Friday, April 18, 2014

వ్యాట్ ద్వారా ఏ జిల్లాలో ఎంత ఆదాయం

విలువ ఆధారిత పన్ను:

రాష్ట్ర సొంత పన్ను సంబంధిత ఆదాయ వనరుల్లో సింహ భాగం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారానే వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.66 వేల కోట్లు కాగా అందులో 75 శాతానికి పైగా అంటే రూ.42,795 కోట్లు వ్యాట్ ద్వారానే వచ్చింది. ఇందులో 66 శాతానికి పైగా.. అంటే రూ. 28,277 కోట్లు కేవలం హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో.. జిల్లాలు, రంగాల వారీగా ఆదాయ వివరాలను సేకరించి కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సమర్పించే పనిలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యాయి. 
 అందులో భాగంగా 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2012-13 వరకు వ్యాట్ ద్వారా ఏ జిల్లాలో ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. ఈ వివరాలను జీవోఎంకు పంపనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్‌లో వస్తున్న వ్యాట్ ఆదాయాన్ని సీమాంధ్ర కోల్పోవాల్సి వస్తుందని, సీమాంధ్ర ప్రాంతం ఆదాయ వనరులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయాన్ని సీమాంధ్రకు కూడా పంపిణీ చేయాల్సి ఉంటుందని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Saturday, April 12, 2014

మనం గుడికి వెళ్ళినపుడు తీర్ధం తీసుకుంటాం కదా? ఎందుకో తెలుసా?

మనం గుడికి వెళ్ళినపుడు తీర్ధం తీసుకుంటాం కదా? ఎందుకో తెలుసా?
తీర్ధం అంటే ఓక గిన్నెలో పొసిన కాసిని నీళ్ళు కాదు

హిందూ శాస్త్రీయ గ్రంధాలు ఏమి చెపుతున్నాయంటే
ఒక రాత్రి అంతా రాగి పాత్రలో క్రిష్ణ తులసి ఆకులు వేసి 
మరుసటి రోజు ఆ నీటిని తీర్ధంగా తీసుకోవాలని చెపుతున్నాయి
దీనిలో ఉన్న సైంటిఫిక్ కారణాలు  ఎంటంటే  తులసిలో ఇరీడియం  అనే ధాతువు
వుంటుంది అది రాగి అనగా కాపర్ తో కలసి రసాయనక చర్య జరిపి
వెంటనే శక్తినిచ్చే (ఇనిస్టెంట్ ఎనర్జి ) ధాతువు గా తయారువుతుంది .
అది మనకి తెలియ చేయటానికే దేవాలయల్లో తీర్ధం గా అలవాటు  చేస్తారు 
నిత్యం మనలని అలవాటుగా తీసుకొమ్మని .
అందుకే ఎవరైనా ఆఖరి క్షణాల్లో  ఉన్నపుడు  కొంచెం   తులసినీళ్ళు నోట్లో పొయమంటారు
కొంచెం శక్తి వస్తే  బ్రతుకుతాడని .
 కనుక స్నేహితులారా
 ఇకపై మీరెప్పుడైనా  ఏగుడికి వెళ్ళిన ఇంట్లొ అయినా పై విధంగా ప్రయత్నం చేయండి.
చేయమని మీరు చెప్పగలిగిన పూజారికి చెప్పండి 
శాశ్త్రాన్ని  పాటించి మిమ్మల్ని  మీ మతాన్ని గౌరవించండి

Saturday, April 05, 2014

తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ సేవలకు మీ పి.సి.నుండే బుక్ చేసుకోండి

వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets


వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets
ముందుగా ఈ రకంగానైనా తిరుమల శ్రీవారిని సేవించుకోవడం అదృష్టంగా భావించి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను..
శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి TTD కేంద్రాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా నేరుగా మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి, కళ్యాణోత్సవం, నిజపాద దర్శనం, తోమాల సేవ వంటి వివిధ సేవల టిక్కెట్లని ఎంత సులభంగా బుక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.
ఏమీ ప్లాన్ చేసుకోకుండా అక్కడికెళ్లి దర్శనం చేసుకోవడం చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది.  అలా కాకుండా మీరు మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి టిక్కెట్లు దొరికే తేదీల్ని పరిశీలించుకుని మీకు అనువుగా ఉన్న తేదీన టిక్కెట్లు బుక్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు ప్రింటౌట్లు తీసుకుని వెళితే ఎలాంటి అసౌక్యరం లేకుండా శ్రీవారి దర్శనం సుఖవంతంగా ఉంటుంది.
గమనిక: శ్రీ వేంకటేశ్వరుని కొలిచే ప్రతీ భక్తునికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చేయడం ద్వారా వారికి స్వామి వారి దర్శనభాగ్యం కలగడానికి మీ వంతు సహకరించగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets
ముందుగా ఈ రకంగానైనా తిరుమల శ్రీవారిని సేవించుకోవడం అదృష్టంగా భావించి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను..


శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి TTD కేంద్రాల చుట్టూ తిరిగి ఇబ్బంది
పడాల్సిన పనిలేకుండా నేరుగా మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి, కళ్యాణోత్సవం,
నిజపాద దర్శనం, తోమాల సేవ వంటి వివిధ సేవల టిక్కెట్లని ఎంత సులభంగా బుక్
చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.


ఏమీ ప్లాన్ చేసుకోకుండా అక్కడికెళ్లి దర్శనం చేసుకోవడం చాలా సందర్భాల్లో
ఇబ్బందికరంగానే ఉంటుంది.  అలా కాకుండా మీరు మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి
టిక్కెట్లు దొరికే తేదీల్ని పరిశీలించుకుని మీకు అనువుగా ఉన్న తేదీన
టిక్కెట్లు బుక్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు ప్రింటౌట్లు తీసుకుని
వెళితే ఎలాంటి అసౌక్యరం లేకుండా శ్రీవారి దర్శనం సుఖవంతంగా ఉంటుంది.


గమనిక: శ్రీ వేంకటేశ్వరుని కొలిచే ప్రతీ భక్తునికీ ఉపయోగపడే ఈ వీడియోని
మీ మిత్రులతోనూ షేర్ చేయడం ద్వారా వారికి స్వామి వారి దర్శనభాగ్యం
కలగడానికి మీ వంతు సహకరించగలరు.


వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets

నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోబోయే RAR, ZIP ఫైళ్ల లోపల ఏమేం ఉన్నాయో ముందు ప్రివ్యూ చూసుకోండి

ఇంటర్నెట్‌లో తెలిసీ తెలియని వెబ్‌సైట్ల నుండి చాలామంది గుడ్డిగా ZIP, RAR ఫైళ్లని డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఈ కంప్రెస్డ్ ఫైళ్లలో వైరస్‌లూ, కీలాగర్లు, ట్రోజాన్ల వంటివి నిక్షిప్తం చేయబడే అవకాశం ఉంది. సో గుడ్డిగా ఫైళ్లని డౌన్‌లోడ్ చేసుకోకుండా ఈ వీడియోలో నేను చూపించినట్లు మీరు డౌన్‌లోడ్ చేసుకోబోయే RAR, ZIP ఫైళ్ల లోపల ఏమేం ఉన్నాయో ముందు ప్రివ్యూ చూసుకోండి.. ఆ తర్వాతే సేఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

Saturday, March 29, 2014

ప్రతి ఇంటినుండి స్వామి వారి కళ్యాణమునకు తలంబ్రాలు


 




ఉగాది నుండి మీ ఇంటిలో  సభ్యులు స్నానానంతరం[ఉదయంలేదా సాయంత్రమైనా ] వడ్లు  తీసుకుని  "శ్రీరామ" అని గోటితో వలచి ఆ బియ్యమును పవిత్రంగా ఒక పాత్రలో పోయండి. ఇలా నవమి వరకు తయారు   చేసిన బియ్యమును నవమి ఉదయాన్నే తీసుకెళ్ళి మీ ఊరిలో కళ్యాణం జరుగుతున్న మండపంలో తలంబ్రాలు నిమిత్తం అక్కడి అర్చక,పురోహితులకు అందజేయండి.  అవి  ఎన్నైనా పరవాలేదు. వందగ్రాములు కావచ్చు,అరకేజీ కావచ్చు. మీ కున్న సమయాన్ని బట్టి స్వామి నామస్మరణతో తయారు చేసి పంపండి. మీ ఇంటిలో ధనధాన్యములు వృధ్ధి  చెంది ,పరంధాముని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ తొమ్మిదిరోజుల నామస్మరణతో మీ గృహంలో గల దోషాలు తొలగిపోతాయి. ఇల్లు శక్తితరంగాలతో వెలుగొందుతుంది.

నల్లడబ్బు చిద్విలాసాలు

నల్లడబ్బు చిద్విలాసాలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించడం అన్ని విధాల సమర్థనీయం. పన్నుల ఎగవేత, అక్రమ మార్గాల్లో సంపాదన, అప్పణంగా కొట్టేయడం, తప్పుడు లెక్కలు చూపించడం తదితర అనేక రూపాల్లో మేటలు వేసిన ఈ పాపిష్టి సొమ్ము వాస్తవానికి దేశ ప్రజలకు అందులోనూ పేద ప్రజానీకానికి చెందవలసింది. దీని పరిమాణం ఎంత అనేదానిపైనా పలు విధాల లెక్కలున్నాయి. కనీసం 25లక్షల కోట్లు వుంటుందనేది ఒక లెక్క కాగా విదేశీ బ్యాంకుల్లోనే 70 లక్షల కోట్లు వుందనేది మరో లెక్క. లెక్కలకు అందకుండా దాచిపెట్టిన సొమ్ము గురించి ఖచ్చితమైన లెక్కలు ఎలాగూ ఆశించలేము. దాని నిగ్గు తేల్చాలని సుప్రీం కోర్టు 2011లోనే ఆదేశించినా మూడేళ్ల అనంతరం ఇప్పటికి కూడా దాన్ని ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇది నిర్లక్ష్యం కాదు. యాదృచ్చికం అంతకన్నా కాదు. అసలు ఈ అక్రమ ధనం అనకొండలా పెరిగిపోవడానికి కారణమే ప్రభుత్వ విధానాలు. పాలక పక్షాలన్నీ కాంగ్రెస్‌ బిజెపి తెలుగుదేశం ఏదైనా సరే హద్దూపద్దూ లేని ఎన్నికల ఖర్చు కోసం ఇతర ఆర్భాటాలూ అట్టహాసాల కోసం ఈ అక్రమ ధన రాశులపైన కార్పొరేట్‌ సంస్థల చేయూత పైనా అధారపడతాయనేది అందరికీ తెలుసు. ఇందులో పైకి కనిపించేదే వందల కోట్లు కాగా అగుపించనిది అందుకు అనేక రెట్లు వుంటుందనేది వాస్తవం. అంతెందుకు? ఈ వారంలోనే న్యాయస్థానం ముందుకు వచ్చిన కేసులు చూస్తే చాలు ధన ప్రభావం తెలుస్తుంది. సహారాధినేత సుబ్రతో ముఖర్జీ వేల కోట్ల బకాయిల ఎగవేత కేసులో జైలుకు వెళ్లడం.. ఐపిఎల్‌ అవినీతి సామ్రాట్‌ శ్రీనివాసన్‌ను బిసిసిఐ అధ్యక్షుడుగా ఎందుకు కొనసాగిస్తున్నారని అక్షింతలు వేయడం, బొగ్గు కుంభకోణంలో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు కావడం అన్నీ ఆ కోవలోవే. అంతెందుకు? విదేశీ బ్యాంకుల్లోని రహస్య ఖాతాల్లో గుట్టలు గుట్టలుగా దొంగ సొమ్ము దాచుకున్నవారిలో అత్యధికులు భారతీయ ప్రముఖులేనని వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియస్‌ అసాంజే కూడా ప్రకటించడం తెలిసిన విషయమే. తమను కోరితే ఆ ఖాతాల వివరాలు వెల్లడిస్తామని ఆ దేశాలు చెప్పినా మన ప్రభుత్వం ముందుకు రాకపోవడం అనుమానాలు ధృవీకరించింది. హసన్‌ అలీ అనే భారతీయ వ్యాపారికి సంబంధించిన 36 వేల కోట్ల అక్రమ ధనం బయటపడిన తర్వాత డొంక కదిలిస్తే మరెన్ని పాములు బయటకు వస్తాయోనన్న భయం అక్రమాధిపతులను ఆవరించింది. ఈ కారణంగానే అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా పెడచెవిన పెట్టింది.
అవినీతి పద్ధతుల్లో సంపాదించిన సొమ్మును తమ ధనాన్ని తప్పుడు మార్గాల్లో విదేశాలకు పంపించడం, మళ్లీ తప్పుడు కంపెనీల పేర్లతో రప్పించి పెట్టుబడి రాయితీలు కూడా పొందడం సర్వసాధారణంగా మారింది. భారత్‌తో ఒప్పందాల కారణంగా పన్నులు వేయకుండా విదేశీ ధన ప్రవాహాలను అనుమతించే వాటిలో మారిషస్‌ ముఖ్యమైంది గనకే మారిషస్‌ మార్గమని దీనికి పేరొచ్చింది. సరళీకరణ విధానాల తర్వాత ఈ తరహా తరలింపులు అయిదు రెట్లు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక షేర్‌ మార్కెట్లలోనూ ఇతర స్పెక్యులేటివ్‌ మార్గాలలోనూ అపార లాభాలు పొందినా దీర్ఘకాల పెట్టుబడి ఆదాయం కింద అలాగే సెక్యూరిటీ లావాదేవీల లాభాల కింద పన్నులు దాదాపు ఉండవు. దేశంలో కేవలం అరవై మందిగా ఉన్న సహస్ర కోటీశ్వరులపై లేదా సూపర్‌ రిచ్‌పై అదనపు పన్నుల మాటే వుండదు. అది కొత్త సంపదలు పెంచేస్తుంటుంది. కార్పొరేట్‌ లాభాల పైన, విదేశాలకు వాటాల తరలింపు పైన పన్నుల వేధింపు చాలా నామమాత్రం. ఇలాటి చాలా చాలా మార్గాలలో సంపదలు పోగుపోసుకున్న వారు నెమ్మదిగా వాటిని విదేశాలకు తరలించడం మొదలు పెడతారు. ఇక రాజకీయ నేతలు తప్పుడు పద్ధతులలో మూటలు కట్టుకున్నా వాటిని రహస్యంగా దాచివుంచడం తప్ప బహిరంగంగా ప్రదర్శించలేరు. ఇలాటి వాటన్నిటి కారణంగానే నల్లడబ్బు, అందులోనూ విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న అక్రమ డబ్బు అంతూపంతూ లేకుండా పెరిగిపోతున్నది. చాలా కాలం తమ దగ్గర రహస్య ఖాతాలలో దాచిన సొమ్ము వివరాలు చెప్పడానికి నిరాకరించే స్విడ్జర్లాండ్‌ వైఖరి మారి అధికారికంగా అడిగితే ఇవ్వడానికి ముందుకొస్తున్నది. ప్రజాస్వామ్యం పారదర్శకత వంటి విలువలను నిజంగా విశ్వసించే ప్రభుత్వమైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ చిట్టాలన్నీ తెప్పించి వుండేది. కాని జరిగింది అందుకు పూర్తి భిన్నం. పార్లమెంటులో అనేక సార్లు నిలదీసినా దాటవేత తప్ప సూటి సమాధానం పూజ్యమైంది. అత్యున్నత న్యాయస్థానం చెప్పినా అంతేనని ఇప్పుడు అదే ఆగ్రహించడాన్నిబట్టి అర్థమైపోయింది. కొంతమంది చెబుతున్నట్టు పన్నులు తగ్గించే అర్థక్రాంతి ఫార్ములాలు ఆచరణలో దాన్ని మరింత పెంచడానికే పనికి వస్తాయి. అయినా లెక్కలోనే చూపని వాటిపై పన్ను వేయడం వేయకపోవడం అన్న ప్రశ్నకు ఆస్కారం ఎక్కడీ
రేపు రాబోయే ప్రభుత్వాలైనా ఈ నల్లడబ్బు విశృంఖల విన్యాసాలను ఆపాలంటే పైన చెప్పిన ఖచ్చితమైన చర్యలు తీసుకోవలసి వుంటుంది. దాంతో పాటు అసలు ఎన్నికల రంగంలో ధన ప్రభావాన్ని అరికట్టడం మరింత ముఖ్యం. కార్పొరేట్‌ విరాళాల కోసం ఎగబడే పార్టీలు అక్రమార్జన అండదండలతో అధికారానికి వచ్చే పార్టీలు వాటిని అదుపు చేస్తాయనుకోవడం అవివేకం. ఉదాహరణకు అధికారికంగానే కాంగ్రెస్‌కు 193 కోట్లు, బిజెపికి 172 కోట్లు విరాళాలు ఇలాటి వారినుంచి అందినట్టు నమోదైంది. 92 శాతం కరోడ్‌పతులు కాంగ్రెస్‌కు, 85 శాతం మంది బిజెపికి ధనం సమకూర్చినట్టు వెల్లడైంది. ఈ ఏడాది కూడా 14 కార్పొరేట్‌ కంపెనీలు ఈ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకై ట్రస్టులు ఏర్పాటు చేశారన్నది సమాచారం. ఇలా విరాళాలిచ్చిన వారిలో 300 దాతలు తమ ఆదాయపన్ను పాన్‌ నెంబరు ఇవ్వడానికి నిరాకరించారంటే సంగతి అర్థమవుతుంది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరిన చందంగా ఇలాటి పార్టీలు నల్లడబ్బును అరికడతాయనుకోవడం భ్రమ. ప్రజా ఉద్యమాల ఒత్తిడి పెరిగి ప్రభుత్వాల స్వభావాన్నే మార్చగలిగితే తప్ప ఆ పాపపు కొండలు కదలవు, కరగవు.

Friday, March 28, 2014

ట్యాక్స్.. టెన్షన్


 మార్చి వస్తుందంటే ఉద్యోగుల్లో గుండెదడ మొదలవుతుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి విధిగా ఫిబ్రవరి జీతం నుంచి ఇన్‌కంట్యాక్స్ చెల్లించాల్సి ఉండటమే.

         ఆదాయపు పన్ను చెల్లించగా ఉద్యోగులకు మిగిలే జీతం నామమాత్రమే. ప్రతి ఉద్యోగి మార్చి 1న తీసుకునే ఫిబ్రవరి జీతం నుంచి విధిగా ఇన్‌కంట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. రూ.16667 గ్రాస్‌పైబడి జీతం తీసుకునే ఉద్యోగులంతా విధిగా ఆదాయపు పన్ను ఫైల్ చేయాల్సి ఉంది.
        ఒకేసారి ఆదాయపు పన్ను భారం పడకుండా ఏడాదికి పడే పన్నును మూడు విడతలుగా చెల్లించవచ్చు. ఆర్థిక సంవత్సరంలో జూన్ చివరికి పన్ను మొత్తంలో 30 శాతం ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసి ఆదాయపు పన్ను శాఖకు జమ చేయాల్సి ఉంది. ఈ బాధ్యత డీడీఓలపై ఉంది. డిసెంబర్ చివరికి 60 శాతం చెల్లించాలి. ఈ ప్రకారం ఆదాయపు పన్ను చెల్లిస్తే ఉద్యోగులకు భారం అనిపించదు.
       కానీ చాలా వరకు ఉద్యోగులు జూన్, డిసెంబర్‌లలో చెల్లించకుండా ఫిబ్రవరి జీతం నుంచే చెల్లించాల్సి రావడంపై ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది.
        ఏడాదికి రూ.2 లక్షల ఆదాయంలోపు ఉన్న వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.2 లోల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు 10శాతం, రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ఏ స్థాయిలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా 3 శాతం సర్‌చార్జీ చెల్లించాల్సి ఉంది. సర్‌చార్జీలో ఒక శాతం హయ్యర్ ఎడ్యుకేషన్, 3 శాతం పాఠశాల విద్యకు వినియోగిస్తారు.
       వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి  డ్రాయింగ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ (డీడీఓ)లు ఉన్నారు. ఫిబ్రవరి జీతం నుంచి డీడీఓలు విధిగా ఆదాయపు పన్నును కట్ చేసి ట్రెజరీకి జీతాల బిల్లును పంపాల్సి ఉంది.
 ఆదాయపు పన్నుకు మినహాయింపులు:
 ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అధికారులు, పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
1.  ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్, గ్రూప్ ఇన్స్యూరెన్స్, ఎల్‌ఐసీ వంటి సేవింగ్‌తో పాటు ట్యూషన్ ఫీజులు ఉంటే రూ. లక్ష   వరకు మినహాయింపు ఉంటుంది.
2. ఇవి గాక ఎడ్యుకేషన్‌లోన్‌పై వడ్డీ మాత్రమే ఆదాయపు పన్ను రాయితీగా లభిస్తుంది.
3. హౌసింగ్ లోన్‌పై వడ్డీ రూ.1.50 లక్షల వరకు ఇన్‌కంట్యాక్స్ రాయితీ ఉంటుంది.
4. మెడికల్ ఇన్స్యూరెన్స్‌కు సంబంధించి రూ.15 వేలు వరకు రాయితీ లభిస్తుంది.
5. 80 శాతం పైగా డిజబులిటీ ఉంటే రూ.లక్ష, 50 శాతం పైబడి ఉంటే రూ.50 వేలు ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది.

Address for Communication

Address card