Thursday, January 12, 2017

ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా




ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా

                నేను ఫెమినిస్టుని. కాదుగానీ.. ఫెమిన్ -ఇష్టున్ని’!.పూర్తిగా నిజం కాదు గానీ ఖచ్చితంగా అబద్ధం కూడా కాదు. నాకు స్త్రీత్వంమ్మీద విపరీతమైన ఇష్టం, గౌరవం. అంతకుమించిన ప్రేమ. నేను అందాన్ని ఇష్టపడతాను. (తప్పేం లేదు. అది ఎస్తటిక్ సెన్స్.. అంతే!!). మరో దురుద్ధేశ్యం లేకుండా. అవకాశం వుంటే (నొచ్చుకోకుండా) వాళ్లు ఎలాగయితే ఇంకా బాగుంటారో చెప్తాను.

               పోతన తన భాగవతంలో ప్రహ్లాదుని గురించి కన్ను దోయికి అన్య కాంత లడ్డం బైన మాతృ భావము చేసి మరలువాడుఅని చెప్తాడు. ఇంకెలా చూస్తాడుట పంచశరద్వయస్కుడూ.. బాలుడు…!! (5 ఏళ్ల కుర్రకుంక) (సరే సరేసందర్భం చీర నుంచి పారిపోయినట్లుంది. చీర కట్టిన చినదాన్ల గురించి పోతోంది. వదిలేసి చీరల దుకాణంలోకి వద్దాం.

 చీర సొగసు చూడ తరమా?” శీర్షికతో కొన్ని పద్యాలు.

       చీర .. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ సంప్రదాయపు వస్త్రాలంకరణ. వనితను నిలువెల్లా కప్పి ఆమెను దాచిపెట్టి, పెట్టకుండా మరింత అందంగా చూపిస్తుంది. ఈరోజుల్లో అమ్మాయిలు మరీ మాడర్న్ ఐపోవడంతో చీర కట్టడం  చాలా తగ్గించారు/ మానేసారు అని అంటారు కాని పెళ్ళిళ్లకు వెళ్లి చూడండి. రంగు రంగుల, తళుకు బెళుకుల చీర కట్టిన అమ్మాయిలతో కళకళలాడిపోతూ ఉంటుంది. నాడైనా, నేడైనా, భారతీయ వనితలకు మరింత వన్నె తెచ్చేది మేలైన చీర. ఎంత అభివృద్ధి చెందినా , ఎన్ని ఆధునిక వస్త్రధారణలైనా ఈ చీరకున్న గొప్పదనం చెక్కుచెదరనిది. అందుకే ఈ చీర అనే అంశం మీద ఆచార్య ఫణీంద్ర, టేకుమల్ల వెంకటప్పయ్య, రవి, అనిల్ మాడుగుల, జె.కె.మోహనరావుగార్లు ఎంతో అందమైన పద్యాలు వివిధ అంశాలతో జోడించి రాసారు. కానీ ఈ పద్యాలను విశ్లేషించిన బ్నింగారు మాత్రం చీరను మరో కొంటెకోణంలో చూపించారు. ఎంతైనా బ్నింగారి స్టైలే వేరు కదా..  అందుకే  చీర అందాలను మరింత అందంగా కంద పద్యాలలో చూపించారు.

        ఇక ఇంట్రస్టు వుంటే చీర మీద పద్యాలు కూడా చదవండి.వ్యాసం నిడివి ఎక్కువ అవుతుందేమోనని ఎక్కువ ఇవ్వటంలేదు



‘బ్నిం’ కందాల్లో అందాలు :



శారీ బ్లౌజుల నడుమన

వేరే ఆచ్చాదనమ్మువేయక, మెరిసే

నారీ నడుముల మడతల్

వారెవ్వా చూపుచుండు వరములె చీరల్.


డా.అనిల్ మాడుగుల:

భారత యంగనామణి   శభాషని మెచ్చెడు సంప్రదాయమొ

ప్పారగ కుంకుమాంకిత శుభావహమౌ వదనారవిందయై

చీరనుగట్టి లక్ష్మి కళ జిల్కుచు కన్పడు నెల్లవారికిన్

గౌరవభావమున్ కరయుగమ్ములుమోడ్చి నమస్కరింపగన్



 డా.ఆచార్య ఫణీంద్ర ఆటవెలది:

వయసు వచ్చినట్టి పడుచు పిల్లల ఓణి

కొంగు నిలువదాయె కోర్కె లూర!

వచ్చు వాడెవండొ వాని స్పర్శ  యదేమొ

కొంగు తడిమి చూపు పొంగులందు!

(యవ్వనంలో శృంగార రసం)


టేకుమళ్ల వెంకటప్పయ్య: తేటగీతి

పసిడి రంగుల బూసలు బచ్చమణులు

ఇంపు సొంపుగ పుట్టించి కెంపులీను

వర్కు చీరల ధరియించు వనిత లిపుడు

అంద మొప్పార శోభల నందుకొనరె!


                      ఈ అబ్బాయిలున్నారే …  మరీ  కొంటెవారు.. శారీ, బ్లౌజుల మధ్య మెరిసే ఆ యింతి నడుము మడతలు  మామూలుగా కాక ఒక వరములా కనువిందు కలిగించడానికి తోడ్పడుతాయట చీరలు!  ఈనాడు అమ్మాయిలు ధరించే మాడ్రన్ డ్రెస్సులకన్నా చీరయే మరింత సొగసైనది. అందమైన చీర కట్టుకున్న ఇంతి ముందుండగా కదులుతున్న ఆమె చీరకొంగును చూసి గుండె ఝల్లుమన్న పోకిరీలు టీషర్టు, జీన్సుల అమ్మాయిలను కన్నెత్తైనా చూడనంతగా మైమరచిపోతున్నారట. ఒంటినిండా కప్పే ఆరు గజాల చీర అతివ అందాలను దాచీ దాచకుండా, చూపి చూపకుండా ఆమె ఒంపుసొంపులను మరింత సోయగంగా చూపించే అద్భుతమైన కాస్ట్యూమ్ ఈ చీరకాక మరింకొకటి కలదా అని అంటున్నారు బ్నింగారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన సత్యమే కదా.. అందుకే అందీ అందని జాబిల్లి అంటారు ఇటువంటి వాళ్లని. ఇప్పటికైనా అబ్బాయిలు ఈ మాటలను మరోసారి తప్పక మననం చేసుకొంటారు.






                    అసలే అందమైన అమ్మాయి. మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె ఉన్నతంగా అలా నడిచివస్తుంటే, చుక్కలన్నీ రాలి ఆమె చీర కొంగులో ఒదిగిపోగా, మలయమారుతంలా ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా తరమా?

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681




Wednesday, January 11, 2017

“పొన్నూరు లో ఉన్న విగ్రాహాలకి ఓ సరదా కధవుంది తెలుసా మీకు”




ఎప్పుడూ కూడికలు,తీసివేతలు వేసి వేసి విసుగొచ్చేసింది,కాసేపు ఏదన్నా
చదువుదామని అరమరలో వెదికితే ,తిలక్ వ్రాసిన “అమృతం కురిసిన రాత్రి” కనిపించింది.ఇప్పటికే చాలా సార్లు చదివా,అయినా ఇంకోసారి చదవాలనిపించింది. చదవడం మొదలు పెట్టీపెట్టకుండానే ఒక ‘కాలకేయుడు’ వచ్చాడు.కాలకేయుడని ఎందుకాన్నానంటే,అతను ఎవరికాలన్నయినా తినేస్తాడు కాబట్టి.కాసేపు చూసి ఇక లాభంలేదని టీ తాగి వద్దాం పద అని ఆషా సైకిల్ షాపువద్ద 5/- కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండక,అకస్మాత్తుగా అతను హానిమాన్ విగ్రహాని చుస్తూ,”అతనెందుకు అలా తల పట్టుకుని కూర్చున్నాడు”అని అడిగాడు.

  “పొన్నూరు లో ఉన్న విగ్రాహాలకి ఓ సరదా కధవుంది తెలుసా నీకు” అన్నాను.తెలీదన్నాడు సరే చెబుతా విను అని ఇలా మొదలు పెట్టాను.”నీ లాంటి ఒకడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా రాదా “అని హానిమాన్ ని అడిగాడు,హోనిమన్ “నేను చాలా రోగాలకి మందు కన్నుక్కున్నాను,కానీ ఎదువాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొనే మందు కనుక్కోలేక పోయాను,అందుకే ఈ రాష్ర్ట భవిష్యత్ ఏంటని ఎప్పుడూ ఆలొచిస్తూవున్తాను.నువ్వు నన్నడిగితే నేను ఏమి చెప్పను? ప్రత్యేకరాష్టాల విషయాల్లో అనుభవమున్న ఆయన ఎదురుగానే వున్నాడు వెళ్లి అడుగు” అనిపొట్టిశ్రీరాములు విగ్రహాన్ని చూపించాడు.సరే అని  పోయి ఆయన్ని అడిగితే”అప్పడయితే నేను  నిరాహారదీక్ష చేసాను గాబట్టి సజావుగా జరిగిపోయింది,ఇప్పుడేమో పక్కరాష్ట్రం kcr చేసాడు.నావారాసులెవరన్నా మళ్ళీ చేస్తారేమో అని అప్పట్నించి నిలబడి మరీ వెదుకుతున్నాను.కావాలికావాలి అనేవారేగాని,ముందుకొచ్చే వారు కనబడలా, అసలు దీనికంతటీకి కారణం అదిగో ఆరాజ్యాంగం రాసినాయిన అంబేద్కర్, పోయి గట్టిగా నిలదీయి “అన్నాడు.హమ్మయ్య కరెక్టుగా సమాధానం చెప్పేవాడు దొరికాడాని ఆనందంగా  వెళ్లి అడిగా.ఆయనికి ఒక్కసారిగా కోపమొచ్చింది,చిటాలునా లేచి నుల్చుని “ఎవడికి తెల్సు ,నీను రాసిన రాజ్యాంగం ఇది కాదు,వాళ్ళ ఇష్టమోచ్చినట్లు మార్చుకున్నారు.వారిలో ఒకరు రామారావు గారు, మీ అన్న ,మీ ప్రియతమ ముఖ్యమంత్రి ,ఎదురుగానే ఉన్నారు,వెనుక ఆదర్శనేత,రాజశేఖర్రెడ్డి వున్నారుగా నన్నెందుకు అడుగుతావు” అని చిరాకు పడ్డాడు.ఇంకానయం కొట్టలేదు సంతోషం అనుకుంటూ, బతుకు జీవుడా అనుకుంటూ,రాజశేఖర్రెడ్డి గారిని కలిసా అయన”అసలు నేనుంటే రాష్ట్ర విభజన అనేది లేదు,ఇదంతా ఇప్పుడున్నవారి తప్పు నా కు దీనితో సంభందం లేదు “అని ముసుగేసుకున్నాడు దిమ్మదిరిగి ,అన్నగారు రామారావు గార్ని కదిలిద్దామని అడిగి చూసా.”ప్రత్యేకరాష్ట్రం ఏమిటి?,ప్రత్యేక హోదా ఏమిటి? బ్రదర్,అంతామిధ్య”.అంటూ గాల్లోకి చేయి పైకి చూపాడు.అంతే అక్కడే ఉంటే నువ్వు మిధ్య నేను మిధ్య అసలు ఈ ప్రపంచమే మిధ్య అంటాడేమోనని భయమేసి చల్లగా జారుకుని రంగా గారి వైపు వచ్చా,అనుభవజ్ఞుడు,డక్కామోక్కీలు తిన్నవాడు కదాని  ఆయన సింపుల్ గా తేల్చేసాడు”ఏమి మాట్లాడాలన్నా మా హైకమాండ్ అనుమతి తప్పనిసరి, త్వరలోనే స్పందిస్తాం ,అధికార ప్రభుత్వము వార్ని ఎదురుంచుకుని  మమాల్నెందుకు ఇబ్బందిపెడతావాని వెళ్ళు “అని వేలితో దారికుడా చూపాడు.ఆయన చూపిన దారి వైపు చూస్తే వీరయ్యచౌదరి గారి విగ్రహం కనబడింది.వెళ్లి అడిగేసా.”నేను ,మరి నా కాలంలో ఇలా లేదు అయినా ఎదోవొకటి తప్పనిసరిగా చేద్దాం,ఎందుకైనా మంచిది జగమెరిగిన నాయకులు షరాబ్ బజారులో ఓ మూలగా వున్నారు వాళ్ళ అభిప్రాయం తెల్సుకునిరా “అన్నాడు.ఏమి చేద్దాంమన్నాడు,దేని మీద అభిప్రాయం అడగాలి,అసలు నేనేమి అడిగాను ఆయనేమి చెప్పాడు.. అర్ధం గాగ బుర్ర గోక్కుంటూ షరాబ్ బజారు వైపు వెళ్లాను.అక్కడున్న గాంధీ గారు,పొట్టిశ్రీరాములుగారు ,చాలాభాధపడుతూ “నిన్న గాక మొన్న వచ్చిన నాయకులందరూ నడి రోడ్డు మీద నున్చుంటీ మేము ఒక మూలన ఉన్నాము,అయినా మా సలహాలు  ఇప్పటి తరానికి పనికిరావుగా “అని నిట్టుర్చారు
   బుర్ర హీటేక్కి ఇక లాభంలేదని  తిరిగి ఆఫీసు కోస్తూ దారిలో ఓ లెమాన్ టీ తాగి గట్టిగా రెండు దమ్ముల్లాగి,ఆఫీసు కెళ్ళి,మళ్ళీ నాకూడికలు  తీసివేతలుతో రొమాన్సు ప్రారంభిన్చాను.లెక్కలతో రొమాన్సు ఏంటి అని సందేహమా ఈ సందర్భంలో మీకు తిలక్ “అమృతం కురిన రాత్రి” లో రెండు వాక్యాలు చెప్పాలి”స్పందించే హృదయం,ఆస్వాదించే మనసు వుంటే రాతి తోనే కాదు నాతి తో కూడా సురతం సాధ్యమే,చూసే హృదయం వుంటే రోడ్డు ప్రక్కన బండ రాయి అందంగా వుంటుంది.నిన్న కురిసిన మంచు బిందువు నేటికీ అందంగానే వుంటుంది.”-- ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681----POSTED IN MY FACEBOOK AND WHATSAPP  ON 29.09.2016

మోడీ టార్గెట్ సామాన్యుడే అని చెప్పటానికి మరో ఉదాహరణ



(గతంలో కొన్ని పోస్టుల ద్వారా ఈ అభిప్రాయాన్ని తెలియ జేశాను)
అసలు నల్లధనం ఎలా ఉత్పత్తి  అవుతుంది?దీనికి ప్రధానమైన మార్గాలు నాలుగు.అవేంటో చూద్దాం
Corruption-
              అన్ని రంగాలలో ఉదాహరణకు-మిస్టర్ Black pappa, ప్రభుత్వ సర్వీసులో ఒక అధికారి, ఒకరికి అనుకూలంగా చేయడం కోసం Mr.Shortcut  నుండి రూ .1 లక్ష పైగా నగదు డిమాండ్ (ఆమోదించడానికి) .క్రింది స్తాయి అధికారికి రూ .1 లక్ష , నగదు రూపేణా లేదా’ మరేదయినా సత్వరమార్గం  ద్వారా తీసుకుంటారు (ఎవరూ చెక్కు / డిమాండ్ డ్రాఫ్ట్ లో లంచం తీసుకోరు!). ఈ డబ్బు Black pappa పుస్తకాలలో లెక్కలోకి రాదు మరియు అతను దానిపై ఎలాంటి పన్నులు చెల్లించరు (ఇది ముడుపులు -చట్టబద్ధం కాదు కనుక దానిపై పన్నులను చెల్లించడానికి వీలు కాకవచ్చు)  - Rs.1,00,000 నల్లధనం ఉత్పత్తి.

ఆస్తి అమ్మకానికి –
               మిస్టర్ అత్యాశ , రూ .50 లక్షలు విలువ మొత్తం ఆస్తిని  మిస్టర్ మోసం నుండి ఆస్తిని కొనుగోలు. అతని చెక్కు / డిడి మరియు నగదు /బ్యాంకు లో Rs.35 లక్షల పడుతుంది. అతను Rs.35 లక్షల మీద స్టాంప్ డ్యూటీ చెల్లిస్తాడు, మరియు అమ్మినవాడు Rs.35 లక్షల విలువ పరిగణనలోకి మూలధన రాబడి పన్ను(క్యాపిటల్ గెయిన్) చెల్లిస్తాడు- Rs.15,00,000 నల్లధనం ఉత్పత్తి.

ఇన్వాయిస్ లేకుండా వస్తువులు / సేవలు అమ్మకం –
                 మీరు నిత్య జీవితంలో ఎన్ని సార్లు కొనుగోలుచేస్తారు? దుకాణదారుడు " వస్తువు  ధర రూ52800/-దాని మీద 14.5% చొప్పున అదనంగా పన్నులు Rs.60000 అవుతుంది"..... డిస్కౌంట్ లేదా? అతని నుండి సమాధానం "ఉంటుంది మేడమ్, నేను Rs.58,000 బిల్లు లేకుండా అందిస్తాను. మీకు కావాలంటే, నేను ఒక కాగితం మీద వ్రాయగలను "-సరే - Rs.58,000 నల్లధనం ఉత్పత్తి.

కల్పిత ఖర్చులను అకౌంటింగ్ –
               ఒక వ్యాపారవేత్త అతని అకౌంటెంట్ తో "నేను చాలా పన్ను చెల్లించాల్సిన అవసరం కలుగుతుంది కనుక కొన్ని కల్పిత ఖర్చులు ఏదో ఒకటి బుకింగ్ ద్వారా పన్నులు తగ్గించు”,. వ్యాపారవేత్త 25 లక్షలు అసలు లాభం వ్యతిరేకంగా రూ .15 లక్షలు లాభం ప్రకటించాడు అంటే, రూ .10 లక్షల నల్లధనం రూపొందించారు - 10 లక్షలు నల్లధనం ఉత్పత్తి.
మరి మొదటి వర్గాన్ని వదిలేసి తర్వాత మూడు వర్గాలనే టార్గెట్ ఎందుకు చేసాడు? ఆ వర్గంలో లాభపడేది ప్రభుత్వాన్ని నడిపే అధికారులు , రాజకీయులు కాబట్టి-ఆ ఒక్క వర్గంలో సామాన్యుడు పూర్తిగా ప్రత్యక్ష బాధితుడు కాబట్టి వదిలేసి ఉండవచ్చు. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Sunday, January 08, 2017

గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు



                      మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినము అని అదేదో గొప్ప పని చేసినట్టుగా గొంతు పెట్టి చెప్తారు. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది.
ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి.
కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం.
------------ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card