వారం క్రితం ఒక
పెద్దాయనను కలిశాను.. ఏవో పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నాం.
వాళ్ల ఇంట్లో టీవీ లేదు.
పదివేలు పెడితే టీవీ వస్తుంది కదా.. కొనుక్కోవచ్చు కదా అని కొందరు మిత్రులు ఉచిత
సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఇంట్లో టీవీ వద్దనుకుని కొనుక్కోలేదు.
పిల్లలు సెవన్త్, టెన్త్, ఇంటర్ చదివేప్పుడు కేబుల్ కనెక్షన్ కట్
చేయించడం వేరు.. అసలు టీవీ అనే అలంకరణ లేకుండా వుండడం వేరు.ఈ రోజుల్లో మరీ తక్కువ
ఆ పెద్దాయనకు ఒక ఆఫీసు
వుంది. ఆయనకు ఒక కొడుకు. ,చదువుతున్నాడు.
శని, ఆదివారాలు ఆఫీసుకు వచ్చి
పనిచేస్తేనే స్కూలు ఫీజులు కడతానని తండ్రి నిక్కచ్చిగా చెప్పాడు. ఆ పిల్లాడు
శనాదివారాలు ఆఫీసుకు వచ్చి తనకు చేతనైన పని చేస్తుంటాడు.
...
సరిగ్గా నిన్ననే.. ఓ
మీడియా వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. వారి ప్రొఫైల్ చూశాను. ఒక ప్రభుత్వ
పాఠశాలలో విద్యార్థుల చేత కంకర రాళ్లు మోయించడం, బడి శుభ్రత కార్యక్రమంలో పిలకాయలను కూలీలుగా
వాడుకోవడం గురించి తాను రాసిన కథనం, అది పత్రికలో అచ్చయిన వైనం గురించి ఓ పోస్టు వుంది.
...
పిల్లలకు చదువు ఎంత
అవసరమో పనికూడా అంతే అవసరం. పిల్లలతో పనిచేయించడం బాలకార్మికత్వం కాదు. అది వారి
ఎదుగుదలకు పనికొచ్చే విషయమే.
అసలు మనకు.. మన పిల్లలు Multiple
Tasks ఎదుర్కోవడం, నేర్చుకోవడం ఇష్టం వుండదు. సింగిల్ టాస్క్,
సింగిల్ ఎయిమ్, సింగిల్ టార్గెట్ వుండాలనుకుంటాం.
...
మనకు సినిమా ప్రభావాలు
బాగా వుంటాయి. పేద పిల్లాడు.. రోజుకు ఇరవై గంటలు వెట్టి చాకిరీ చేస్తుండడంలాంటి
సినిమా ప్రభావాలు బాగా వుంటాయి. కానీ.. ఓ సంపన్న కుర్రాడు, ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. రోజుకు ఇరవై నాలుగు
గంటలు చదువు తో పాటు చాకిరీ చేస్తుండడంలాంటివి మనకు కన్నుకానవు.
...
పిల్లలను చదివించండి..
కానీ పనిచేయించండి.
అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, కలుపు పీకడం, గొడ్లను మేపడం దగ్గరనుంచి అన్ని పనులను
నిర్దాక్షిణ్యంగా చేయించండి. చేయకపోతే ఈత బరితెతో నాలుగు పీకులు పీకండి. వీపుమీద
వాతలు తేలాయని వాడు టీవీ నైన్ దగ్గర మొరపెట్టుకొని నాలుగు మార్కులు సంపాదించుకుంటే
సంపాదించుకోనివ్వండి.
...
కానీ తల్లిదండ్రులకు ఓ
సామాజిక బాధ్యత వుంది. వారి మీద ప్రేమతో దాన్ని మర్చిపోకండి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment