Saturday, August 06, 2016

ద్విచ‌క్ర వాహన బీమా - ముఖ్య విష‌యాలు



ద్విచక్ర వాహన బీమా - ముఖ్య విషయాలు: వాహ బీమా రిధిలోకి చ్చే అంశాలు, రాని అంశాలు

భారదేశంలో అన్ని వాహనాలకు ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చ్చితంగా ఉండాలి. మైన బీమాను ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కొనుగోలు చేయచ్చు. రెన్యువల్ సైతం రెండు మార్గాల్లోను చేసుకోవచ్చు. మీరు చెల్లించే ప్రీమియాన్ని నిర్ణయించే కారకాలు చాలా ఉన్నాయి. ఒకే మైన బీమా హామీ మొత్తానికి వివిధ కంపెనీలు వివిధ మొత్తాల్లో ప్రీమియాన్ని సేకరిస్తాయి

ద్విచక్ర వాహ బీమా రిధిలోకి చ్చే అంశాలు కింది కారణాల ల్ల వాహనానికి లిగే ష్టం: అగ్ని ప్రమాదం/ వాహ బీమా/లు/ తుపాను ప్రమాదం/ ఉగ్రదాడి / అల్లర్లు / మ్మె బాహ్య ప్రమేయం ల్ల రిగే ప్రమాదం రోడ్డు, రైలు, లేదా వాయు మార్గాల్లో తీసుకెళ్లేటప్పుడు స్వంతదారుకు,వాహనం డిపే వ్యక్తికి వ్యక్తిగ ప్రమాద బీమా వాహనంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదంలో గాయాలు అయినా లేదా ణం సంభవించినా స్వంతదారుడికి- వాహనం డిపే వ్యక్తికి రిహారం చెల్లిస్తారు. వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు రిగే ప్రమాదం హింసాత్మకంగా, ప్రమాదశాత్తూ, బాహ్య కారణాల ల్ల రిగినా రిహారం చెల్లింపు ర్తిస్తుంది. బాహ్య కారణాల ద్వారా ర్డ్ పార్టీ రీర గాయాలకు లిగే ష్టానికి రిహారం: (ర్డ్ పార్టీ బాడిలీ ఇంజురీ బిలిటీ) వాహనం డిపేటప్పుడు అనుకోని కారణాల ల్ల వేరే వ్యక్తికి లిగే గాయాలకు లేదా ఇతరుల ణాలకు సంబంధించిన ష్టాలను పాలసీ రిమితి మేరకు చెల్లిస్తుంది. ద్విచక్ర వాహ బీమా రిధిలోకి రాని అంశాలు: వాహనంలో సాధార అరుగుద మూలంగా ప్రమాదం రిగితే వాహనంలో కాలంతో పాటు రిగే రుగుద మూలంగా రిగే ష్టం లేదా ప్రమాదానికి ఎలక్ట్రికల్‌,మెకానికల్ బ్రేక్డౌన్భారదేశానికి వెలుప వాహనానికి రిగే ప్రమాదానికి చాలాసార్లు బీమా ర్తించదు ద్యం సేవించి వాహనం డుపుతుంటే రిగే ష్టం లేదా ప్రమాదం రైన డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహానాన్ని డిపి ఉంటే వ్యక్తికి అణు ప్రమాదాల ల్ల లిగే ష్టం లేదా ప్రమాదం వాహనాన్ని నిబంధ ప్రకారం వాడి ఉండపోతే సాధారణంగా మోటార్ పాలసీలు ఏడాది డువుకు తీసుకుంటారు. దీనిని తుది డువుకు ముందే రెన్యువల్ చేయించుకోవాలి. ఒక్కో బీమా కంపెనీ విధించే ప్రీమియంలు, అందించే సేవలు భిన్నంగా ఉంటున్నందున వ్యక్తులు పాలసీలను పోల్చి చూసుకోవాలి. ప్రీమియం క్కువ అని వెంటనే పాలసీని తీసుకునేందుకు ప్రత్నించకూడదు. మినహాయింపులు, రేజీ, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ(ఐడీవీ) వంటి వాటిని చూసుకోవాలి. ఒకవేళ ప్రీమియం క్కువ ఉండి, ఎక్కువ మినహాయింపులు, క్కువ రేజీ, క్కువ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ(ఐడీవీ) ఉంటే క్లెయిం సెటిల్మెంట్ మయంలో ఇబ్బందులు ప్పపోవచ్చు.

Read more at:
http://telugu.goodreturns.in/classroom/2016/07/inclusions-exclusions-two-wheeler-insurance-policy-001943.html


Wednesday, August 03, 2016

GST వలన సర్కారు చెబుతున్నట్లు మనకి లాభమా నష్టమా



VAT కి GST కి tax లెక్కకట్టే విధానం లో తేడా లేదు కనుక వ్యాపారులకి పెద్ద తేడా లేదు.కానీ వినియోగదారునికి అంటే ఆఖరి  కొనుగోలు దారునికి మాత్రం నష్టమే .ఎలాగంటే  ఇప్పుడున్న పద్ధతిలో service tax,exise tax, vat,cst  లాంటి అనేక పన్నులు భరించవలసి వస్తుంది కనుక అవేమి లేకుండా  వకటే పన్ను GST కడితే చాలు,అందువల్ల రేట్లు తగ్గి GDP పెరుగుతుంది అని సర్కారు చెబుతుంది ,కానీ చిక్కల్లా GST tax rate  వద్దే .ప్రస్తుతం  GST tax rate 18% గా వుండొచ్చని అంచనా  .మన A.P లో VAT tax rate ల తో పొల్చితే 14.50% ,5%,లేదా అంతకన్న తక్కువ శాతం  లో వున్న సరుకులకి అన్నీటికి  కుడా vat తప్ప మిగిలిన  Tax లు లేని వాటికి రేట్లు పెరగొచ్చు ,మిగిలిన taxలు వున్నాకూడా 14.50% సరుకులకి తప్ప మిగిలిన అన్ని సరుకుల రేట్లు పెరగొచ్చు .ఎందుకంటే మనకి 14.50% టాక్సులో వున్న వాటి కంటే తక్కువ లో వున్నవే ఎక్కువ.ముఖ్యంగా మందులు , ఎరువులు ,పురుగుమందులాంటివి  బాగా పెరగొచ్చు .కనుక సామన్యుడికి రాబొయే రొజుల్లో ధరల భారం తప్పదు

Thursday, July 14, 2016

A.P.Vat 200 online విధానంలో compulsory గా కావల్సిన మార్పులు






UPLOAD TEMPLATES
1.  excel template లో up lode చేసిన turnover automatic గా vat 200 లోకి వెళ్ళేలా అదనంగా , Purchase, sale  కి lines కేటాయించటం (అలా ఐతే  మన turnover కి template  కి deference అప్పుడే  చూసి సరి చేయవచ్చు  template లో వున్న turnover 200 లో lock అయి పోతే vat మనం enter చేయం కనుక variation on the spot చూస్తాం  ఇప్పడు మాదిరిగా special drive అవసరం లేదు పని easy, time save  ముఖ్యం గా vat  200  కి   vat turnover   కి   templates కి variation    వుండదు.
2.   sales/purchases returns వున్నపుడు Template కి బదులు credit/debit note template వాడటం లో      ఇబ్బందివుంది ఎలాగంటే సాధారణంగా  company లు  వారి  సరకు మన ఇన్వాయిస్ మీద తిరిగి తీసుకున్నప్పటికీ   credit/debit note లు  అదే నెలలో ఇవ్వవు తర్వాత ఎప్పుడో  కాని ఇవ్వరు ,మనం మాత్రం అదే నెలలో రిటన్ గా చూపించాలి  .అప్పుడు template అన్ని కాలంలు నింపలేము కనక అప్లోడు  అవదు.     

MIS MATCH
3.    purchases up lode కి, sale up lode కి, invoice confirmation కి  vat 200 filing కి  నిర్దిష్టమైన time  ఇవ్వాలి(ఇప్పుడున్న విధానంలో అన్నిటికి 20 last date అవటం వలన మనం ముందుగానే file చేసినా opposite వారు ఎప్పుడు file చెస్తారో,.ఏమి file చేస్తారో తెలియక opposite dealers కి మరియు వారి accountants  కి phone చేయలేక net, power, site, time, man power ఇలా  సినిమా కష్టాలతో పడలేక mismatches చూసే time లేక confirm చేసి return లు file చేయడం తర్వాత mismatch లని ఇబ్బంది పడటం శ్రమ తో కూడుకున్న పని అలాకాకుండ 10 days purchase and sale up lode కి  dead line  తర్వాత open చేయ కుండా పెట్టి, మిగిలిన  10 days mismatches లకి edit కి ,vat 200 కి ఇస్తే అవతలివారు ఏమికొట్టారో చూసుకుని  చేయడానికి time వీలవుతుంది
4.    mismatch edit పేజీ లో edit, delete తో పాటు insert Option కూడా ఇవ్వాలి  (1,2 కొత్తవి ఇన్వాయిస్ లు చేర్చాలంటే    మళ్ళి  వెనక్కి వెళ్ళి template download చేసుకొని  fill చేసి upload చేసి  ,మరల ఇక్కడకివచ్చి చూసుకోవలసి  వస్తుంది time Waste, Waste of Net  and man power)

PRINT/DOWNLOADS
5.   మ్యాచింగ్ అన్ మ్యాచింగ్,అప్లోడ్ ఇన్వాయిస్,మొదలైన అన్ని రిపొర్టులు print/Download విధానం కల్పించాలి   (లేక పొతే      నెట్ లోనే చెక్ చేయాలంటే వివిధ TECHNICAL ఆటంకాలున్నాయి                                              
STOCK RETURNS
  6.  ముఖ్యం గా purchase or sale returns(stock return) up lode template  ఇచ్చినప్పటికీ  అవి ఎక్కడ      కలపాలో  ఎక్కడ తగ్గిచ్చాలో  confusion వాటికి కూడా  ఒక విధానం  గాని  separate space  గాని    ఇవ్వాలి లేదా  negative గుర్తు తో  amounts enter చేసే అవకాశం అన్నా కల్పించాలి.   problem ముఖ్యం గా  input nil గా వుండి purchase returns వున్నపుడు బాగా తెలుస్తుంది(ఉదా: purchase returns కాబట్టి purchase లో తగ్గిస్తాం కానీ అసలు purchases నెలలో  లేనపుడు   compulsory గా sale  లో కలపాల్సిందే. అంటే  కొన్ని అటు కొన్ని ఇటు. గందర గోళాన్ని గూడా సరి చేయాలి  
ONLINE WAY BILLS   
7.  online way bills  నింపేటప్పుడు stock Returns  కి కూడా drop Down Menu Selection Option ఇవ్వాలి   (మన  కొనుగోలు సరకు తిప్పి పంపేటప్పుడు ఏది వర్తిస్తుందో  తెలియక ఎక్కువ మంది first Option selection  చెయడంవలన  అవన్ని purchases returns కి బదులు Web లో sales కి మాత్రమే validate అవుతున్నాయి 

                                             ధరణికోట సురేష్ కుమార్, ఆడిటర్  పొన్నూరు@9441503681

Thursday, May 12, 2016

సెక్షన్ 80సీకి 8 మార్గాలు..

చాలామంది సెక్షన్ 80సీ అనగానే బీమా, పీపీఎఫ్, పీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఈ సెక్షన్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందేందుకు అనేక పథకాలున్నాయి. సెక్షన్ 80సీలో ఉండి అంతగా ప్రాచుర్యం లేని ఇన్వెస్ట్‌మెంట్ పథకాల గురించి ఈ వారం తెలుసుకుందాం. వీటిల్లో ఏ పథకాన్ని ఎంచుకున్నా.. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

 యులిప్
 ఇన్వెస్ట్‌మెంట్, బీమా, పన్ను ప్రయోజనాలను యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్) అందిస్తుంది. చెల్లించిన ప్రీమియాన్ని వివిధ ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి వాటిలో వచ్చే లాభనష్టాలను అందిస్తాయి. కాబట్టి వీటి రాబడులపై ఎటువంటి హామీ ఉండదు. వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన ఐదేళ్ల వరకు వైదొలిగే అవకాశం లేదు. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగానే పరిగణించాలి. చిన్న వయస్సు ఉండి, రిస్క్ సామర్థ్యం ఉన్న వారికి ఈ పథకాలు అనువుగా ఉంటాయి.

 ఈఎల్‌ఎస్‌ఎస్
 ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం లేదా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. వీటి రాబడులు కూడా ఈక్విటీ మార్కెట్స్‌పై ఆధారపడి ఉంటాయి. పన్ను ఆదాచేసే పథకాలన్నింటిలోకి తక్కువ లాకిన్ పీరియడ్‌ను కలిగివున్న పథకమిది. వీటి రాబడిపై ఎటువంటి పన్ను భారం ఉండకపోవడం, ఇన్వెస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వైదొలిగే అవకాశం ఉండటం ప్రధాన ఆకర్షణ. వీటి రాబడులు మార్కెట్ల ఒడిదుడుకులకు అనుగుణంగా మారతాయి. ఇవి దీర్ఘకాలిక దృష్టితో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైనవి. అధిక రాబడిని ఆశించే వారు, రిస్క్‌కు సిద్ధపడ్డవారు ఇన్వెస్ట్ చేయొచ్చు. డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే పన్ను భారం లేని ఆదాయాన్ని మధ్యమధ్యలో పొందే అవకాశం ఉంది?

 స్టాంప్ డ్యూటీ
 ఇంటిని కొనుగోలు చేసినప్పుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వ్యయాన్ని సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇంటిని కొన్న సంవత్సరంలో మాత్రమే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలి.

 ఇంటి రుణం
 రుణం తీసుకొని ఇంటిని నిర్మించిన వారికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో అసలుకు (అంటే వడ్డీ కాకుండా)చెల్లించే మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బీ) కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

 సుకన్య సమృద్ధి..

 దీన్ని కేంద్రం ఈ మధ్యే ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవింగ్ పథకాల్లో అత్యధిక కాలపరిమితి దీనికే ఉంది. దీని కాలపరిమితి అమ్మాయికి 21 ఏళ్లు లేదా వివాహ తేదీ ఏది ముందైతే అది. ఈ పథకంపై అందించే వడ్డీ ఏటా మారుతుంది. ఈ ఏడాది వడ్డీరేటును 9.2 శాతంగా ప్రకటించారు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక అమ్మాయిపై ఒక ఖాతా మాత్రమే ప్రారంభించగలరు. గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరిట ప్రారంభించొచ్చు. దగ్గర్లోని పోస్టాఫీసులో  ఈ పథకాన్ని ప్రారంభించొచ్చు.

 పెన్షన్ పథకాలు..

 పెన్షన్ నిధి కోసం ఇన్వెస్ట్ చేసే యాన్యుటీ ప్లాన్ కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఎల్‌ఐసీతో సహా అనేక బీమా కంపెనీలు ఈ పథకాలను అందిస్తున్నాయి.

 ఎన్‌ఎస్‌సీ, డిపాజిట్లు..
 పోస్టాఫీసు అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఐదేళ్ల పోస్టాఫీసు, బ్యాంకు డిపాజిట్లు కూడా సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. రిస్క్ లేకుండా స్థిరమైన వడ్డీ ఆదాయం కావాలనుకునే వారికి ఇవి బాగుంటాయి. కానీ ఈ పథకాల వడ్డీపై పన్ను భారం ఉంటుంది. దీన్ని ప్రతి ఏటా ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది.

 ట్యూషన్ ఫీజులు..
 పిల్లల చదువులకయ్యే వ్యయాలపై కూడా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇది మీరు చెల్లించే మొత్తం ఫీజులపై లభించదు. కేవలం అందులో పేర్కొన్న ట్యూషన్ ఫీజుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతేకాని డొనేషన్స్, ల్యాబ్, డెవలప్‌మెంట్ ఫండ్ రూపంలో వసూలు చేసే ఫీజులకు ఇది వర్తించదు. నర్సరీ విద్య నుంచి విశ్వవిద్యాలయం కోర్సులకు వరకు ఇది వర్తిస్తుంది. కాని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

Address for Communication

Address card