిత్రలో మిగిలింది..
ఆ లాయర్ ప్రొఫెసర్ పేరు.. ప్రోటగోరస్
ఆ విద్యార్ధి పేరు..యూథోలస్
This is known as Protagoras paradox….

ఎలక్షన్ కోడ్ ప్రకారం బిజినెస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఎలక్షన్ కోడ్ ప్రకారం బిజినెస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1 . బ్యాంకు లో కాష్ లక్షకు మించి డిపాజిట్ చేస్తే, ఆ ఇన్ఫర్మేషన్  ఇన్కమ్ టాక్స్  డిపార్ట్మెంట్ కి వెళ్తుంది.. బ్యాంకు వాళ్ళు ఆ డిపాజిట్ కి ‘సోర్స్ ‘ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయ్..
2 . బ్యాంకు లో కాష్ లక్షకి మించి withdraw చేస్తే, బ్యాంకు వాళ్ళకి  మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది.. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్కమ్ టాక్స్ డిపార్మెంట్ కి వెల్తది..
3 . కాష్ తో ట్రావెల్ చేసేవాళ్ళు, ఆ కాష్ కి ప్రూఫ్ ఉంచుకొని ట్రావెల్ చేయండి.. ప్రూఫ్ లేకుండా చేస్తే పోలీసు లేదా రెవెన్యు లేదా  ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉన్నాయ్..
4 . గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు, ట్రావెల్ చేసేప్పుడు ఆ గోల్డ్ కి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకువెళ్ళండి..
5 .సోర్స్/ ప్రూఫ్స్ లేకుండా కాష్/ గోల్డ్/ఇతర విలువైన వస్తువులు తీసుకువెళ్తూ పోలీసు లేదా రెవెన్యు లేదా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చిక్కితే కనుక వాటిని సీజ్ చేయడానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి..

ఈ యాభై రోజులు జాగ్రత్తగా ట్రాన్సక్షన్స్ చేసుకోండి.. ఇబ్బంది పడకండి

Saturday, February 02, 2019

వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితి పెరగలేదు... శ్లాబులూ మారలేదు!


వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితి పెరగలేదు... శ్లాబులూ మారలేదు!
      --------------
- వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి ప్రకటన చేస్తూ ఆర్థిక మంత్రి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని అన్నారు.పన్ను రిబేటును అయిదు లక్షల వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, గోయల్ వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో మార్పులు చేయలేదు.
శ్లాబులు కూడా మార్చలేదు. పెంచిదల్లా రిబేటు పరిమితి మాత్రమే.

ఏమిటీ రిబేటు మతలబు?
ఇది తెలియాలంటే.. ముందుగా మనం ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అది పన్ను చెల్లించాల్సిన ఆదాయం.

- అంటే, మొత్తం ఆదాయం నుంచి 80C,80డి వంటి సెక్షన్ల కింద పన్ను రాయితీలు పోగా.. మిగిలిన ఆదాయాన్ని పన్ను చెల్లించాల్సిన ఆదాయం అంటారు.
- ఇప్పుడు ఆదాయపు పన్ను పరిమితి పెంచకుండా రూ. 5 లక్షల మాటేమిటి? అనే విషయాన్ని వద్దాం.

తాజా బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరగలేదు. అయితే, పన్ను చెల్లించాల్సిన ఆదాయం అయిదు లక్షలోపు ఉన్నవారికి కొత్త బడ్జెట్ వల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
పన్ను చెల్లించాల్సిన ఆదాయం అయిదు లక్షలు దాటిన వారికి మాత్రం రూ. 12,500 పన్ను రిబేటు వర్తించదు.

పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ. 5 లక్షల కన్నా ఒక్క రూపాయి ఎక్కువున్నా, వారు రూ. 12,500 చెల్లించాల్సిందే. రూ. 5 లక్షల మీద ఉన్న ఆదాయానికి ప్రస్తుత రేట్ల ప్రకారం 20 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సిందే.అంటే, రూ. 5 లక్షల ఆదాయం దాటిన వారికి కొత్త బడ్జెట్ ప్రకారం పాత రిబేట్ వర్తించదు. సింపుల్‌గా చెప్పాలంటే అయిదు లక్షలకు మించి పన్ను చెల్లించే ఆదాయం ఉన్నవారికి ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.వారికి పన్ను పరిమితి.. పన్ను శ్లాబుల్లో ఏమాత్రం తేడా ఉండదు.
- తాజా బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం, 87A కింద టాక్స్ రిబేటును అయిదు లక్షలకు పెంచారు. దీని వల్ల రూ. 12500 పన్ను ప్రయోజనం ఉంటుంది.
- అయితే ఇది అయిదు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుంది.
- అయిదు లక్షల తర్వాత ఒక్క రూపాయి అదనపు ఆదాయం ఉన్నా రూ.12500 పన్ను కట్టాల్సిందే.
- గతంలో ఈ రిబేటు మూడున్నర లక్షల ఆదాయం లోపువారికి (రూ.2500) వర్తించేది. అంటే కొత్తగా అయిదు లక్షలోపున్న లక్షన్నరకు రిబేటు ప్రకటించారు.

ఓ ఉదాహరణ చూద్దాం.(సర్ చార్గీ లేకుండా )
పన్ను చెల్లించాల్సిన ఆదాయం(రూ.) 3 లక్షలు  వుంటే గతంలో నూ ఇప్పుడూ పన్ను లేదు-3.5 లక్షలైతే ప్రస్తుతం 2500, కొత్తది  0-
5 లక్షలు అయితే ప్రస్తుతం 12500 ,కొత్తది  0-6 లక్షలు అయితే,ప్రస్తుతం 32500, కొత్తది  32500

పై ఉదాహరణ ప్రకారం.. కొత్త బడ్జెట్ ప్రకారం అయిదు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపులో ఏమీ తేడా లేదు.

కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. అయిదు లక్షలలోపు వేతనం పొందేవారికి 13వేల దాకా పన్ను ప్రయోజనం చేకూరుతుంది.
 (ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్‌ను 40,000 నుంచి 50,000కు పెంచారు. దీని వల్ల 500 దాకా అదనపు పన్ను ప్రయోజనం ఉంటుంది.)

ఇంకో ఉదాహరణ చూద్దాం

ఉదాహరణకు.. వార్షికాదాయం వార్షికాదాయం రూ.7 లక్షలున్న వ్యక్తి ఎంత పన్ను చెల్లించాలో చూద్దాం. ఇక్కడ కేవలం సెక్షన్ 80సి రాయితీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తున్నాం. (ఇతర రాయితీలు వర్తించే వారు వాటినీ యాడ్ చేసుకోవచ్చు.)

మొత్తం వార్షికాదాయం రూ. 7 లక్షలు
80సీ కింద 1.50 లక్షలు తీసేద్దాం.
మిగిలింది. రూ. 5.50 లక్షలు. ఇది పన్ను చెల్లించాల్సిన ఆదాయం అవుతుంది.
దీనికి ఎంత పన్ను పడుతుందో చూద్దాం.

- 2.5 లక్షల వరకు పన్ను 0
- అయిదు లక్షల లోపు 2.5 లక్ష లకు పన్ను 5 శాతం అంటే రూ. 12,500
- 5.50 లక్షల్లో 5 లక్షలు పోతే.. మిగిలిన 0.5 లక్షలు 20 శాతం శ్లాబులోకి వస్తుంది.
- అంటే, దీనికి 15 వేలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- మొత్తం లెక్కిస్తే.. రూ7 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి 80సీ మాత్రమే క్లెయిమ్ చేస్తే 27500  పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సర్ చార్గీ 4% అదనం
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681

Address for Communication

Address card