Friday, June 29, 2018

లైసె ఫెయిర్ (laissez-faire)



                         లైసె ఫెయిర్ (laissez-faire)  అని ఇంగ్లీష్ లో ఓపదం వుంది.అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది దాదాపు లేకపోవడం. దేంట్లోనూ ప్రభుత్వం జ్యోక్యం చేసుకోకపోవటం .అంతా పెట్టుబడిదారీ కంపెనీల ఇష్టారాజ్యానికి వదిలివేయడం. కేవలం ఆస్తి హక్కులను (అది కూడా బడా ధనికుల ఆస్తి హక్కులు మాత్రమే అని ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు) సంరక్షించడానికి తప్ప ప్రభుత్వం మిగిలినవన్నీ వదిలేయాలన్న అవగాన దానిలో ఇమిడి ఉంటుంది.
అయితే ఇది ఊహలకే పరిమితం. ఇటువంటి పరిస్ధితి ఆధునిక చరిత్రలో ఎక్కడా, ఏ దేశంలో లేదు.
ప్రభుత్వాలు అవసరం అయితే దాని నిర్వహణకు సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు మరికొంత సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు ఇంకా సిబ్బంది కావాలి. ఇది చివరికి నాలుగోతరగతి ఉద్యోగుల దగ్గర ఆగుతుంది. అంటే ఈ నాలుగు లేదా ఐదు మెట్ల సిబ్బంది మొత్తం ఆ ప్రభుత్వాలను ఆధిపత్యంలో ఉంచుకునే ధనికవర్గాలకు సేవలు చేయడానికే అన్నమాట!  దీన్నే బ్యూరోక్రసీ అంటున్నారు.
               బ్యూరోక్రసీ ఉండగానే సరిపోదు. జనాన్ని అదుపులో ఉంచడానికి బలగం కావాలి. అది సాయుధమై ఉండాలి. వాళ్ళే పోలీసులు, పారా మిలట్రీ, సైన్యం. ఆ తర్వాత  రాజకీయ నిర్వహణ కోసం చట్ట సభలు ఉండాలి. ఆయా ధనిక గ్రూపుల మధ్య తగాదా తీర్చే వ్యవస్ధ (కోర్టులు) ఉండాలి. కోర్టులు అందరి కోసం అనుకుంటారు గానీ వాస్తవానికి వాటి అసలు ఉద్దేశ్యం ధనిక పెత్తందార్ల తగాదాలు తీర్చి పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందాలు కుదర్చడమే. అలాగని పచ్చిగా చెప్పలేరు గనక ప్రజాస్వామ్యం పేరుతో అందరి తగువులూ తీర్చుతున్నట్లు నటిస్తారు. కానీ సరిగ్గా గమనిస్తే సామాన్యులకు న్యాయం ఎప్పుడూ అందుబాటులో ఉండదని చూస్తూనే ఉన్నాం. అలాగే పోలీసుల వద్ద కూడా సామాన్యుడికి అరుదుగా ప్రవేశం దొరుకుతుంది.
                         ఇవన్నీ, అనగా బ్యూరోక్రసీ, చట్ట సభలు, కోర్టులు, రక్షణ బలగాలు అన్నీ కలిసినదే రాజ్యం. పరిమిత అర్ధంలో దీన్ని ప్రభుత్వం అంటున్నాం. డబ్బు పెట్టుకోగలిగినవాడికే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే రాజ్యం అనేది డబ్బున్నవాడి కోసమే పని చేస్తుంది. సామాన్యులను పాలిస్తుంది. రాజుల కాలంలోరాజ్యం వీరుల భోజ్యంఅన్నారు. ఇప్పుడు కూడా అదే నిజం. కాకపోతే వీరులకు అర్ధం ఇప్పుడు కత్తి తిప్పేవాడని కాకుండా నోటు తిప్పేవాడని చెప్పుకోవాలి. నోటు తిప్పేవాళ్లెవరు? ఇంకెవరు, ధనిక వర్గాలు. వారికి రకరకాల పేర్లు: భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులుఇలా!
                       కాబట్టి లైసె ఫెయిర్ అనేది ఎన్నడూ ఆచరణలో లేదు. సాధ్యం కాదు కూడా. పెట్టుబడిదారుల ప్రయోజనాల రీత్యా కూడా అది సాధ్యం కాదు. సాధ్యం అయితే పెట్టుబడి గ్రూపుల మధ్య తగాదాలు పరిష్కారం చేసే రాజ్యాంగ యంత్రం బలహీనంగా ఉండి వారిని కూల్చివేసే శ్రామికవర్గ విప్లవాల పని సులువవుతుంది.
                     నూతన ఆర్ధిక విధానాలకూ లైసె ఫెయిర్ కూ తేడా ఇప్పటికే గ్రహించి ఉంటారు మీరు

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card